TG Politics: టచ్‌లో 26 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు..?
ABN, Publish Date - Mar 20 , 2024 | 05:31 PM
భారత రాష్ట్ర సమితి ఎమ్యెల్యేలు టచ్‌లో ఉన్నారని కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రకటించడంతో రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల గురించి కాంగ్రెస్ నేతలు ఒక్కో సంఖ్య చెబుతున్నారు. మరికొందరెమో బీఆర్ఎస్ఎల్పీ విలీనం అవుతుందని సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.
హైదరాబాద్: భారత రాష్ట్ర సమితి (BRS) ఎమ్యెల్యేలు టచ్‌లో ఉన్నారని కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రకటించడంతో రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. బీఆర్ఎస్ (BRS) పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల గురించి కాంగ్రెస్ నేతలు ఒక్కో సంఖ్య చెబుతున్నారు. మరికొందరెమో బీఆర్ఎస్ఎల్పీ (BRSLP) విలీనం అవుతుందని సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో కేసీఆర్ సీఎల్పీని (CLP) విలీనం చేసిన సంగతి తెలిసిందే. అందుకు కౌంటర్‌గా సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) బీఆర్ఎస్ఎల్పీని విలీనం చేయబోతున్నారని కాంగ్రెస్ (Congress) పార్టీ నేతలు చెబుతున్నారు.
ప్రజా పాలనకు ఆకర్షితులై
కాంగ్రెస్ పార్టీతో 26 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ ఎమ్మెల్యేలు తమ పార్టీ నేతలతో చర్చలు జరిపారని, రేపో, మాపో చేరడం ఖాయం అని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతోన్న ప్రజాపాలనకు ఆకర్షితులై ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని వివరించారు. ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేయాల్సిన అవసరం తమకు లేదని బీర్ల ఐలయ్య స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి అందరికీ అందుబాటులో ఉంటారని, ప్రజా సంక్షేమమే తమకు ముఖ్యం అని బీర్ల ఐలయ్య వివరించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు కూడా సీఎం రేవంత్ రెడ్డి అందుబాటులో ఉంటారని వెల్లడించారు.
26 నుంచి 30 మంది ఎమ్మెల్యేలు
తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి 64 మంది సభ్యులు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి 39 మంది సభ్యులు ఉన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత కారు ప్రమాదంలో చనిపోయిన సంగతి తెలిసిందే. ఆ స్థానానికి మే 13వ తేదీన ఉప ఎన్నిక జరగనుంది. బీఆర్ఎస్ 38 మంది సభ్యుల్లో 26 నుంచి 30 మంది సభ్యులు తమతో టచ్‌లో ఉన్నారని కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
ఇవి కూడా చదవండి.
Bandi Sanjay: రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
Updated Date - Mar 20 , 2024 | 05:31 PM