ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: బీఆర్‌ఎస్‌ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్‌ అరెస్టు

ABN, Publish Date - Dec 27 , 2024 | 04:50 AM

బీఆర్‌ఎస్‌ నేత, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ మాజీ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివా్‌సను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. పోలీసులు వెస్ట్‌ మారేడ్‌పల్లిలోని శ్రీనివాస్‌ నివాసానికి తెల్లవారుజామునే వెళ్లి కాలింగ్‌ బెల్‌ కొట్టినా ఆయన చాలాసేపటి వరకు తెరవలేదు.

  • నాంపల్లి కోర్టులో హాజరు.. బెయిల్‌ మంజూరు

  • పోలీసుల విధులకు ఆటంకం కలిగించినందుకు కేసు

హైదరాబాద్‌/మారేడుపల్లి, డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ నేత, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ మాజీ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివా్‌సను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. పోలీసులు వెస్ట్‌ మారేడ్‌పల్లిలోని శ్రీనివాస్‌ నివాసానికి తెల్లవారుజామునే వెళ్లి కాలింగ్‌ బెల్‌ కొట్టినా ఆయన చాలాసేపటి వరకు తెరవలేదు. తమ న్యాయవాదులు వచ్చే వరకు ఆగాలని ఆయన అనుచరులు పోలీసులకు సమాచారం అందించారు. 9.30 గంటల సమయంలో న్యాయవాదులు వచ్చి శ్రీనివా్‌సతో మాట్లాడారు. అనంతరం బయటకొచ్చిన ఆయనను పోలీసులు అరెస్టు చేసి.. మసాబ్‌ ట్యాంక్‌ పీఎ్‌సకు తీసుకొచ్చారు. తర్వాత నాంపల్లిలోని మూడో అదనపు చీఫ్‌ జ్యూడిషియల్‌ మేజిస్ట్రేట్‌ ముందు హజరుపరచగా బెయిల్‌ మంజూరైంది.


ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి అరెస్టు సమయంలో పోలీసులను అడ్డుకున్నారనే ఆరోపణలపై శ్రీనివా్‌సపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. కోర్టు వద్ద శ్రీనివాస్‌ మీడియాతో మాట్లాడుతూ ప్రశ్నించే గొంతుకలను అరెస్టు చేస్తున్నారని ఆరోపించారు. కాగా, కాంగ్రెస్‌ దళిత, బహుజన వర్గాలకు ఇచ్చిన హమీల అమలు కోసం ప్రశ్నిస్తున్నందుకే శ్రీనివా్‌సను అరెస్టు చేశారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ముఖ్యమంత్రి ఆరు గ్యారంటీలను అటకెక్కించి ఏడోదిగా ఎమర్జెన్సీని అమలు చేస్తున్నారని విమర్శించారు. నోటీసులు, కుటుంబ సభ్యులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా శ్రీనివా్‌సను అరెస్టు చేయడాన్ని మాజీ మంత్రి హరీశ్‌రావు తప్పుపట్టారు.

Updated Date - Dec 27 , 2024 | 04:50 AM