ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Coaching center: డీఎస్సీ వాయిదాకు ఆందోళన వెనుక కోచింగ్‌ సెంటర్ల మాఫియా

ABN, Publish Date - Jul 11 , 2024 | 03:54 AM

డీఎస్సీని వాయిదా వేయాలన్న ఆందోళన వెనుక ప్రైవేట్‌ శిక్షణ సంస్థల మాఫియా ఉందని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కీ ఆరోపించారు.

  • టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కీ

హైదరాబాద్‌, జూలై 10(ఆంధ్రజ్యోతి): డీఎస్సీని వాయిదా వేయాలన్న ఆందోళన వెనుక ప్రైవేట్‌ శిక్షణ సంస్థల మాఫియా ఉందని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కీ ఆరోపించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నిరుద్యోగులు స్వేచ్ఛగా పరీక్షలు రాసేందుకు సిద్ధమవుతుంటే వాయిదా వేయాలనడంలో కుట్ర కోణం దాగుందన్నారు. సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులతో కమిటీ వేసి.. ఈ కుట్ర కోణంపై విచారణ చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. కేసీఆర్‌, కేటీఆర్‌ ఉసిగొల్పితే గ్యాదరి కిషోర్‌, బాల్క సుమన్‌, గువ్వల బాలరాజు సీఎం రేవంత్‌ రెడ్డిపై సంస్కారహీనంగా మాట్లాడుతున్నారని ప్రభుత్వ విప్‌ రామచంద్రునాయక్‌ మండిపడ్డారు.


పేపర్లు లీకై విద్యార్థులు రోడ్డున పడ్డప్పుడు, సునీల్‌ నాయక్‌, ప్రవళిక చనిపోయినప్పుడు ఈ సన్నాసులు ఎక్కడికి పోయారని ప్రశ్నించారు. సీఎం రేవంత్‌ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తన పదవి పక్కన పెట్టి వారి అంతు చూస్తానని, 33 జిల్లాల్లోనూ కేసులు పెట్టిస్తానని ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ ప్రీతమ్‌ హెచ్చరించారు. ధర్నాలు చేసి అరెస్టైన వారిలో ఎవరూ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నవారు లేరన్నారు.


కోచింగ్‌ సెంటర్లకు మార్గదర్శకాలు అవసరం: పీడీఎ్‌సయూ

హైదరాబాద్‌ సిటీ: రాష్ట్రంలో కోచింగ్‌ సెంటర్ల ఏర్పాటుకు మార్గదర్శకాలు విడుదల చేయాలని, కోచింగ్‌ సెంటర్ల మాఫియాను అరికట్టాలని పీడీఎ్‌సయూ రాష్ట్ర అధ్యక్షుడు మొగిలి వెంకటరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో ఒక్కో భవనంలో పదికి పైగా కోచింగ్‌ సెంటర్లు ఏర్పాటు చేయడం, ఒక్కో ఫంక్షన్‌ హాలులో వందల మంది విద్యార్థులను కూర్చోబెట్టి తరగతులు నిర్వహిస్తున్న పరిస్థితి ఇంకా కొనసాగుతోందన్నారు.

Updated Date - Jul 11 , 2024 | 03:54 AM

Advertising
Advertising
<