ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

BL Santosh: తెలంగాణలో భవిష్యత్తు బీజేపీదే..

ABN, Publish Date - Aug 05 , 2024 | 03:33 AM

తెలంగాణలో భవిష్యత్తు బీజేపీదే అని పార్టీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బి.ఎల్‌. సంతోష్‌ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను సీరియ్‌సగా తీసుకోవాలని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ తప్పిదాలపై స్థానిక నాయకత్వం తక్షణం స్పందించాలని పిలుపునిచ్చారు.

  • పార్టీ జాతీయ నేత బీఎల్‌ సంతోష్‌

  • కాంగ్రె్‌సలోకి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల వలసలపై ఆరా

హైదరాబాద్‌, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో భవిష్యత్తు బీజేపీదే అని పార్టీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బి.ఎల్‌. సంతోష్‌ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను సీరియ్‌సగా తీసుకోవాలని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ తప్పిదాలపై స్థానిక నాయకత్వం తక్షణం స్పందించాలని పిలుపునిచ్చారు. ఆదివారం రాష్ట్ర పర్యటనకు వచ్చిన సంతోష్‌.. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ప్రధాన కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. ఇటీవల ఏర్పాటు చేసిన రైతు హెల్ప్‌లైన్‌ కేంద్రాన్ని సందర్శించారు.


ఈ సందర్భంగా రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై సంతోష్‌ ఆరా తీశారు. ముఖ్యంగా, బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రె్‌సలో చేరిన పది మంది ఎమ్మెల్యేలు ఎందుకు వెళ్లారు..? కాంగ్రెస్‌ ఆకర్ష్‌ ప్రభావం ఎలా ఉంది..? కాంగ్రెస్‌ పాలన, వాగ్దానాల అమలుపై ప్రజలు ఏమనుకుంటున్నారు..? బీఆర్‌ఎస్‌ పరిస్థితి ఏమిటి..? తదితర అంశాలపై ఆయన ఆరా తీసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ సంస్థాగతంగా మరింత బలోపేతం కావాలని ఆయన ప్రధాన కార్యదర్శులకు సూచించారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత తొలిసారిగా రాష్ట్రానికి వచ్చిన సంతోష్‌, పోలింగ్‌ బూత్‌స్థాయిలో పార్టీ పటిష్ఠతపై దిశానిర్దేశం చేశారు.


  • రేపు పదాధికారుల సమావేశం

బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశం మంగళవారం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో జరగనుంది. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో రుణమాఫీ, నిరుద్యోగుల సమస్యలపై ప్రధానంగా చర్చించనున్నారని పార్టీ నేతలు తెలిపారు. ఈ నెల 11 నుంచి నిర్వహించనున్న హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమంపై సమీక్షించనున్నారు.

Updated Date - Aug 05 , 2024 | 03:34 AM

Advertising
Advertising
<