ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Hyderabad: వేల కోట్ల సర్కారీ భూములు హాంఫట్‌!

ABN, Publish Date - Jun 07 , 2024 | 02:43 AM

హైదరాబాద్‌ నగరంలో శాసనసభ ఎన్నికల ముందు వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములు రికార్డుల్లో ప్రయువేటు వ్యక్తుల పరమైనట్లు తెలుస్తోంది. రంగారెడ్డి కలెక్టరేట్‌ కేంద్రంగా ఈ వ్యవహారం జరిగింది. కలెక్టరేట్‌లోని ధరణి ఆపరేటర్లను ఆకట్టుకొని, కోట్ల రూపాయలు ముట్టజెప్పి రియల్టర్లు ఇష్టానుసారంగా ప్రభుత్వ భూములను ప్రయివేటు వ్యక్తుల పేర రాయించినట్లు ఆర్థిక నేరాల విభాగం పోలీసుల దర్యాప్తులో బయటకు వస్తోంది.

  • రంగారెడ్డి కలెక్టరేట్లో ధరణి ఆపరేటర్ల మాయాజాలం

  • గండిపేట, బాలాపూర్‌, సరూర్‌నగర్‌, రాజేంద్రనగర్‌ మండలాల్లో ప్రభుత్వ భూములకు పాస్‌బుక్‌లు జారీ

  • గత సర్కార్‌ నేతలు, రియల్టర్ల దన్ను

  • దొడ్డిదారిన 67 దరఖాస్తులకు ఓకే

  • 5 ఎకరాల పాస్‌బుక్‌కు రూ.కోటి!

  • ధరణిఆపరేటర్లతో పాటు మరొకరి అరెస్ట్‌.. పరారీలో ఐదుగురు

  • కలెక్టర్ల సంతకాల ఫోర్జరీ

ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి)

హైదరాబాద్‌ నగరంలో శాసనసభ ఎన్నికల ముందు వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములు రికార్డుల్లో ప్రయువేటు వ్యక్తుల పరమైనట్లు తెలుస్తోంది. రంగారెడ్డి కలెక్టరేట్‌ కేంద్రంగా ఈ వ్యవహారం జరిగింది. కలెక్టరేట్‌లోని ధరణి ఆపరేటర్లను ఆకట్టుకొని, కోట్ల రూపాయలు ముట్టజెప్పి రియల్టర్లు ఇష్టానుసారంగా ప్రభుత్వ భూములను ప్రయివేటు వ్యక్తుల పేర రాయించినట్లు ఆర్థిక నేరాల విభాగం పోలీసుల దర్యాప్తులో బయటకు వస్తోంది. గత ప్రభుత్వంలోని బడా నేతలు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, అధికారులు కలిసి సర్కార్‌ భూములను చెరబట్టిన వైనంపై ఇంతకు ముందు ‘ఆంధ్రజ్యోతి’ వరుస కథనాలను ప్రచురించిన సంగతి తెలిసిందే. గండిపేట మండలం పొక్కల్‌వాడ సర్వే నంబరు 4 లోని రూ.500 కోట్ల విలువైన 5 ఎకరాల ప్రభుత్వ భూమికి శాసనసభ ఎన్నికల సమయంలో ఎలాంటి పత్రాలు లేకుండా పాస్‌బుక్‌లు జారీ చేసిన వ్యవహారం ఇటీవల వెలుగులోకి వచ్చింది. జిల్లా కలెక్టర్‌ శశాంక సంబంధిత వ్యక్తులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. దీంతో గండిపేట తహసీల్ధార్‌ శ్రీనివా్‌సరెడ్డి రాయదుర్గ పోలీసులకు ఫిర్యాదు చేశారు.


ఈ భూకుంభకోణంపై విచారణ చేపట్టిన సైబరాబాద్‌ పోలీసులు ఇద్దరు ధరణి ఆపరేటర్లతో పాటు మరొకరిని అరెస్ట్‌ చేసి విచారిస్తే అనేక విస్తుబోయే విషయాలు బయటకు వచ్చాయి. నగర, శివారు ప్రాంతాల్లో రూ. వేల కోట్ల విలువైన ప్రభుత్వ, కాందిశీకుల భూములకు పాస్‌బుక్‌లు జారీ చేసినట్లు బయటపడింది. ఈ వ్యవహారాలన్నీ ఇపుడు పోలీసులు తవ్వుతున్నారు. అరెస్టయిన వారిని రిమాండ్‌కు పంపారు. పరారీలో ఉన్న రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారితో పాటు మరో ఆరుగురి కోసం గాలిస్తున్నారు. మణికొండ మున్సిపాలిటీలో భాగంగా ఉండే పొక్కల్‌వాడలో 5 ఎకరాల సర్కార్‌ భూమికి పాస్‌బుక్‌ల జారీ కోసం ధరణి ఆపరేటర్లు ప్రైవేటు వ్యక్తులతో కోటి రూపాయలకు డీల్‌ కుదుర్చుకుని దశల వారీగా ఈ మొత్తాన్ని తీసుకున్నారు. వీటికి సంబంధించిన అన్ని సాక్ష్యాలను పోలీసులు సేకరించారు. వీళ్లే నగరంలో మరిన్ని భూములను ఇదే విధంగా ప్రయివేటు వ్యక్తులపరం చేశారని పోలీసులు తవ్వుతుంటే తెలుస్తోంది.


గత అసెంబ్లీ ఎన్నికల ముందు తనకు తెలియకుండా ధరణిపోర్టల్‌లో 98 దరఖాస్తులు క్లియర్‌ అయ్యాయని, దీనిపై విచారణ జరపాలని అప్పటి కలెక్టర్‌ భారతి హొళికెరి ఆదిభట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో ఆదిభట్ల పోలీసులు ఎలాంటి పురోగతి సాధించలేదు. తాజాగా పొక్కల్‌వాడ కేసు విచారణ చేపట్టిన సైబరాబాద్‌ ఆర్ధిక నేర విభాగం తీగ అంతా లాగడంతో పాత విషయాలన్నీ బయటకు వస్తున్నాయి. భారతీ హొళికెరి ఇచ్చిన ఫిర్యాదుకు సంబంధించిన 67 కేసుల్లో కూడా ఈ ఽధరణి ఆపరేటర్ల పాత్ర ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. పొక్కల్‌వాడ కేసులో గతంలో కలెక్టర్‌గా పనిచేసిన హరీశ్‌ సంతకాన్ని ఫోర్జరీ చేసి, ప్రొసీడింగ్స్‌ సృష్టించి ఆ తరువాత వచ్చిన భారతీ హొళికెరి హయంలో వీటిని ధరణి పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయించి, ఆమె కనుగప్పి వీటిని ఆమోదించి రెండు విడతలుగా పాస్‌ బుక్‌లు జారీ చేశారు. దీని వెనుక ప్రభుత్వ పెద్దలతో అంటకాగిన ఓ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ ఉన్నట్లు ఆరోపణలున్నాయి.


పొక్కల్‌వాడ కేసులో ఎవరెవరు?

పొక్కల్‌వాడ భూకుంభకోణంలో ఓ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ తెర వెనుక కథ నడిపించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అందరూ ఎన్నికల హడావిడిలో ఉన్న సమయంలో ఈ భూమిపై గతంలో కేసులు వేసి ఓడిపోయిన పూస లక్ష్మయ్య కుమారులు పూస రవీందర్‌, పూస ప్రహ్లాద్‌తో కలిసి అప్పటి ప్రభుత్వ పెద్దలు, అధికారులు, ధరణి ఆపరేటర్ల సహకారంతో ఈ అయిదెకరాల పాస్‌బుక్‌ సంపాధించారు. ఈ పాస్‌బుక్‌లు జారీకాగానే వీరు ఈ భూమిని ఆధీనంలోకి తీసుకుని అందులో షెడ్లు వేసి కొందరిని కాపలా పెట్టారు. పొక్కల్‌వాడ సర్వే నంబరు 4 లోని ఐదు ఎకరాల భూమికి గుట్టుచప్పుడు కాకుండా పాస్‌బుక్‌ జారీ కావడంపై స్థానికంగా ఉన్న కొందరు ప్రభుత్వం మారిన వెంటనే రెవెన్యూ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చారు.


కలెక్టర్‌ శశాంకకు సమాచారం వెళ్లడంతో విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని గండిపేట తహసీల్దార్‌ శ్రీనివా్‌సరెడ్డిని ఆదేశించారు. పాస్‌బుక్‌ల జారీలో అవకతవకలు జరిగాయని ఆయన నివేదిక ఇచ్చారు. దీంతో పట్టాదారు పాస్‌బుక్‌ యాక్టు 2020, సెక్షన్‌ 8 కింద పాస్‌బుక్‌లు రద్దు చేస్తూ కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో గండిపేట తహసీల్దారు బుధవారం తన సిబ్బందితో వెళ్లి అక్కడ పాగా వేసిన ప్రైవేటు వ్యక్తులను వెళ్లగొట్టి, షెడ్లు కూల్చివేసి, క్రిమినల్‌ కేసు పెట్టారు. ఈ కేసులో ఎ-1గా పూస ప్లహాద్‌ ఎ-2గా పూస రవీందర్‌, ఎ-3గా జంగ రవీందర్‌ యాదవ్‌(రియల్టర్‌), ఎ-4గా దీపావత్‌ నరేష్‌ నాయక్‌, ఎ-5గా రాఘవేందర్‌రెడ్డి, ఎ-9గా బీమ్‌రావు ఉన్నారు. వీరంతా పరారీలో ఉన్నారు. ఎ-6 దీపావత్‌ శ్రీనివా్‌సఽ(ధరణిఆపరేటర్‌ కలెక్టరేట్‌ హెల్ప్‌ డెస్క్‌), ఎ-7 సోంపల్లి మోహన్‌బాబు, ఎ-8 కుక్కల శివరామ్‌ కుమార్‌, ఎ-10 ఆంజనేయులు అరెస్ట్‌ అయ్యారు.


వెలుగులోకి మరికొన్ని కేసులు

సరూర్‌నగర్‌, గండిపేట, బాలాపూర్‌ మండలాల్లో వీరు అక్రమాలకు పాల్పడినట్లు తేలింది. ఇక్కడ ప్రభుత్వ భూములకు పట్టాదార్‌ పాస్‌ బుక్‌లు జారీ చేసినట్లు విచారణలో బయటపడ్డాయి. వీటిపై లోతు గా విచారణ కొనసాగుతోంది. రాజేంద్రనగర్‌లోని సర్వే నంబరు 277 నుంచి 326తో పాటు సర్వేనంబరు 328 నుంచి 337, 339, 340, 341, 342, 345, 368 వరకు గల కాందిశీకుల భూముల్లో అక్రమాలు జరిగాయి. అలాగే మణికొండ మున్సిపాలిటీలోని పుప్పాలగూడ వద్ద సర్వే నంబరు 331, 339లోని కాందిశీకుల భూముల్లోనూ పాస్‌బుక్‌లు జారీ అయినట్లు ప్రాథమిక విచారణలోతేలింది. ఇప్పటివరకు పుప్పాలగూడలో రూ.1000కోట్లపైగా విలువ చేసే 21ఎకరాల భూములకు దొడ్డిదారిన పాస్‌బుక్‌లు ఇచ్చినట్లు అధికారులు తేల్చారు.

Updated Date - Jun 07 , 2024 | 05:28 AM

Advertising
Advertising