ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Khammam: పాత్రికేయుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి ..

ABN, Publish Date - Jun 21 , 2024 | 03:37 AM

పాత్రికేయుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తమ్ముల నాగేశ్వరరావు తెలిపారు. టీయూడబ్ల్యూజే (ఐజేయూ) రాష్ట్ర తృతీయ మహాసభలు గురువారం ఖమ్మంలో ఘనంగా ముగిశాయి.

  • టీయూడబ్ల్యూజే మహాసభల్లో భట్టి, తుమ్మల

ఖమ్మం సాంస్కృతికం, జూన్‌ 19: పాత్రికేయుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తమ్ముల నాగేశ్వరరావు తెలిపారు. టీయూడబ్ల్యూజే (ఐజేయూ) రాష్ట్ర తృతీయ మహాసభలు గురువారం ఖమ్మంలో ఘనంగా ముగిశాయి. ముఖ్య అతిథిగా హాజరైన భట్టి మాట్లాడుతూ కాంగ్రెస్‌ హయాంలో మీడియా స్వేచ్ఛకు భంగం కలుగనివ్వబోమన్నారు. గత ప్రభుత్వ హయాంలో మీడియా స్వేచ్ఛకు తీవ్ర విఘాతం కలిగించారన్నారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు తదితర సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతామని చెప్పారు. తుమ్మల మాట్లాడుతూ జర్నలిస్టులు నిబద్ధతతో వ్యవహరించి ప్రజాహితం కోసం పాటుపడాలన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ విశాలాంధ్ర పత్రికలో జర్నలిస్టుగా పనిచేసిన రోజులను గుర్తుచేసుకున్నారు.


టీయూడబ్ల్యూజే అధ్యక్షుడిగా విరాహత్‌ అలీ

టీయూడబ్ల్యూజే(ఐజేయూ) రాష్ట్ర నూతన కార్యవర్గం గురువారం ఎన్నికలైంది. ఖమ్మంలో నిర్వహిస్తున్న సంఘం రాష్ట్ర మూడో మహాసభల ముగింపు సందర్భంగా మీడియా అకాడమీ అధ్యక్షుడు కె. శ్రీనివాసరెడ్డి సమక్షంలో నూతన కార్యవర్గాన్ని రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. టీయూడబ్ల్యూజే (ఐజేయూ) రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా కె. విరాహత్‌ అలీ, ప్రధాన కార్యదర్శిగా కట్టెకోల రాంనారాయణను ఎన్నికయ్యారు.

Updated Date - Jun 21 , 2024 | 03:38 AM

Advertising
Advertising