ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Amrapali: నగరం చుట్టూ డంపింగ్‌ యార్డులు..

ABN, Publish Date - Sep 28 , 2024 | 10:28 AM

మహానగరం చుట్టూ డంపింగ్‌ యార్డులు ఏర్పాటు చేసేందుకు జీహెచ్‌ఎంసీ(GHMC) కసరత్తు చేస్తోంది. జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డుపై వ్యర్థాల భారం తగ్గించేలా ప్రత్యామ్నాయ స్థలాలను గుర్తించారు. ఆ భూములను బల్దియాకు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని రంగారెడ్డి, సంగారెడ్డి కలెక్టర్లకు కమిషనర్‌ ఆమ్రపాలి(Commissioner Amrapali) లేఖ రాశారు.

- ప్యారానగర్‌, లక్డారం, ఖానాపూర్‌, మల్కాపూర్‌లో స్థలాల గుర్తింపు

- బల్దియాకు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు ఆమ్రపాలి లేఖ

హైదరాబాద్‌ సిటీ: మహానగరం చుట్టూ డంపింగ్‌ యార్డులు ఏర్పాటు చేసేందుకు జీహెచ్‌ఎంసీ(GHMC) కసరత్తు చేస్తోంది. జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డుపై వ్యర్థాల భారం తగ్గించేలా ప్రత్యామ్నాయ స్థలాలను గుర్తించారు. ఆ భూములను బల్దియాకు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని రంగారెడ్డి, సంగారెడ్డి కలెక్టర్లకు కమిషనర్‌ ఆమ్రపాలి(Commissioner Amrapali) లేఖ రాశారు. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని లేఖలో కోరారు.

ఇదికూడా చదవండి: Gandipet Reservoir: మరో రెండు గేట్ల ఎత్తివేత..


ప్యారానగర్‌తో పాటు రంగారెడ్డి జిల్లా తలకొండపల్లిలోని ఖానాపూర్‌, సంగారెడ్డి పటాన్‌చెరు(Khanapur, Sangareddy Patancheru) మండలంలోని లక్డారం, దుండిగల్‌, చౌటుప్పల్‌లోని మల్కాపూర్‌ ప్రాంతాల్లో భూములను డంపింగ్‌ యార్డు ఏర్పాటుకు గుర్తించారు. పరిసర ప్రాంతాల ప్రజలకు దుర్వాసన రాకుండా, పర్యావరణంపై ప్రభావం పడకుండా అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో వ్యర్థాల పునర్వినియోగం, నిర్వహణ చేపడతామని అధికారులు చెబుతున్నారు. ఇందులో భాగంగా తడి చెత్త నుంచి బయో గ్యాస్‌, సేంద్రియ ఎరువులు, పొడి చెత్త నుంచి విద్యుదుత్పత్తికి ఏర్పాట్లు చేయనున్నారు.


అధునాతన పద్ధతుల్లో నిర్వహణ

ప్యారానగర్‌లోని 152 ఎకరాల స్థలాన్ని డంపింగ్‌ యార్డు కోసం గతంలో గుర్తించారు. రహదారి, ఇతరత్రా నిర్మాణ పనులూ ప్రారంభించారు. స్థానికులు అడ్డుకోవడంతో తాత్కాలికంగా బ్రేక్‌ పడింది. ఇక్కడ 15 మెగావాట్ల సామర్థ్యంతో చెత్త నుంచి విద్యుదుత్పత్తి చేసే ప్లాంట్‌ను నిర్మించాలని భావిస్తున్నారు. రోజూ 270 టన్నుల తడి చెత్తతో బయోగ్యాస్‌ ఉత్పత్తికి ఏర్పాటుచేయనున్నారు. చెత్తనూ భూగర్భంలోని బంకర్‌లో వేసి తడి, పొడి చెత్తగా వేరు చేస్తామని అధికారులు చెబుతున్నారు. కాగా, ప్రస్తుతం నగరంలో రోజూ 7,500 మెట్రిక్‌ టన్నుల చెత్త వెలువడుతోంది. ప్రస్తుతం జవహర్‌నగర్‌లో లక్ష టన్నులకుపైగా టన్నుల వ్యర్థాల తడి, పొడి చెత్త కుప్పలు ఉన్నాయి.


ఇదికూడా చదవండి: హర్ష సాయి కేసులో కొత్త ట్విస్ట్..

ఇదికూడా చదవండి: కాంగ్రెస్‌కు పోయే కాలం దగ్గర పడింది..

ఇదికూడా చదవండి: మేము నిర్మిస్తే కాంగ్రెస్‌ కూల్చేస్తోంది: కేటీఆర్‌

ఇదికూడా చదవండి: పెద్ద వెంచర్లన్నీ పెండింగ్‌లోనే!

Read Latest Telangana News and National News

Updated Date - Sep 28 , 2024 | 10:28 AM