CAG Report: 3 లక్షల కోట్లు!
ABN, Publish Date - Aug 04 , 2024 | 04:43 AM
‘రాష్ట్ర ప్రభుత్వం అప్పుల వడ్డీలు, అసలుకే పదేళ్లలో రూ.2.90 లక్షల కోట్లు చెల్లించాలి. ఇప్పుడు బహిరంగ మార్కెట్ నుంచి కొత్తగా అప్పులు తెచ్చినా.. వచ్చే ఆ మొత్తం నుంచి 76.73ు పాత అప్పుల అసలు, వడ్డీలకే చెల్లించే పరిస్థితి. సర్కారుకు నికరంగా మిగిలే నిధులు 23.27ు మాత్రమే’’ అని కంప్ర్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) తీవ్రస్థాయిలో ఆక్షేపించింది.
వచ్చే పదేళ్లలో అసలు, వడ్డీలకు చెల్లించాల్సిన మొత్తం ఇది
ఈ ఏడాది ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌కు దాదాపు సమానం
కొత్తగా తెచ్చే అప్పుల్లో అసలు, వడ్డీలకే 76.73 శాతం
జీఎస్టీ అవకతవకలతో ఖజానాకు రూ.986 కోట్ల నష్టం
2022-23 ఆర్థిక సంవత్సరపు నివేదికలో కాగ్ ఆక్షేపణలు
హైదరాబాద్, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): ‘‘రాష్ట్ర ప్రభుత్వం అప్పుల వడ్డీలు, అసలుకే పదేళ్లలో రూ.2.90 లక్షల కోట్లు చెల్లించాలి. ఇప్పుడు బహిరంగ మార్కెట్ నుంచి కొత్తగా అప్పులు తెచ్చినా.. వచ్చే ఆ మొత్తం నుంచి 76.73ు పాత అప్పుల అసలు, వడ్డీలకే చెల్లించే పరిస్థితి. సర్కారుకు నికరంగా మిగిలే నిధులు 23.27ు మాత్రమే’’ అని కంప్ర్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) తీవ్రస్థాయిలో ఆక్షేపించింది. ఇలా అప్పులు తెచ్చి.. రుణాలను తీర్చే పద్ధతి ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థకు ఏమాత్రం ఆరోగ్యకరం కాదని అభిప్రాయపడింది. అప్పులపై ప్రభుత్వం దృష్టి సారించాలని సూచించింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కాగ్ విడుదల చేసిన వార్షిక నివేదికను ప్రభుత్వం శుక్రవారం శాసనసభలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే..!
ఇందులో రాష్ట్ర ఆర్థిక స్థితిని కాగ్ సాంతం మదింపు చేసింది. రాష్ట్ర అప్పుల విధానాన్ని తూర్పారబట్టింది. రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ అప్పులు 2022-23 సంవత్సరానికి రూ.3,49,537 కోట్లుగా ఉన్నట్లుగా పేర్కొన్న కాగ్.. వివిధ కార్పొరేషన్ల పేర తీసుకున్న గ్యారెంటీ రుణాలు మరో రూ.1,18,629 కోట్లని గుర్తుచేసింది. అంటే.. మొత్తం అప్పు రూ.4,68,166 కోట్లుగా ఉన్నట్లు స్పష్టం చేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరం నుంచి 2032-33 వరకు.. మొత్తం పదేళ్లలో ఈ అప్పుల అసలు, వడ్డీల సొమ్మును చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది.
అంతేకాకుండా.. జాతీయ చిన్న మొత్తాల పొదుపు నిధికి రూ.9,477 కోట్లు, భారత జీవిత బీమా సంస్థ(ఎల్‌ఐసీ)కు రూ.36 కోట్లు, భారత సాధారణ బీమా సంస్థకు రూ.7 కోట్లు, ఉదయ్ బాండ్లకు సంబంధించి రూ.8,031 కోట్లు, వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు(నాబార్డ్)కు రూ.5,526 కోట్లు, జాతీయ సహకారాభివృద్ధి సంస్థ(ఎన్‌సీడీసీ)కు రూ.59 కోట్లను చెల్లించాలని వివరించింది. ఇలా పదేళ్లలో బడ్జెట్ రుణాలు, గ్యారెంటీ రుణాలు, ఇతర ఆర్థిక సంస్థల అప్పులకు సంబంధించి అసలు, వడ్డీల కింద మొత్తం రూ.2,90,154 కోట్లను చెల్లించాల్సి ఉంటుంది. ఇది ప్రస్తుత బడ్జెట్‌కు దాదాపు సమానం కావడం గమనార్హం..! ఈ పరిస్థితులు ప్రభుత్వాన్ని గణనీయమైన ఒత్తిడికి గురిచేస్తాయని కాగ్ ఆందోళన వ్యక్తం చేసింది.
మూలధన వ్యయం 9 శాతమే
సాధారణంగా భవనాలు, రోడ్లు, ప్రాజెక్టులు వంటివాటిని నిర్మించి, ఆస్తులను సృష్టించడానికి వెచ్చించే నిధుల మొత్తాన్ని మూలధన వ్యయంగా పరిగణిస్తారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం పెట్టిన మొత్తం వ్యయంలో ఈ మూలధన వ్యయం 9 శాతమేనని కాగ్ వెల్లడించింది. అంతకుముందు సంవత్సరం మూలధన వ్యయం కింద రూ.28,874 కోట్లను వినియోగిస్తే.. 2022-23లో 38ు తగ్గుదలతో రూ.17,881 కోట్లను మాత్రమే ఖర్చు చేశారని గుర్తుచేసింది. గడిచిన ఐదేళ్లలో 2018-19లో మూలధన వ్యయం 18శాతంగా ఉన్నట్లు తెలిపింది.
జీఎస్టీ కింద రూ.986 కోట్ల నష్టం
వస్తు సేవల పన్ను(జీఎ్‌సటీ) వసూళ్లలో చోటు చేసుకున్న అక్రమాలు, అవకతవకల వల్ల ఐదేళ్ల కాలంలో ఖజానాకు రూ.986 కోట్ల నష్టం వాటిల్లినట్లు కాగ్ ఆక్షేపించింది. 2017-22 మధ్య ఐదేళ్ల కాలంలో పలు అక్రమాలు జరిగాయని తెలిపింది. ముఖ్యంగా పన్ను ఎగవేతలు, కొన్ని కేసుల్లో తక్కువ పన్నును వసూలు చేయడం, కొన్నింటిలో జరిమానాలు వసూలు చేయకుండా వదిలేయడం వల్ల నష్టపోయినట్లు వివరించింది.
హైదరాబాద్‌కు నిధులేవి?
హైదరాబాద్‌ను విశ్వనగరం చేస్తామని, 2020-21 నుంచి ఐదేళ్లలో రూ.50 వేల కోట్లు అవసరమవుతాయని ప్రభుత్వం అంచనా వేసింది. ఇందులో భాగంగా 2020-21 బడ్జెట్‌లో మూసీ ప్రక్షాళన, మూసీ పరీవాహక ప్రాంత ప్రాజెక్టు, ఇతర పథకాల పేరిట రూ.10వేల కోట్లను ప్రతిపాదించింది. 2021-22లో కూడా రూ.2,600 కోట్లు, 2022-23లో రూ.200 కోట్లు కేటాయించినా.. ఆ నిధులను విడుదల చేయలేదంటూ కాగ్ తప్పు పట్టింది. పాతనగర మెట్రో మార్గానికి రూ.500 కోట్లు, విమానాశ్రయ మెట్రో మార్గానికి రూ.378 కోట్లు కేటాయించినా.. పనులు ప్రారంభం కాకపోవడంతో ఈ మొత్తాన్ని ఉపసంహరించుకున్నట్లు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు రూ.11,000 కోట్లు కేటాయించి, అరకొరగా ఖర్చు చేసినట్లు గుర్తుచేసింది.
పదేళ్లలో అసలు, వడ్డీల కింద
ప్రభుత్వం చెల్లించాల్సిన మొత్తం (రూ.కోట్లలో)
సంవత్సరం తీర్చాల్సిన చెల్లించాల్సిన మొత్తం
అసలు వడ్డీ
2023-24 9,341 20,825 30,166
2024-25 13,118 19,945 33,063
2025-26 15,850 18,842 34,692
2026-27 19,786 17,588 37,374
2027-28 17,050 16,102 33,152
2028-29 4,461 14,858 19,319
2029-30 2,449 14,541 16,990
2030-31 4,500 14,353 18,853
2031-32 7,311 14,032 21,343
2032-33 8,587 13,479 22,066
మొత్తం 1,02,453 1,64,565 2,67,018
Updated Date - Aug 04 , 2024 | 04:43 AM