ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TG Elections: నామినేషన్ వేసే ముందు అభ్యర్థులు ఇవి పాటించాల్సిందే: సీఈఓ వికాస్‌రాజ్

ABN, Publish Date - Apr 18 , 2024 | 07:02 PM

లోక్‌సభ ఎన్నికలు, సికింద్రాబాద్ కంటోన్మెట్ ఉప ఎన్నిక నామినేషన్లపై ఎన్నికల సంఘం (Election Commission) కీలక సూచనలు చేసింది. ఈ మేరకు తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్(CEO Vikasraj) మీడియాకు పలు కీలక విషయాలను వెల్లడించారు. నేడు(గురువారం) నుంచి నామినేషన్లు ప్రారంభం అయ్యాయని.. ఈనెల 25వ తేదీ వరకు నామినేషన్లు దాఖలు చేయొచ్చని తెలిపారు. నామినేషన్ ఫామ్, అఫిడవిట్‌‌‌లో అన్ని వివరాలను పూర్తి చేయాలని సూచించారు.

CEO Vikasraj

హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికలు, సికింద్రాబాద్ కంటోన్మెట్ ఉప ఎన్నిక నామినేషన్లపై ఎన్నికల సంఘం (Election Commission) కీలక సూచనలు చేసింది. ఈ మేరకు తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్(CEO Vikasraj) మీడియాకు పలు కీలక విషయాలను వెల్లడించారు. నేడు(గురువారం) నుంచి నామినేషన్లు ప్రారంభం అయ్యాయని.. ఈనెల 25వ తేదీ వరకు నామినేషన్లు దాఖలు చేయొచ్చని తెలిపారు. నామినేషన్ ఫామ్, అఫిడవిట్‌‌‌లో అన్ని వివరాలను పూర్తి చేయాలని సూచించారు. నామినేషన్ పేపర్ల దాఖలు సమయంలో ఒకసారి ఆర్వో ఆఫీస్‌‌లోకి వచ్చిన తర్వాత బయటకు వెళ్లటానికి వీలు లేదని ఆదేశించారు.


Loksabha polls: కాసేపట్లో బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థులకు బీఫారమ్ ఇవ్వనున్న కేసీఆర్

అభ్యర్థి ఎక్కడ నామినేషన్ వేయాలో అక్కడే వేయాలని.. ఒక్క అభ్యర్థి నాలుగు సెట్ల నామినేషన్ వేసే అవకాశం ఉంటుందని తెలిపారు. నామినేషన్ వేసే అభ్యర్థి డిపాజిట్‌ ఫీజు రూ.25 వేలు చెల్లిచాలన్నారు. షెడ్యూల్డ్ తరగతుల వారికి ఫీజులో 15శాతం తగ్గింపు ఉంటుందని వెల్లడించారు. రాజకీయ పార్టీలు ఫామ్ A,B లు సీఈఓ ఆఫీస్, ఆర్వో ఆఫీస్‌లో ఇవ్వాలని సూచించారు.

నామినేషన్ వేసే అభ్యర్థి రీసెంట్ ఫొటోలు ఇవ్వాలని సూచించారు. అభ్యర్థి ఖచ్చితంగా క్రిమినల్ హిస్టరీ పబ్లిష్ చేయాలని ఆదేశించారు. ప్రతి అభ్యర్థి నామినేషన్ వేసే ముందు రోజు కొత్త బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి ఎన్నికల ఖర్చు అకౌంట్‌లో చూపించాల్సిందేనని స్పష్టం చేశారు. గత ఎన్నికల సమయంలో ఓపెన్ చేసిన బ్యాంక్ అకౌంట్ ఈ ఎన్నికల్లో ఉపయోగించడానికి వీలు లేదని సూచించారు. నేడు(గురువారం) 48 నామినేషన్లు రాగా... 42 మంది అభ్యర్థులు దాఖలు చేశారని తెలిపారు.


CM Revanth Reddy: రేపటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం.. షెడ్యూల్ ఇదే..

ఈవీఎంలు(EVM), వీవీప్యాట్లు(VVPATS) సరిపడినన్ని అందుబాటులో ఉన్నాయన్నారు. 19 ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు ఒక నోడల్ అధికారి ఈసీఐ(ECI)నియమించిందని వివరించారు. ఈ ఎన్నికల్లో ఎంపీ స్థానాల పరిధిల్లోని 51 అసెంబ్లీ స్థానాల్లో భారీగా నగదు ఖర్చు అయినట్లుగా గుర్తించామని అన్నారు. ఎన్నికల సిబ్బంది పార్లమెంట్ ఎన్నికలపై గట్టి నిఘా ఉంచిందని చెప్పారు. ఎన్నికల విధులకు 204 అంతర్రాష్ట్ర పోలీసులు, 444 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 160 కేంద్ర సంస్థల బలగాలు.. ఇప్పటికే మరో 60 కంపెనీల బలగాలు తెలంగాణలో గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నాయని తెలిపారు. ప్రతీ జిల్లాలో 16మంది నోడల్ అధికారులు ఉన్నారని... 2లక్షల 94వేల మంది పోలింగ్ స్టాప్ ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్నారని తెలిపారు.


Supreme Court: ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం.. మరోసారి..

ఇప్పటి వరకు తమకు పలువురు అభ్యర్థులపై 2వేల ఫిర్యాదులు వచ్చాయని.. ఎంసీసీ (MCC )వైయిలైజైషన్‌లో 4వేల FIRలు నమోదయ్యాయని చెప్పారు. వేసవి కావడంతో ప్రత్యేక ఏర్పాట్లు చేశామని చెప్పారు. మెడికల్ టీమ్స్ కూడా అందుబాటులో ఉంటాయని తెలిపారు.

తెలంగాణలో మొత్తం 3కోట్ల 31లక్షల మంది ఓటర్లు ఉండగా మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల కంటే ఈ ఎంపీ ఎన్నికలకు మహిళా ఓట్లు మరింతగా పెరిగాయని వివరించారు. 18 నుంచి 19 ఏళ్ల మధ్య వయసు కలిగిన వారు దాదాపు 10 లక్షల మంది ఉన్నారని సీఈఓ వికాస్‌రాజ్ తెలిపారు.


Jagadish Reddy: కేసీఆర్ జోలికి వస్తే తన్ని తరిమేస్తామన్న మాజీ మంత్రి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం.....

Updated Date - Apr 18 , 2024 | 07:22 PM

Advertising
Advertising