Allu Arjun Case: అల్లు అర్జున్ కేసులో ఊహించని ట్విస్ట్
ABN, Publish Date - Dec 17 , 2024 | 03:40 PM
Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అరెస్టైన పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ బెయిల్ మీద విడుదలై బయటకు వచ్చారు. ఆయన్ను టాలీవుడ్ ప్రముఖులంతా వచ్చి పరామర్శించారు.
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అరెస్టైన పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ బెయిల్ మీద విడుదలై బయటకు వచ్చారు. ఆయన్ను టాలీవుడ్ ప్రముఖులంతా వచ్చి పరామర్శించారు. రానా నుంచి విజయ్ దేవరకొండ దాకా, దిల్ రాజు నుంచి నాగవంశీ వరకు స్టార్లంతా బన్నీ ఇంటికి క్యూ కట్టారు. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లారు ఐకాన్ స్టార్. ఈ కేసులో తదుపరి ఏం జరుగుతుందోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో ఊహించని ట్విస్ట్ ఇచ్చారు పోలీసులు.
నేరుగా అక్కడికే..
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో హైదరాబాద్ పోలీసులు మరో ట్విస్ట్ ఇచ్చారు. హీరో అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్‌ను రద్దు చేయాలని సుప్రీం కోర్టుకు వెళ్లనున్నారు పోలీసులు. ఈ కేసులో క్వాష్ పిటిషన్‌పై వాదనల్లోనే బన్నీకి బెయిల్ ఇచ్చింది తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్. దీంతో ఆయన జైలు నుంచి విడుదలై ఇంటికి వెళ్లిపోయారు. అయితే ఆయన బెయిల్ రద్దు కోసం నేరుగా సుప్రీం కోర్టుకు వెళ్లనున్నారు హైదరాబాద్ పోలీసులు. దీంతో అల్లు అర్జున్ నెక్స్ట్ ఎలాంటి స్టెప్ వేస్తారనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది.
సుదీప్ రియాక్షన్
సంధ్య థియేటర్ కేసులో అల్లు అర్జున్ మున్ముందు ఇంకా ఎన్ని సవాళ్లు ఎదుర్కొంటారోననే డిస్కషన్ నడుస్తోంది. అయితే ఆయన కోసం తెలుగు చిత్ర పరిశ్రమ మొత్తం కదిలిరావడం హైలైట్‌గా మారింది. తాజాగా ఈ ఘటనపై ప్రముఖ హీరో, కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ రియాక్ట్ అయ్యారు. ఎవరైనా సరే మూవీ థియేటర్‌కు ఎంజాయ్ చేయడానికే వెళ్తారని ఆయన అన్నారు. కానీ ఇలాంటి అనూహ్య ఘటన జరుగుతుందని ఎవ్వరూ ఊహించి ఉండరు అని చెప్పారు. ఇలాంటి దుర్ఘటనలు జరగాలని ఎవరూ అనుకోరని సుదీప్ వ్యాఖ్యానించారు. ఈ ఘటనపై సీనియర్ యాక్టర్ సుమన్ కూడా మాట్లాడారు. బన్నీ అరెస్ట్‌ను ఆయన ఖండించారు. ఆయనకు ఉన్న క్రేజ్ దృష్ట్యా థియేటర్ యాజమాన్యం, పోలీసులు పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకోవాల్సిందన్నారు.
Also Read:
హైడ్రా కీలక ప్రకటన.. ఆ ఇళ్లను కూల్చబోమంటూ..
ఆ ఇళ్లకు ఈఎంఐలు మీరు చెల్లిస్తారా.. కవిత సూటి ప్రశ్న
బీఆర్‌ఎస్ నేతల నిరసనపై సీతక్క ఇంట్రెస్టింగ్ కామెంట్స్
For More Telangana And Telugu News
Updated Date - Dec 17 , 2024 | 03:52 PM