Allu Arjun Case: సంధ్య థియేటర్ ఇక గతమేనా..
ABN, Publish Date - Dec 17 , 2024 | 04:52 PM
Allu Arjun Case: సంచలనంగా మారిన సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో ఊహించని ట్విస్ట్ ఇచ్చారు పోలీసులు. వాళ్లకు నోటీసులు జారీ చేశారు.
సంచలనంగా మారిన సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు ఊహించని మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఆ తర్వాత మధ్యంతర బెయిల్ రావడంతో విడుదల చేశారు. బన్నీ బెయిల్ రద్దు కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించాలని హైదరాబాద్ పోలీసులు నిర్ణయించారు. ఇదే సమయంలో కేసులో ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. సంధ్యా థియేటర్ యాజమాన్యానికి చిక్కడపల్లి పోలీసులు షాక్ ఇచ్చారు. థియేటర్ లైసెన్స్ పై షోకాజ్ నోటీసులు ఇచ్చారు.
ఇక క్లోజేనా?
సంధ్య థియేటర్ నిర్వహణ లోపాలపై వివరణ ఇవ్వాలంటూ షోకాజ్ నోటీసు జారీ చేశారు పోలీసులు. ఒక మహిళ మరణానికి దారి తీసిన ఘటనపై సినిమాటోగ్రాఫ్ లైసెన్స్‌ను ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలని అడిగారు. 10 రోజుల్లోపు వివరణ ఇవ్వాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. సంధ్య 70ఎంఎంతో పాటు సంధ్య 35ఎంఎం థియేటర్లు ఒకే ప్రాంగణంలో ఉన్నాయి. వీటి ఎంట్రీ, ఎగ్జిట్ కూడా ఒకే వైపు ఉన్నాయి. ఎంట్రీ, ఎగ్జిట్‌లను సూచించే సరైన సైన్ బోర్డులు లేవు. దీంతో పాటు థియేటర్ నిర్వహణలో పలు లోపాలను గమనించారు పోలీసులు. తాజా నోటీసులతో థియేటర్ క్లోజేనా అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
Also Read:
అల్లు అర్జున్ కేసులో ఊహించని ట్విస్ట్
హైడ్రా కీలక ప్రకటన.. ఆ ఇళ్లను కూల్చబోమంటూ..
ఆ ఇళ్లకు ఈఎంఐలు మీరు చెల్లిస్తారా.. కవిత సూటి ప్రశ్న
బీఆర్‌ఎస్ నేతల నిరసనపై సీతక్క ఇంట్రెస్టింగ్ కామెంట్స్
For More Telangana And Telugu News
Updated Date - Dec 17 , 2024 | 05:16 PM