ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

హామీలు అమలు చేసేంత వరకు కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని వెంటాడుతాం

ABN, Publish Date - Oct 30 , 2024 | 04:30 AM

తెలంగాణలో కాంగ్రెస్‌ ఆరు హామీలను అమలు చేసేంత వరకు ఆ ప్రభుత్వాన్ని వెంటాడుతూనే ఉంటామని బీజేపీ నాయకులు, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ అన్నారు.

  • బావ, బావమరుదులు రేవంత్‌రెడ్డికి సహకరిస్తున్నారు

  • బీఆర్‌ఎస్‌ను భూస్థాపితం చేస్తాం: బండి సంజయ్‌

విశాఖపట్నం, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో కాంగ్రెస్‌ ఆరు హామీలను అమలు చేసేంత వరకు ఆ ప్రభుత్వాన్ని వెంటాడుతూనే ఉంటామని బీజేపీ నాయకులు, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ అన్నారు. రోజ్‌గార్‌ మేళాలో పాల్గొనడానికి విశాఖపట్నం వచ్చిన ఆయన మంగళవారం ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్‌రాజు ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణాలో బావ, బావమరుదులు ఇద్దరూ పోటీ పడి సీఎం రేవంత్‌రెడ్డికి సహకరిస్తున్నారని ఆరోపించారు. అందుకే తెలంగాణ ప్రభుత్వం కేటీఆర్‌ బావమరిది ఫామ్‌హౌస్‌ ఘటనను నీరుగార్చిందని విమర్శించారు. బూతులు తిట్టేటోడు నోటీసులు ఇస్తే విలువ ఏముంది?... అని ప్రశ్నించారు. నోటీసులకు బదులు ఇచ్చానని, తాను కూడా తిరిగి నోటీసులు ఇస్తానన్నారు. తెలంగాణాలో బీఆర్‌ఎ్‌సను నామరూపాల్లేకుండా భూస్థాపితం చేస్తామన్నారు.

Updated Date - Oct 30 , 2024 | 04:30 AM