ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Hyderabad: మల్లారెడ్డికి మరో షాక్‌!

ABN, Publish Date - May 25 , 2024 | 04:37 AM

బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి, మేడ్చల్‌ ఎమ్మెల్యే మల్లారెడ్డికి మరో షాక్‌ తగిలింది. మొన్నటికి మొన్న సుచిత్రలోని భూ వివాదం తాలూకు కాక చల్లారకముందే తాజాగా బొమ్మరాసిపేట గ్రామ పరిధిలోని ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్లలో ఆయన అక్రమంగా నిర్మించిన ప్రహరీ తెరమీదకొచ్చింది.

  • బొమ్మరాసిపేట పెద్ద చెరువు ఎఫ్‌టీఎల్‌, బఫర్‌జోన్‌లో

  • రెండేళ్ల క్రితం ఆరెకరాల పట్టా భూమి కొనుగోలు

  • చుట్టూ ఆర్నెల్ల క్రితం ప్రహరీ నిర్మాణం

  • ఫిర్యాదుతో కూల్చివేసిన అధికారులు

శామీర్‌పేట, హైదరాబాద్‌, మే 24 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి, మేడ్చల్‌ ఎమ్మెల్యే మల్లారెడ్డికి మరో షాక్‌ తగిలింది. మొన్నటికి మొన్న సుచిత్రలోని భూ వివాదం తాలూకు కాక చల్లారకముందే తాజాగా బొమ్మరాసిపేట గ్రామ పరిధిలోని ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్లలో ఆయన అక్రమంగా నిర్మించిన ప్రహరీ తెరమీదకొచ్చింది. ఈ ప్రహరీని శుక్రవారం అధికారులు కూల్చివేశారు. రంగారెడ్డి జిల్లా శామీర్‌పేట మండలం బొమ్మరాసిపేట పరిధిలోని పెద్ద చెరువు ఎఫ్టీఎల్‌, బఫర్‌జోన్లలోని సర్వే నంబర్‌-408లోని ఆరు ఎకరాల పట్టా భూమిని రెండేళ్ల క్రితం మల్లారెడ్డి కొన్నారు.. ఏడాది క్రితం రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. ఆరు నెలల క్రితం ఆ భూమికి చుట్టూ ప్రహరీని నిర్మించారు.


అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం చెరువు ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్లలోని భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు. ఈ క్రమంలో స్థానిక ప్రజలు, మల్లారెడ్డి అక్రమాలకు పాల్పడుతున్నారంటూ కలెక్టర్‌, నీటిపారుదల శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. క్షేత్రస్థాయిలో పరిశీలన అనంతరం పెద్దచెరువు పరిధిలోని ఎఫ్‌టీఎల్‌, బఫర్‌జోన్‌లలో మల్లారెడ్డి నిర్మించిన ప్రహరీని కూల్చివేయాలని కలెక్టర్‌, ఇరిగేషన్‌ శాఖ ఉన్నతాధికారులు మండల స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు శుక్రవారం ఉదయం 7 గంటలకు అధికారులు సిబ్బంది.. యంత్రాలతో బొమ్మరాసిపేటకు వెళ్లారు. పెద్ద చెరువు సమీపంలో మల్లారెడ్డికి చెందిన పట్టా భూమిలో ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్లలోని ప్రహరీని కూల్చివేయించారు. కాగా పెద్ద చెరువు బఫర్‌జోన్‌ పరిధిలోని 408, 407 సర్వే నంబర్లలో పోలీసు శాఖలోని నలుగురు అధికారులు వెయ్యి గజాల చొప్పున కొనుగోలు చేసి అక్రమంగా ప్రహరీలను నిర్మించారు. స్థానికుల ఫిర్యాదుతో ఈ గోడలనూ అధికారులు కూల్చివేశారు.


సుచిత్ర భూ వివాదంలో లభించని ఊరట

సుచిత్ర పరిధిలోని ఓ భూవివాదంలో హైకోర్టును ఆశ్రయించినా మల్లారెడ్డికి ఊరట లభించలేదు. కుత్బుల్లాపూర్‌ మండలం, జీడిమెట్ల గ్రామంలో 82, 83 సర్వేనంబర్లలోని 2.14 ఎకరాల విషయంలో అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని, వారు జోక్యం చేసుకోకుండా ఆదేశిలివ్వాలని కోరు తూ హైకోర్టులో మల్లారెడ్డి, అల్లుడు రాజశేఖర్‌ రెడ్డి, కుమారుడు మహేందర్‌ రెడ్డి పిటిషన్‌ వేశారు. దీనిపై జస్టిస్‌ అనిల్‌కుమార్‌ విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదిస్తూ వివాదంలో ఉన్న భూమిని 2011లో మల్లారెడ్డి కొనుగోలు చేసి, లీజుకు ఇచ్చారని, ఈనెల 18న కుత్బుల్లాపూర్‌ తహసీల్దార్‌ తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా పోలీసుల సహాయంతో సర్వే చేపట్టారని పేర్కొన్నారు. కొంతమంది సంఘవ్యతిరేక శక్తులు భూ కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం.. సదరు భూమిపై సివిల్‌ కేసులు పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో ఎలాంటి ఆదేశాలివ్వలేమని, సంబంధిత రికార్డులు, కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.

Updated Date - May 25 , 2024 | 04:37 AM

Advertising
Advertising