ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Bandi Sanjay: ముచ్చర్ల ఫోర్త్‌ సిటీ వెనుక భూకుంభకోణం..

ABN, Publish Date - Aug 05 , 2024 | 03:37 AM

రంగారెడ్డి జిల్లాలోని ముచ్చర్లలో నిర్మించతలపెట్టిన ఫోర్త్‌ సిటీ వెనుక భారీ భూకుంభకోణం దాగి ఉందని, వేలాది ఎకరాలను దిగమింగి ఆస్తులను కూడబెట్టుకోవడానికే కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ కుట్ర పన్నిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ ఆరోపించారు.

  • బీఆర్‌ఎస్‌ బాటలోనే కాంగ్రెస్‌ సర్కార్‌

  • ధరణి పేరు మారిస్తే అవినీతి ఆగుతుందా?: సంజయ్‌

సరూర్‌నగర్‌, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): రంగారెడ్డి జిల్లాలోని ముచ్చర్లలో నిర్మించతలపెట్టిన ఫోర్త్‌ సిటీ వెనుక భారీ భూకుంభకోణం దాగి ఉందని, వేలాది ఎకరాలను దిగమింగి ఆస్తులను కూడబెట్టుకోవడానికే కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ కుట్ర పన్నిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ ఆరోపించారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం బాటలోనే ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం నడుస్తున్నదని మండిపడ్డారు. ఆదివారం నగర శివారు బడంగ్‌పేట్‌ కార్పొరేషన్‌లోని గుర్రంగూడలో జరిగిన బోనాల వేడుకల్లో పాల్గొన్న సంజయ్‌ విలేకరులతో మాట్లాడారు.


ధరణి పేరుతో కేసీఆర్‌ ప్రభుత్వం దాదాపు 20 లక్షల ఎకరాల భూములను దిగమింగిందని, ఇప్పుడు ధరణి పేరును భూమాతగా మార్చి, మిగిలిన భూములనూ మేయడానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం పన్నాగం పన్నుతున్నదని ఆరోపించారు. ధరణి పేరు మారిస్తే అవినీతి ఆగుతుందా అని ప్రశ్నించారు. ధరణి అక్రమాలపై వేసిన కమిటీ నివేదికపై శ్వేతపత్రం విడుద చేయాలని డిమాండ్‌ చేశారు. రంగారెడ్డి జిల్లాలో ఓఆర్‌ఆర్‌ చుట్టుపక్కల గల విలువైన భూములను కాజేయడానికే ప్రభుత్వం ఫోర్త్‌ సిటీని తెరపైకి తెచ్చిందని, దానికోసం భూసేకరణ బాధ్యతను కాంగ్రె్‌సలోని ఓ నాయకుడికి అప్పగించిందని ఆరోపించారు. ఈ సిటీ వల్ల స్థానిక రైతులకు ఎలాంటి ఉపయోగం లేదన్నారు.


రాష్ట్ర ప్రభుత్వం ముస్లింల పండుగలకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయిస్తూ.. హిందువుల పండుగలకు మాత్రం అత్తెసరు నిధులు ఇచ్చి చేతులు దులుపుకుంటోందని మండిపడ్డారు. హైదరాబాద్‌ శివారులోని కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, గ్రామ పంచాయతీలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేయాలనే ప్రతిపాదనను బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదని చెప్పారు. విలీనం ప్రతిపాదనకు వ్యతిరేకంగా తమ పార్టీ ఆధ్వర్యంలో త్వరలో కార్యాచరణ రూపొందించి ఉద్యమం చేపడతామని సంజయ్‌ తెలిపారు.

Updated Date - Aug 05 , 2024 | 03:37 AM

Advertising
Advertising
<