ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Medigadda Barrage: ‘మేడిగడ్డ’ను డ్రోన్‌తో వీడియో తీసినవ్యక్తిపై కేసు

ABN, Publish Date - Aug 06 , 2024 | 04:37 AM

అనుమతి లేకుండా మేడిగడ్డ బ్యారేజీతో పాటు గోదావరి నది ప్రవాహ ప్రాంతాన్ని డ్రోన్‌ ద్వారా వీడియో చిత్రీకరించిన ఓ గుర్తుతెలియని వ్యక్తిపై కేసు నమోదు చేసినట్టు మహదేవపూర్‌ ఎస్సై పవన్‌ కుమార్‌ తెలిపారు.

మహదేవపూర్‌ రూరల్‌, ఆగస్టు 5: అనుమతి లేకుండా మేడిగడ్డ బ్యారేజీతో పాటు గోదావరి నది ప్రవాహ ప్రాంతాన్ని డ్రోన్‌ ద్వారా వీడియో చిత్రీకరించిన ఓ గుర్తుతెలియని వ్యక్తిపై కేసు నమోదు చేసినట్టు మహదేవపూర్‌ ఎస్సై పవన్‌ కుమార్‌ తెలిపారు. గతనెల 26న బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ సహా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతల బృందం మేడిగడ్డ బ్యారేజీ పర్యటనకు రాగా వారి పర్యటనను, బ్యారేజీ, గోదావరి వరద దృశ్యాలను ఓ వ్యక్తి డ్రోన్‌ ద్వారా చిత్రీకరించిన సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశాడు.


అది వైరల్‌ అవ్వడంతో విషయాన్ని ఇరిగేషన్‌ అధికారులు సీరియ్‌సగా తీసుకున్నారు. ఈ ఘటనపై గతనెల 30న ఇరిగేషన్‌ ఏఈఈ వలీ మహదేవపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశామని ఎస్సై పవన్‌ కుమార్‌ తెలిపారు.

Updated Date - Aug 06 , 2024 | 04:37 AM

Advertising
Advertising
<