ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Government Hospitals: డైటీషియన్‌ పదోన్నతుల్లో వసూళ్ల పర్వం!

ABN, Publish Date - Aug 12 , 2024 | 03:27 AM

ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో డైటీషియన్‌ పోస్టుల పదోన్నతుల్లో వసూళ్ల పర్వం మొదలైంది. కొందరు యూనియన్‌ నేతలు సీనియారిటీ జాబితాలో ఉన్నవారి నుంచి డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

  • ఇద్దరు యూనియన్‌ నేతల హస్తం?

  • జోన్‌ 1లో 20 పోస్టులకు 35 మంది పోటీ

  • ఈ ఫైల్‌ త్వరగా కదలాలంటే డబ్బులు

  • ఇవ్వాలంటూ అభ్యర్థుల నుంచి వసూళ్లు

హైదరాబాద్‌, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో డైటీషియన్‌ పోస్టుల పదోన్నతుల్లో వసూళ్ల పర్వం మొదలైంది. కొందరు యూనియన్‌ నేతలు సీనియారిటీ జాబితాలో ఉన్నవారి నుంచి డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఫైల్‌ త్వరగా ముందుకెళ్లాలంటే సచివాలయంలో, వైద్య విద్య సంచాలకుల కార్యాలయ సిబ్బందికి డబ్బులివ్వాల్సి ఉంటుందని నమ్మబలికినట్లు తెలిసింది. ఈ వసూళ్ల పర్వంలో కరీంనగర్‌ జిల్లా, హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు నేతలు ఉన్నట్లు సమాచారం. ఆ నేతల పేర్లు కూడా పదోన్నతుల జాబితాలో ఉన్నాయని ఉద్యోగులు చెబుతున్నారు.


రాష్ట్రవ్యాప్తంగా 42 పోస్టులు ఉండగా... 42 మంది సీనియారిటీ జాబితాలో ఉన్నారు. జోన్‌ వన్‌లో 20 పోస్టులకు 35 మంది, రెండో జోన్‌లో 22 పోస్టులకు కేవలం 17 మందే సీనియారిటీ జాబితాలో ఉన్నారు. జోన్‌ వన్‌లో పోస్టులు తక్కువ, అభ్యర్థులు ఎక్కువ మంది ఉండడంతో వసూళ్లకు ఆస్కారం ఏర్పడింది. దీనిపై సమగ్ర విచారణ జరిపి, వసూళ్లకు పాల్పడిన వారిని, డబ్బులిచ్చిన వారిని అనర్హులుగా ప్రకటించాలని మిగతా వారు డిమాండ్‌ చేస్తున్నారు. సీనియారిటీ జాబితాలో ఉన్న అభ్యర్థుల్లో కొంతమంది ప్రభుత్వం నుంచి అనుమతి లేకుండానే డైటీషియన్‌ కోర్సులు చేసినట్లు తెలుస్తోంది.


నిబంధనల ప్రకారం ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి సర్వీసులో ఉంటూ ఇతర విద్యా కోర్సులు చదవాలనుకుంటే కచ్చితంగా ప్రభుత్వం నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్‌వోసీ) తీసుకోవాలి. కొంతమంది పరీక్షల సమయంలో కూడా సెలవు పెట్టకుండా విధుల్లోనే ఉన్నారని సమాచారం. పరీక్షలు రాయకుండానే కోర్సులు ఎలా పూర్తి చేశారో, అధికారులు వారి పేర్లను జాబితాలో ఎలా పెట్టారోనన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Updated Date - Aug 12 , 2024 | 03:27 AM

Advertising
Advertising
<