ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Lakshman: కాళేశ్వరం.. రూ.లక్ష కోట్ల వైఫల్యం:లక్ష్మణ్‌

ABN, Publish Date - Oct 04 , 2024 | 03:26 AM

కాళేశ్వరం ఎత్తిపోతలలో రూ.లక్ష కోట్లు వెచ్చించినా.. ఆ ప్రాజెక్టు వైఫల్యం ప్రజల కళ్లముందు ఉందని.. వెరసి పదేళ్లలో రాష్ట్రం రూ.8 లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ విమర్శించారు.

  • పెద్ద ప్రాజెక్టుల నిర్మాణాల జోలికి వెళ్లొద్దు:ఎంపీ కొండా

  • చతుర్విద జల ప్రక్రియతో సాగుకు మేలు: మర్రి శశిధర్‌రెడ్డి

హైదరాబాద్‌, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ఎత్తిపోతలలో రూ.లక్ష కోట్లు వెచ్చించినా.. ఆ ప్రాజెక్టు వైఫల్యం ప్రజల కళ్లముందు ఉందని.. వెరసి పదేళ్లలో రాష్ట్రం రూ.8 లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ విమర్శించారు. ప్రాజెక్టుల నిర్మాణం ఆదాయ వనరుగా మారకూడదని, కాంట్రాక్టర్ల జేబులు నింపడానికి ప్రాజెక్టులు చేపట్టరాదని అన్నారు. గురువారం హైదరాబాద్‌లోని సామాజిక, ఆర్థిక శాస్త్రాల కేంద్రం(సె్‌స)లో డాక్టర్‌ మర్రిచెన్నారెడ్డి స్మారక ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ‘హనుమంతరావు ప్రతిపాదించిన చతుర్విద జలప్రక్రియతో తెలంగాణ జలవనరుల సంరక్షణ’ అనే అంశంపై ట్రస్ట్‌ కార్యదర్శి మర్రి శశిధర్‌రెడ్డి ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది.


ఈ చర్చలో లక్ష్మణ్‌ మాట్లాడారు. దేశంలో ప్రతీ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వడం కుదిరే పని కాదని అన్నారు. ఆర్థిక భారం, భూసేకరణ సమస్య లేకుండా చతుర్విద జల ప్రక్రియ అమలు చేసి, నిర్దేశిత లక్ష్యాలు సాధించవచ్చని తెలిపారు. 30 ఏళ్ల కిందట హనుమంతరావు ప్రతిపాదించిన చతుర్విద జలప్రక్రియను రాజస్థాన్‌ అమలు చేసిందని ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. వాతావరణ మార్పులతో ఫ్రాన్స్‌, స్వీడన్‌లాంటి దేశాల్లో పెద్ద డ్యామ్‌లను కూలగొడుతున్నారని తెలిపారు.


స్పెయిన్‌ లాంటి దేశాల్లో చతుర్విద జల ప్రక్రియ అమలవుతోందని చెప్పారు. పెద్ద పెద్ద ప్రాజెక్టుల నిర్మాణం జోలికి వెళ్లొద్దని సూచించారు. లక్ష ఎకరాలకు నీరందించేలా నారాయణపేట-కొడంగల్‌ ఎత్తిపోతల పథకాన్ని రూ.4,350 కోట్లతో ప్రతిపాదించారని, పూర్తయ్యేలోపు దీని వ్యయం ఎక్కడిదాకా చేరుతుందో అర్థం కాని పరిస్థితి ఉందని మర్రి శశిధర్‌రెడ్డి అన్నారు. ఈ ప్రాజెక్టు ప్రతిపాదనను వెనక్కి తీసుకుని, ఆ ప్రాంతంలో చతుర్విద జల ప్రక్రియను అమలు చేస్తే.. లక్ష ఎకరాల్లో ఏటా మూడు పంటలు పండించే

Updated Date - Oct 04 , 2024 | 03:26 AM