TG Politics: అంబేద్కర్‌ను అవమానించారు.. రేవంత్‌పై బాల్క సుమన్ ఆగ్రహం
ABN, Publish Date - Apr 14 , 2024 | 05:12 PM
అంబేడ్కర్‌ను రేవంత్ ప్రభుత్వం అవమానించిందని బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ (Balka Suman) అన్నారు. ఆదివారం నాడు తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... సచివాలయం దగ్గరున్న అంబేద్కర్ విగ్రహానికి కనీసం పూలమాల కూడా సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) కి ఎందుకు వేయలేదని ప్రశ్నించారు.
హైదరాబాద్: అంబేడ్కర్‌ను రేవంత్ ప్రభుత్వం అవమానించిందని బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ (Balka Suman) అన్నారు. ఆదివారం నాడు తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... సచివాలయం దగ్గరున్న అంబేద్కర్ విగ్రహానికి కనీసం పూలమాల కూడా సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) కి ఎందుకు వేయలేదని ప్రశ్నించారు.
Ponguleti Srinivas Reddy: వచ్చే ఎన్నికల్లో బీజేపీకి చరమగీతం పాడాలి
దళితుల ఆత్మ గౌరవాన్ని దెబ్బ తీశారని మండిపడ్డారు. కేసీఆర్ ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహం అని కోపంతో నిర్లక్ష్యం చేశారా? అని నిలదీశారు. మరి కేసీఆర్ కట్టిన సచివాలయంలో ఎందుకు కూర్చుంటున్నారని ప్రశ్నించారు. అంబేద్కర్‌ను అవమానించిన రేవంత్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
TG Elections: రేవంత్ సమర్థుడు.. బీజేపీలోకి వస్తే స్వాగతిస్తాం: ధర్మపురి అర్వింద్ సంచలనం
సీఎం రేవంత్ ఫ్యూడల్ మనస్తత్వంతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మరి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఏంచేస్తున్నారని ప్రశ్నించారు. జయంతి రోజు అంబేద్కర్ విగ్రహాన్ని గాలికి వదిలేస్తే భట్టి పట్టించుకోరా? అని నిలదీశారు. ఈ విషయంపై దళిత సంఘాలు రేవంత్ రెడ్డిని ప్రశ్నించాలని బాల్కసుమన్ కోరారు.
బీజేపీ దేశంలో దుర్మార్గపు విధానాలు అవలంభిస్తోందని మండిపడ్డారు. తెలంగాణకు బీజేపీ అన్యాయం చేసిందని ధ్వజమెత్తారు. లిక్కర్ కేసు అసలు కేసే కాదన్నారు. ఉత్తర భారతదేశంలో కొరకరాని కొయ్యగా మారారని మోదీ అండ్ కో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేశారని విరుచుకుపడ్డారు. దక్షిణ భారత దేశంలో బలమైన నేత కేసీఆర్ అని అందుకనే ఆయన కూతురు కవితను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారని మండిపడ్డారు.
బీజేపీతో కలవక పోతే ఈడీ, సీబీఐ, ఐటీలను వేట కుక్కల్లా ఉసిగొల్పుతున్నారని ఆరోపించారు. బీజేపీకి నచ్చితే జోడి లేదంటే ఈడీ అని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌పై కక్ష్యతో ఆయన కూతురు కవితని అరెస్ట్ చేశారని అన్నారు. దానం నాగేందర్ మాటలు విని ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. ఒక పార్టీలో గెలిచి మరో పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేయడానికి ఆయనకు ఏమైనా సిగ్గుందా అని ప్రశ్నించారు. దానం బలమైన నేతవైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎంపీగా గెలవాలని బాల్క సుమన్ సవాల్ విసిరారు.
TG Politics: తప్పుడు మార్గంలో రాజకీయాలు చేయొద్దు: వెంకట్ రాంరెడ్డి
మరిన్ని తెలంగాణ వార్తల కోసం...
Updated Date - Apr 14 , 2024 | 05:45 PM