Health Department: వైద్యశాఖ బదిలీల్లో మోసం!
ABN, Publish Date - Jul 18 , 2024 | 03:57 AM
వైద్య ఆరోగ్యశాఖలో గురువారం బదిలీల ప్రక్రియ మొదలు కానున్న నేపథ్యంలో కొందరు ఉద్యోగులు ఉన్నచోటనే కొనసాగేందుకు కొత్త మోసానికి తెరలేపారు.
బదిలీ తప్పేందుకు ఆఫీస్ బేరర్ల అవతారమెత్తిన ఉద్యోగులు
ఒక్క సంఘం నుంచే ఆఫీస్ బేరర్లుగా 300 మందికి పత్రాలు
ఆ యూనియన్‌కు అసలు గుర్తింపే లేదంటున్న ఉద్యోగులు
అధికార పార్టీ అనుబంధ సంఘం ముసుగులో దందా
రూ.2 కోట్ల మేర వసూళ్లు.. నేటి నుంచి శాఖలో బదిలీలు
హైదరాబాద్, జూలై 17 (ఆంధ్రజ్యోతి): వైద్య ఆరోగ్యశాఖలో గురువారం బదిలీల ప్రక్రియ మొదలు కానున్న నేపథ్యంలో కొందరు ఉద్యోగులు ఉన్నచోటనే కొనసాగేందుకు కొత్త మోసానికి తెరలేపారు. సంఘాల నేతలకు లక్షల్లో ముట్టజెప్పి, ఆ సంఘాల్లో తాము ఆఫీస్ బేరర్లుగా పనిజేస్తున్నట్లు తప్పుడుపత్రాలు తెచ్చుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయు. నిబంధనల ప్రకారం గుర్తింపు పొందిన సంఘాలలో అధ్యక్షులు, ఉ పాధ్యక్షులు, కార్యదర్శి, ట్రెజరర్‌లకు బదిలీల నుంచి మినహాయింపు ఉంటుంది.
వైద్య ఆరోగ్యశాఖలో ప్రస్తుతం టీఎన్‌జీవో, టీజీవో సంఘాలకు మాత్రమే ప్రస్తుతం గుర్తింపు ఉంది. కానీ కాంగ్రెస్ అనుబంధ సంఘంగా ఉన్న ఐఎన్‌టీయూసీ(పబ్లిక్ హెల్త్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్)-3194 కింద కొందరు నేతలు ఒక్కో జిల్లా నుంచి 10-15 మందికి అలా మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 300-350 మంది ఉద్యోగులకు ఆఫీస్ బేరర్లుగా తప్పుడు పత్రాలిచ్చిన ట్లు తెలుస్తోంది. అయితే ఈ సంఘానికి ఎటువంటి గుర్తింపు లేదని వైద్యారోగ్యశాఖ ఉద్యోగులు, ఇతర సంఘాల నేతలు చెబుతున్నారు.
జిల్లాలను బట్టి వసూళ్ల పర్వం:
ఆఫీస్ బేరర్లుగా తప్పుడు పత్రాలిచ్చేందుకు ఆయా జిల్లాను బట్టి ఉద్యోగుల నుంచి డబ్బు లు వసులు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ లాంటి జిల్లా ల్లో రూ.3-4లక్షల వరకు, ఇతర జిల్లాల్లో అక్కడి పరిస్థితులను బట్టి రూ.25-50 వేల వరకు వసూలు చేసినట్లు తెలుస్తోంది. మొత్తంగా ఈ వ్యవహారంలో కోటిన్నర నుంచి రెండు కోట్ల వ రకు వసూళ్లు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. సదరు సంఘం నేతల నుంచి ఆఫీస్ బేరర్ల పత్రాలు పొందిన వారిలో హెల్త్ అసిస్టెంట్ ఫీమేల్, మల్టీపర్పస్ హెల్త్‌సూపర్‌వైజర్ (ఎంపీహెచ్‌ఎ్‌స)ఫీమేల్, మల్టీపర్పస్ హెల్త్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్(ఎంపీహెచ్‌ఇవో), పబ్లిక్ హె ల్త్‌నర్స్ (పీహెచ్‌ఎన్), ల్యాబ్ టెక్నిషియన్, ఫా ర్మాసిస్ట్, రేడియోగ్రాఫర్స్, అసిస్టెంట్ పారామెడికల్ ఆఫీసర్, మెడికల్ సోషల్ వర్కర్స్ ఉన్నారు.
దందాను ఆపి.. విచారణ చేపట్టాలి
అధికార పార్టీ అనుబంధ సంఘం పేరుతో జరిగిన ఈ దందాను ఆపాలని వైద్య ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఇంతమంది ఆఫీస్‌బేరర్ల పేరిట బదిలీల నుంచి మినహాయింపు కోరుతుంటే ప్రజారోగ్య సంచాలకులు ఏం చేస్తున్నారని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఈ దందాలో ఉన్నతాఽధికారులకు పాత్ర ఉందని ఆరోపిస్తున్నారు. దీనిపై తక్షణమే విచారణ జరిపించాలని, నిబంధనల మేరకు గుర్తింపు పొందిన సంఘాల్లోని ముగ్గురు లేదా నలుగురికే బదిలీల నుంచి మినహాయింపునివ్వాలని కోరుతున్నారు. సాధారణ ఉద్యోగుల బదిలీ హక్కులను కాపాడాలని, తప్పుడు పత్రాలను ఇస్తున్న సంఘంపై కఠిన చర్యలు తీసుకోవాలని సర్కారును తెలంగాణ వైద్య ప్రజారోగ్య ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కర్నాటి సాయిరెడ్డి డిమాండ్ చేశారు.
ఇవేం బదిలీలు?
ట్రాన్స్‌ఫర్లపై ప్రభుత్వ వైద్యుల్లో అసంతృప్తి
హైదరాబాద్, జూలై 17 (ఆంధ్రజ్యోతి): వైద్య ఆరోగ్యశాఖలో బదిలీల పర్వం తీవ్ర గందరగోళానికి దారితీస్తోంది. ముఖ్యంగా వైద్యవిద్య సంచాలకుల(డీఎంఈ) పరిధిలోని బదిలీలపై అధ్యాపకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డీఎంఈ పరిధిలో సాధారణ బదిలీ ప్రక్రియలో భాగంగా త ప్పనిసరిగా ట్రాన్స్‌ఫర్ అయ్యే జాబితాను రూపొందించారు. ఇందులో ఉన్నవారంతా బదిలీల కోసం దరఖాస్తు చేసుకోమన్నారు. దాంతో ఇష్టంలేని అభ్యర్థులు కూడా బదిలీల కోసం అప్లై చేశారు. ఆ జాబితాలో ఉన్న వారందర్నీ నిర్బంధంగా బదిలీ చేస్తామని అధికారులు చెబుతున్నారని వైద్యులంటున్నారు. ముందు రెండు సంవత్సరాలకు పైగా పనిచేసిన వారిని బదిలీలకు దరఖాస్తు చేసుకోమన్నారని, తీరా చేశాక.. మ్యాండేటరీ జాబితాలో లేకపోతే బదిలీలు ఉండవంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఒకవేళ ఆ జాబితాలో లేకున్నా బదిలీ కావాలంటే.. ప్రభుత్వ ఉద్యోగి అయిన భార్య/భర్త ఉండాలి. భర్త చనిపోయి ఉండటం, ఒంటరి మహిళగా ఉండటం, మెడికల్ గ్రౌండ్ అంటే క్యాన్సర్ ఇతర దీర్ఘకాలిక వ్యాఽధిగ్రస్తులై ఉండాలి.. అప్పుడే ట్రాన్స్‌ఫర్‌కు అర్హులని అం టున్నారు. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న వందలో ఐదుగురికి కూడా న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదని తెలంగాణ ప్రభుత్వ బోధనాస్పత్రుల వైద్యుల సంఘం ప్రతినిధి డాక్టర్ మాదల కిరణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
Updated Date - Jul 18 , 2024 | 03:57 AM