ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kishan Reddy: రేడార్‌ స్టేషన్‌పై బీఆర్‌ఎస్‌ ద్వంద్వ వైఖరి

ABN, Publish Date - Oct 16 , 2024 | 03:13 AM

వికారాబాద్‌ జిల్లా దామగుండంలో వీఎల్‌ఎఫ్‌ నేవీ రేడార్‌ కేంద్రం ఏర్పాటుపై బీఆర్‌ఎస్‌ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు.

  • అధికారంలో ఉన్నప్పుడు ఒకలా.. ప్రతిపక్షంలో మరోలా.. సరికాదు

  • దేశ భద్రతపై బాధ్యతా రాహిత్యం: కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): వికారాబాద్‌ జిల్లా దామగుండంలో వీఎల్‌ఎఫ్‌ నేవీ రేడార్‌ కేంద్రం ఏర్పాటుపై బీఆర్‌ఎస్‌ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోమాట మాట్లాడుతోందని దుయ్యబట్టారు. తెలంగాణకు గర్వకారణమైన ఈ ప్రాజెక్టు విషయంలో కేసీఆర్‌ కుటుంబం రెండు నాల్కల ధోరణితో, బాధ్యతరహితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఈ మేరకు మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్‌రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. అధికారంలో ఉన్నప్పుడు రేడార్‌ కేంద్రం ఏర్పాటుకు అవసరమైన అనుమతులను బీఆర్‌ఎస్‌ ఇచ్చిందని తెలిపారు.


తీరా పనులు ప్రారంభించే సమయానికి కొత్త సెక్రటేరియట్‌ కోసం బైసన్‌పోలో గ్రౌండ్స్‌ను ఇవ్వాలని, అప్పుడే పంచనామా చేసి భూమి కేటాయిస్తామంటూ తిరకాసు పెట్టిందని విమర్శించారు. దేశ భద్రత, రక్షణ విషయంలో బీఆర్‌ఎస్‌ పార్టీ మొదటి నుంచీ బాధ్యతారహితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. భారత రక్షణశాఖకు సహకరించాల్సింది పోయి, తమకు ఇష్టం లేదంటూ దేశ భద్రత, సమగ్రతకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామంటూ కేసీఆర్‌, కేటీఆర్‌ మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఈ వ్యాఖ్యలను సభ్యసమాజం ఖండించాలని పిలుపునిచ్చారు. దామగుండంలో కొంత ప్రాంతంలో మాత్రమే రేడార్‌ వ్యవస్థలో పనిచేేస నేవీ సిబ్బందికి వసతి సౌకర్యం ఏర్పాటు చేస్తారని తెలిపారు. అయితే, చెట్లు నరికివేస్తున్నారని కొంతమంది అసత్య ప్రచారం చేస్తున్నారని చెప్పారు. అక్కడి రామలింగేశ్వర స్వామి ఆలయానికి మరిన్ని సౌకర్యాలు కల్పించేలా రక్షణశాఖతో సంప్రదిస్తామన్నారు.

Updated Date - Oct 16 , 2024 | 03:13 AM