Bandi Sanjay: కేంద్రమంత్రిగా బండి సంజయ్ బాధ్యతల స్వీకరణ.. ఎప్పుడంటే..?
ABN, Publish Date - Jun 12 , 2024 | 09:20 PM
కేంద్ర మంత్రిగా రేపు (గురువారం) బండి సంజయ్ బాధ్యతలు స్వీకరిస్తారు. నార్త్ బ్లాక్‌లో గల హోం మంత్రిత్వ శాఖ కార్యాలయంలో ఉదయం 10.35 గంటలకు బండి సంజయ్ హోం శాఖ సహాయ మంత్రి పదవి చేపడతారు. పదవి బాధ్యతల కార్యక్రమానికి నాయకులు, కార్యకర్తలను అనుమతించడం లేదు.
ఢిల్లీ: కేంద్ర మంత్రిగా రేపు (గురువారం) బండి సంజయ్ బాధ్యతలు స్వీకరిస్తారు. నార్త్ బ్లాక్‌లో గల హోం మంత్రిత్వ శాఖ కార్యాలయంలో ఉదయం 10.35 గంటలకు బండి సంజయ్ హోం శాఖ సహాయ మంత్రి పదవి చేపడతారు. పదవి బాధ్యతల కార్యక్రమానికి నాయకులు, కార్యకర్తలను అనుమతించడం లేదు. భద్రతా కారణాల పేరుతో నిరాడంబరంగా బాధ్యతల స్వీకరణ కార్యక్రమం జరగనుంది. జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య భారతి స్వామిజీ హాజరై బండి సంజయ్‌కు ఆశీర్వచనం ఇస్తారు.
కేంద్ర క్యాబినెట్ మంత్రిగా జి కిషన్ రెడ్డి రేపు బాధ్యతలు స్వీకరిస్తారు. కిషన్ రెడ్డికి బండి సంజయ్ అభినందనలు తెలియజేశారు. బొగ్గు, గనుల శాఖ ద్వారా కిషన్ రెడ్డి రాష్ట్రానికి, దేశానికి విశేష సేవలు అందిస్తారని అభిప్రాయ పడ్డారు. రాష్ట్ర అభివృద్ధికి పాటుపడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. సింగరేణి బొగ్గు గనులపై అవగాహన ఉన్న కిషన్ రెడ్డి, ఆ సంస్థ అభివృద్ధికి, సింగరేణి కార్మికులకు మేలు చేస్తారని బండి సంజయ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మొత్తం 17 పార్లమెంట్ స్థానాలు ఉండగా బీజేపీ, కాంగ్రెస్ చెరో 8 సీట్ల చొప్పున గెలిచాయి. గత ఎన్నికల్లో బీజేపీ 4 సీట్లు మాత్రమే గెలిచింది. ఈ సారి సంఖ్య పెరగడంతో ఇద్దరికీ మంత్రి పదవులు దక్కాయి. గతంలో కిషన్ రెడ్డికి సహాయ మంత్రి పదవి మాత్రమే ఉండేది. ఇప్పుడు ప్రమోషన్ వచ్చి, కేంద్రమంత్రి అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ బలపడేందుకు ప్రధాన కారణం బండి సంజయ్. ఆయనకు మంత్రి పదవి వరించింది.
Updated Date - Jun 12 , 2024 | 09:21 PM