Share News

Telangana: రెచ్చిపోయిన కేటీఆర్.. సీఎం రేవంత్‌పై తీవ్ర వ్యాఖ్యలు..

ABN , Publish Date - Sep 14 , 2024 | 01:10 PM

6 గ్యారెంటీలు అని సన్నాయి నొక్కులు నొక్కారు.. 2లక్షల ఉద్యోగాల పేరిట యువతను మోసం చేశారు.. రుణమాఫీ పేరున రైతులను మోసం చేశారు.. అటెన్షన్ డైవర్షన్ కోసమే రేవంత్ రోజుకో ఇష్యూను తెరపైకి తెస్తున్నారు. బజారు మాటలు, చిల్లర మాటలు, చిల్లర వేశాలు. రాజకీయాలు అంటేనే..

Telangana: రెచ్చిపోయిన కేటీఆర్.. సీఎం రేవంత్‌పై తీవ్ర వ్యాఖ్యలు..
BRS MLA KTR

హైదరాబాద్, సెప్టెంబర్ 14: మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రెచ్చిపోయారు. సీఎం రేవంత్ రెడ్డిపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అసమర్థుడి జీవన యాత్రలా రేవంత్ పాలన నడుస్తోందని విమర్శించారు. అమెరికా నుంచి హైదరాబాద్ తిరిగొచ్చిన కేటీఆర్.. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన్ను పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్.. సీఎం రేవంత్ రెడ్డి, అరికెపూడి గాంధీలపై ఘాటైన పదజాలంతో విరుచుకుపడ్డారు.


రాష్ట్రంలో ప్రతి వర్గాన్ని మోసం చేసిన ఘన రేవంత్ రెడ్డికే దక్కుతుందన్నారు. తాము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము లేక రేవంత్ తొత్తులు చిల్లర ఎత్తుగడలు వేస్తున్నారని మండిపడ్డారు. సీఎం స్వయంగా ఎమ్మెల్యేల ఇళ్లకు వెళ్లి కండువాలు కప్పారని కేటీఆర్ గుర్తు చేశారు. సోషల్ మీడియాలో కాంగ్రెస్‌లో చేరినట్లు ప్రచారం చేసుకుని.. హైకోర్టు తీర్పు తరువాత స్వరం మార్చారని విమర్శించారు. రాష్ట్రంలో తొమ్మిది నెలలుగా ఒక వైపు హెడ్ లైన్ మేనేజ్‌మెంట్ చేస్తున్నారని.. మరోవైపు డెడ్‌లైన్‌లను దాటవేస్తూ గారడి మాటలు చెబుతున్నారని రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ విమర్శలు గుప్పించారు.


కేటీఆర్ కామెంట్స్ యధావిధిగా..

‘6 గ్యారెంటీలు అని సన్నాయి నొక్కులు నొక్కారు.. 2లక్షల ఉద్యోగాల పేరిట యువతను మోసం చేశారు.. రుణమాఫీ పేరున రైతులను మోసం చేశారు.. అటెన్షన్ డైవర్షన్ కోసమే రేవంత్ రోజుకో ఇష్యూను తెరపైకి తెస్తున్నారు. బజారు మాటలు, చిల్లర మాటలు, చిల్లర వేశాలు. రాజకీయాలు అంటేనే ప్రజలకు అసహ్యం వేసేలా చేస్తున్నారు. ఇంటింటికి వెళ్లి ఎమ్మెల్యేలను కలిసి బ్రతిమాలుకుని ఆయనే కండువా కప్పుతారు. సామ, ధాన, భేద దండోపాయాలు ఉపయోగించి పార్టీలో చేర్చుకుంటారు. ఆయనే ఎమ్మెల్యేల కాళ్ళు పట్టుకుని ఆయనే చేర్పించుకుంటారు. 10 మంది పోయారు అని, గేట్లు తెరిచామని మాటలు మాట్లాడారు. కోర్టు తీర్పు తర్వాత మళ్ళీ మాట మార్చారు. ఫిరాయింపులకు పాల్పడే వారి పదవి పోతదనే భయం పట్టుకుంది.’ అని వ్యాఖ్యానించారు.


‘స్పీకర్ మీరు తప్పు చేస్తున్నారని ముందే చెప్పాం.. ఫిరాయింపు దారులపై కౌశిక్ రెడ్డి, జగదీష్ రెడ్డి, వివేకానందలు కోర్టులో కేసు వేశారు. కౌశిక్ రెడ్డి ఏం తప్పు మాట్లాడాడు. నాలుగు వారాల్లో నిర్జయం తీసుకోవాలని కోర్ట్ చెప్పింది. హై కోర్టు తీర్పు వల్ల ప్రజాస్వామ్యాన్ని గౌరవించారు. దమ్ముంటే రండి అన్నారు. ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం అన్నారు. అదేం తప్పు? సీఎం రేవంత్ రెడ్డి గతంలో రాళ్లతోని కొట్టి చంపండి అన్నారు.. ఉరి తీయాలి అన్నారు.. ఆయన లాగా ఎవరు మాట్లాడలేదు. పార్టీ మారిన గాంధీని పీఏసీ చైర్మెన్‌గా నియమించారు. ఆయన ఏ పార్టీలో ఉన్నారని అడిగారు. అందులో తప్పేముంది? పదవి పోతుందని ఇప్పుడు బీఆర్‌ఎస్ పార్టీలోనే ఉన్నారని చెబుతున్నారు.’ అని కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు.


‘గుండాలతో దాడి చేశారు. రూమ్ అద్దాలు పగలగొట్టారు. ఏమైనా అయితే ఎవరు బాధ్యులు? ఈ దాడికి ముఖ్యమంత్రే బాధ్యత వహించాలి. ఫ్యాక్షన్ సినిమాను తలపించారు. చేతగాని సీఎం, హోం మంత్రి వల్లనే ఇలా జరిగింది. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయలేని అసమర్థ ముఖ్యమంత్రి. సీఎంగా ఆయన చేసిందేమీ లేదు. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎక్కడ ఉన్నాయి. కౌశిక్ రెడ్డే కాదు నేను కూడా అడుగుతున్నా.. గాంధీ నువ్వు అసలు ఏ పార్టీలో ఉన్నవ్? ఆ 10 మంది ఎమ్మెల్యేలు కూడా ఏ పార్టీలో ఉన్నారో సమాధానం చెప్పాలి? 6 గ్యారంటీలు ఎక్కడ? హైడ్రా పేరిట హైడ్రామా చేస్తున్నారు. చరిత్రలో నీలాంటి పనికిమాలిన ముఖ్యమంత్రి ఎవరూ ఉండరు. రేవంత్ నీకంటే ముందు చాలా మంది ముఖ్యమంత్రులు వచ్చారు. నువ్వు చిట్టి నాయుడివి.. నీలాంటి బుల్లబ్బాయిలను చాలా మందిని చూశాము. నువ్వు ఏం చేయలేవు. పదవి ఎవరికీ శాశ్వతం కాదు. నీ దుష్ట సంప్రదాయాలు కచ్చితంగా నిన్ను చుట్టుకుంటాయి.’ అని వార్నింగ్ ఇచ్చారు.


‘పోలీసులను వదిలి పెట్టం. న్యాయపరంగా పోరాడుతాం. ఏసీపీ, సీఐలను సస్పెండ్ చేయాలి. రేవంత్ రెడ్డి.. నువ్వు ఎన్ని డ్రామాలు ఆడినా నిన్ను వదిలిపెట్టం. ఎక్కడ ఇలాంటి సంఘటన జరిగినా మేము అండగా ఉంటాం. పార్టీ శ్రేణులకు మేమున్నాం. సీఎం సొంత జిల్లాలోనే చుక్కలు చూపెట్టాం. ఈ ప్రభుత్వానికి పాలమూరు పౌరుషం చూపెట్టాం. మా నాయకులను హౌస్ అరెస్ట్ చేశారు. ప్రాంతీయ తత్వం పేరున ఎక్కడా ఎలాంటి దాడులు, మాటలు లేవు. ఈ పనికి మాలిన సీఎం నాయకత్వంలో ఇలాంటివి జరుగుతున్నాయి. నువ్వే రెచ్చ గొడుతున్నావు. హైదరాబాద్ ప్రజలు మమ్మల్ని కడుపు నిండా ఆశీర్వదించారు. హైదరాబాద్ ప్రజల మీద రేవంత్ పగబట్టారు. ప్రాంతీయ తత్వం కానీ, విబేధాలు కానీ లేవు. గాంధీ బజారు భాష మాట్లాడాడు. రాజకీయాల్లో కామెడీ గాళ్లు ఎక్కువయ్యారు. రూ. 9500 కోట్లతో అభివృద్ధి చేశామని చెప్పావు కదా మరి ఇప్పుడు చేస్తావా? దిక్కుమాలిన పీఏసీ పదవి కోసం దిక్కుమాలిన మాటలు ఎందుకు? ప్రజలు ఏ పార్టీలో ఉన్నారు అని చెబితే ఆయనది అదే పార్టీ అవుతుంది.’ అని కేటీఆర్ అన్నారు.


Also Read:

ఓర్నీ.. లీవ్‌లెటర్ ఇలా ఎవరైనా రాస్తారా?

జగన్ స్టైలే వేరు..

ఈ ఫొటోలో భిన్నంగా ఉన్న నెంబర్ ఎక్కడుందో

For More Telangana News and Telugu News..

Updated Date - Sep 14 , 2024 | 01:10 PM