ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kishan Reddy: రేపు తెలంగాణకు కేంద్ర బృందం

ABN, Publish Date - Sep 10 , 2024 | 04:53 AM

తెలంగాణలో ఈ నెల 11న కేంద్ర బృందం పర్యటించనుందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌ రెడ్డి తెలిపారు.

  • వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన

  • కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 9 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో ఈ నెల 11న కేంద్ర బృందం పర్యటించనుందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌ రెడ్డి తెలిపారు. తెలంగాణలో అకాల వర్షాలు, వరదల కారణంగా జరిగిన నష్టాన్ని కేంద్ర బృందం అంచనా వేస్తుందని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. నేషనల్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ సలహాదారు, కేంద్ర హోంశాఖ జాయింట్‌ సెక్రటరీ కల్నల్‌ కీర్తి ప్రతాప్‌ సింగ్‌ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల బృందం బుధవారం ఖమ్మం, మహబూబాబాద్‌ జిల్లాలు సహా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తుందన్నారు. ఈ బృందంలో ఆర్థిక , వ్యవసాయం, రోడ్లు, రహదారులు, గ్రామీణాభివృద్థి, నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌ విభాగాలకు చెందిన అధికారులు కూడా ఉంటారని వివరించారు. కేంద్ర బృందం వరద ప్రభావిత ప్రాంతా ల్లో పర్యటించి బాధితులు, అధికారులతో చర్చిస్తుందని కిషన్‌ రెడ్డి తెలిపారు.


  • చర్లపల్లి స్టేషన్‌కు రోడ్లు వేయాలంటూ రేవంత్‌కు లేఖ

సికింద్రాబాద్‌, చర్లపల్లి రైల్వే టర్మినల్స్‌కు వెళ్లే రహదారుల విస్తరణకు సహకరించాలంటూ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సీఎం రేవంత్‌కు లేఖ రాశారు. చర్లపల్లి రైల్వే టర్మినల్‌ పనులు దాదాపు పూర్తయ్యాయని పేర్కొంటూ, ప్రయాణికుల రాకపోకలకు కనీసం వంద అడుగుల రోడ్డు అవసరమని వివరించారు. కొత్త రైల్వే లైన్లు, డబ్లింగ్‌, ట్రిప్లింగ్‌, క్వాడ్రప్లింగ్‌తో పాటుగా లైన్ల విద్యుదీకరణ, 40కి పైగా ేస్టషన్ల అభివృద్థి పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. చర్లపల్లిలో రూ.415 కోట్లతో కొత్త రైల్వే టర్మినల్‌ నిర్మాణం వేగవంతంగా పూర్తవుతోందని, ప్రయాణికుల రాకపోకల కోసం 100 అడుగుల రోడ్డు నిర్మాణం అవసరముందని లేఖలో వివరించారు.


సికింద్రాబాద్‌ రైల్వేేస్టషన్‌ను రూ.715 కోట్లతో వచ్చే ఏడాది చివరి నాటికల్లా అత్యాధునిక వసతులతో ప్రజలకు అంకితం చేయడానికి ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయని ఆయన తెలిపారు. రైల్వేేస్టషన్‌కు ప్రయాణికులు వచ్చి, పోయే మార్గాలు చాలా ఇరుకుగా ఉండటంతో, పీక్‌ అవర్స్‌లో తీవ్రమైన ట్రాఫిక్‌ సమస్యలు ఎదురవుతున్నాయని, సమస్య పరిష్కారానికి సీఎం చొరవతీసుకోవాలని కిషన్‌రెడ్డి లేఖలో కోరారు.

Updated Date - Sep 10 , 2024 | 04:53 AM

Advertising
Advertising