ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kishan Reddy: జమ్మూలో బీజేపీ విజయం చరిత్రాత్మకం

ABN, Publish Date - Oct 09 , 2024 | 03:06 AM

జమ్మూలో బీజేపీ విజయం చరిత్రాత్మకమని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి.. బీజేపీ జమ్మూ కశ్మీర్‌ ఎన్నికల ఇన్‌చార్జ్‌ కిషన్‌రెడ్డి అన్నారు.

  • కేంద్ర బొగ్గు, గనుల మంత్రి కిషన్‌ రెడ్డి

  • హరియాణాలో కాంగ్రెస్‌ మోసాలకు చెక్‌:సంజయ్‌

  • కాంగ్రెస్‌ హామీలను ప్రజలు నమ్మ లేదు: ఈటల

న్యూఢిల్లీ/హైదరాబాద్‌, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): జమ్మూలో బీజేపీ విజయం చరిత్రాత్మకమని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి.. బీజేపీ జమ్మూ కశ్మీర్‌ ఎన్నికల ఇన్‌చార్జ్‌ కిషన్‌రెడ్డి అన్నారు. జమ్మూ ప్రాంతంలో 43 అసెంబ్లీ స్థానాలు ఉండగా 29 చోట్ల బీజేపీ విజయం సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఆ ప్రాంతంలో గతంలో కంటే ఎక్కువ సీట్లు, ఓట్లు సాధించామని తెలిపారు. జమ్మూ ప్రజలు బీజేపీతో ఉన్నారని మరోసారి రుజువైందని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ముక్త జమ్మూ కశ్మీర్‌ సాధనలో తాము విజయం సాధించామని అన్నారు. జమ్మూ కశ్మీర్‌లో గతంలో ఎప్పుడూ సాధించనన్ని సీట్లు ఇచ్చిన ప్రజలకు రుణపడి ఉంటామని, ఆ ప్రాంతాల అభివృద్ధికి ప్రజలతో కలిసి పనిచేస్తామని కిషన్‌రెడ్డి తెలిపారు.


ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ చేసే మోసాలు, తప్పుడు వాగ్దానాలకు చెక్‌ పెట్టేలా హరియాణా ఎన్నికల ఫలితాలు వచ్చాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ విమర్శించారు. హరియాణాలో కాంగ్రెస్‌ ఉచితాల పేరిట ప్రచారం చేసినా, అక్కడి ప్రజలు ఆ పార్టీని తిరస్కరించారని అన్నారు. అడ్డదారిలో అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్‌ అలవికాని హామీలు ఇస్తోందని గుర్తించిన హరియాణా ప్రజలు.. ఆ పార్టీకి బుద్ధి చెప్పారని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ వ్యాఖ్యానించారు. తెలంగాణ, హిమాచల్‌ప్రదేశ్‌, కర్ణాటకలోని కాంగ్రెస్‌ ప్రభుత్వాల వైఫల్యాలను వారు గమనించారని అన్నారు. హరియాణా, జమ్మూలో సాధించిన ఫలితాల పట్ల బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.

Updated Date - Oct 09 , 2024 | 03:06 AM