Congress: గాంధీభవన్‌కు అల్లు అర్జున్ మామ!
ABN, Publish Date - Dec 24 , 2024 | 03:22 AM
సినీ హీరో అల్లు అర్జున్ మామ.. కాంగ్రెస్ పార్టీ నేత కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి సోమవారం గాంధీభవన్‌లో మెరిశారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీని కలిసి మాట్లాడారు.
దీపాదాస్ మున్షీని కలిసిన కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి
హైదరాబాద్, డిసెంబరు 23(ఆంధ్రజ్యోతి): సినీ హీరో అల్లు అర్జున్ మామ.. కాంగ్రెస్ పార్టీ నేత కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి సోమవారం గాంధీభవన్‌లో మెరిశారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీని కలిసి మాట్లాడారు. అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారం.. అధికార, ప్రతిపక్షాల మధ్య వాద, ప్రతివాదాలకు దారి తీస్తున్న నేపథ్యంలో.. ఆయన పార్టీ కార్యాలయానికి వచ్చి మున్షీని కలవడం ఆసక్తికరంగా మారింది! అయితే.. దీపాదాస్ మున్షీకి ఆయన పరిచయం లేకపోవడంతో అతి కొద్ది నిమిషాలు మాత్రమే మాట్లాడి తిరిగి వెళ్లిపోయారు. తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని, పార్టీ నేతలను కలిసేందుకు వచ్చానంటూ ఆయన మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
చంద్రశేఖర్‌రెడ్డి దీపాదాస్ మున్షీని కలిసినప్పుడు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పత్రికా సమావేశంలో ఉన్నారు. కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి వచ్చి వెళ్లి పోయారని తెలుసుకున్న ఆయన.. ఫోన్ చేసి మాట్లాడారు. అనంతరం మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ, కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి తనకు మంచి స్నేహితుడని, ఆయన వచ్చినప్పుడు మీడియా సమావేశంలో ఉన్నానని, దీంతో ఆయన దీపాదాస్ మున్షీని కలిశారని చెప్పారు. ఆమెతో చంద్రశేఖర్‌రెడ్డికి పరిచయం లేకపోవడంతో తొందరగా మాట్లాడి వెళ్లి పోయారని వెల్లడించారు. చంద్రశేఖర్‌కు తాను ఫోన్ చేశానని, ఒకటి, రెండు రోజుల్లో కూర్చుని మాట్లాడదామని చెప్పానని అన్నారు.
Updated Date - Dec 24 , 2024 | 03:22 AM