CEO Vikasraj: ఓట్ల కౌంటింగ్‌కు పటిష్టమైన భద్రత ఏర్పాట్లు: సీఈఓ వికాస్‌రాజ్
ABN, Publish Date - Jun 01 , 2024 | 03:21 PM
తెలంగాణలో 4వ విడత లోక్‌సభ ఎన్నికలు మే 13న జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ ఓట్లను జూన్ 4వ తేదీన లెక్కించనున్నారు. కౌంటింగ్ కోసం పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేసినట్లు సీఈఓ వికాస్‌రాజ్(CEO Vikasraj) తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా34 ప్రాంతాల్లో కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
హైదరాబాద్: తెలంగాణలో 4వ విడత లోక్‌సభ ఎన్నికలు మే 13న జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ ఓట్లను జూన్ 4వ తేదీన లెక్కించనున్నారు. కౌంటింగ్ కోసం పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేసినట్లు సీఈఓ వికాస్‌రాజ్(CEO Vikasraj) తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా34 ప్రాంతాల్లో కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. చేవెళ్ల, మల్కాజ్‌గిరిలో పోస్టల్ బ్యాలెట్ ఈ కేంద్రాలు ఉన్నాయన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశామన్నారు. ఓట్ల లెక్కింపు హాల్ వద్ద 100 మీటర్ల వరకు ఎవరినీ అనుమతించేది లేదని స్పష్టం చేశారు.
కౌంటింగ్ కేంద్రం లోపలికి మొబైల్, ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు అనుమతి లేదని సూచించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 12 కేంద్రా బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కౌంటింగ్ హాల్ మొత్తం సీసీటీవీ మానిటరింగ్ ఉంటుందన్నారు. స్ట్రాంగ్ రూం నుంచి కౌంటింగ్ హాల్ వరకు సీసీటీవీలో మానిటరింగ్ చేస్తామన్నారు. 2లక్షల 80వేల వరకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వచ్చాయని చెప్పారు.276 టేబుళ్లు పోస్టల్ బ్యాలెట్ కోసం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఒక్కో టేబుల్ వద్ద ఈసీఐ మైక్రో అబ్జర్వర్లు ఉంటారని చెప్పారు.
అత్యధికంగా 24 రౌండ్లు.. చొప్పదండి, యాకూత్‌పుర, దేవరకొండలో ఇవి ఉన్నాయని చెప్పారు. ఆత్యల్పంగా 13 రౌండ్లు.. ఆర్మూర్, భద్రాచలం, అశ్వరావుపేటలో ఉన్నాయన్నారు. మధ్యాహ్నం మూడు గంటల వరకు పోలింగ్ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. కౌంటింగ్ పూర్తి అయ్యాక ప్రతీ అసెంబ్లీ సెగ్మెంట్‌లో 5 పోలింగ్ కేంద్రాల్లో వీవీప్యాట్‌ల లెక్కింపు ఉంటుందన్నారు. తెలంగాణ వ్యాప్తంగా కౌంటింగ్‌కు 10వేల మంది సిబ్బంది పనిచేస్తున్నారని.. మరో 50 శాతం అడిషనల్‌గా అందుబాటులో ఉంటారని చెప్పారు.
రాష్ట్రవ్యాప్తంగా 49 మంది అబ్జర్వర్లు నియమించినట్లు తెలిపారు. ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు కౌంటింగ్ ఏజెంట్ల లిస్టు రాజకీయ పార్టీలు ఇవ్వాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా 2440 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించామని.. ప్రతీ టేబుల్ వద్ద అధికారులు పరిశీలిస్తారని అన్నారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం అవుతుందని.. పోస్టల్ బ్యాలెట్ ఉన్న చోట 8.30 నిమిషాలకు కౌంటింగ్ మొదలు అవుతుందని అన్నారు. ప్రతీ రౌండ్‌కు సిబ్బందితో పాటు అబ్జర్వర్లు కూడా ఈవీఎం కౌంటింగ్ చేస్తారన్నారు. కౌంటింగ్ పూర్తి అయ్యాక ఈవీఎంలను స్టోరేజ్ రూమ్‌లలో పెడతామని.. భారీ బందోబస్తు ఉంటుందని సీఈఓ వికాస్‌రాజ్ పేర్కొన్నారు.
ఈనెల 5న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్
నల్గొండ - వరంగల్ - ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు కౌంటింగ్ జూన్ 5న జరుగుతుందని సీఈఓ వికాస్‌రాజ్ తెలిపారు. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుందన్నారు. 24టేబుళ్లలో కౌంటింగ్ జరుగుతుందని చెప్పారు.కౌంటింగ్‍కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అన్నారు. మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ జూన్ 2న జరుగుతుందన్నారు. మహబూబ్‌నగర్‌లోనే ఓట్ల లెక్కింపు జరుగుతుందన్నారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం అవుతుందని సీఈఓ వికాస్‌రాజ్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
టీడీపీ గెలుస్తుందంటూ.. వైసీపీ నేతల బెట్టింగ్..
దశాబ్ది ఉత్సవాలకు గవర్నర్‌కు ఆహ్వానం..
చీకటి ఒప్పందానికి నో చెప్పిన టీడీపీ..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Jun 01 , 2024 | 05:51 PM