ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

hyderabad: మూడో వారంలో బడ్జెట్‌ సమావేశాలు!

ABN, Publish Date - Jul 03 , 2024 | 05:29 AM

ఈ నెల మూడో వారంలో రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 22న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో రాష్ట్రంలో బడ్జెట్‌ సమావేశాలు 23న ప్రారంభమయ్యే

  • ఖజానాకు ఆదాయమెలా?.. నేడు కీలక శాఖల

  • ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భేటీ

  • ఈ నెల మూడో వారంలో బడ్జెట్‌ సమావేశాలు?

హైదరాబాద్‌, జూలై 2 (ఆంధ్రజ్యోతి): ఈ నెల మూడో వారంలో రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 22న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో రాష్ట్రంలో బడ్జెట్‌ సమావేశాలు 23న ప్రారంభమయ్యే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల సమాచారం.

కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి వచ్చే నిధుల అంచనాల ఆధారంగా రాష్ట్ర బడ్జెట్‌ను రూపొందించుకునేందుకు వీలుగా ఈ నెల 3వ వారంలో బడ్జెట్‌ సమావేశాలను ప్రారంభించుకునే ఆలోచన ప్రభుత్వం చేస్తోంది. 23న సమావేశాలు ప్రారంభమైనా.. కేంద్రం నుంచి వచ్చే నిధుల అంచనాల ఆధారంగా రాష్ట్ర బడ్జెట్‌ను తీర్చిదిద్దేందుకు మరో వారం రోజులు పడుతుందని, ఆ వారం పాటు బిల్లులు, ఇతర అంశాలపైన సభ నడుస్తుందని ప్రభుత్వ పెద్దల సమాచారం.

Updated Date - Jul 03 , 2024 | 06:49 AM

Advertising
Advertising