మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

High Court: చెన్నుపాటి కిడ్నాప్‌ కేసులో.. ఇద్దరు నిందితులకు అరెస్టు నుంచి రక్షణచెన్నుపాటి కిడ్నాప్‌ కేసులో.. ఇద్దరు నిందితులకు అరెస్టు నుంచి రక్షణ

ABN, Publish Date - Jun 02 , 2024 | 05:18 AM

క్రియా హెల్త్‌కేర్‌ ప్రైవేట్‌ కంపెనీ చీఫ్‌, వ్యాపారవేత్త చెన్నుపాటి వేణుమాధవ్‌ను అపహరించి, బెదిరించి, బలవంతంగా 40ు వాటా షేర్లను బదిలీ చేయించుకున్న కేసులో.. హైకోర్టు ఇద్దరు నిందితులకు అరెస్టు నుంచి తాత్కాలిక రక్షణ కల్పించింది. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో నిందితుడు.

High Court: చెన్నుపాటి కిడ్నాప్‌ కేసులో.. ఇద్దరు నిందితులకు అరెస్టు నుంచి రక్షణచెన్నుపాటి కిడ్నాప్‌ కేసులో.. ఇద్దరు నిందితులకు అరెస్టు నుంచి రక్షణ

  • ఈ నెల 20 వరకు అరెస్టు చేయొద్దు: హైకోర్టు

క్రియా హెల్త్‌కేర్‌ ప్రైవేట్‌ కంపెనీ చీఫ్‌, వ్యాపారవేత్త చెన్నుపాటి వేణుమాధవ్‌ను అపహరించి, బెదిరించి, బలవంతంగా 40ు వాటా షేర్లను బదిలీ చేయించుకున్న కేసులో.. హైకోర్టు ఇద్దరు నిందితులకు అరెస్టు నుంచి తాత్కాలిక రక్షణ కల్పించింది. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో నిందితుడు, హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీపీ(ఓఎస్డీ) రాధాకిషన్‌రావు సహకారంతో తనను కిడ్నాప్‌ చేసి, బలవంతంగా షేర్ల బదిలీ చేయించారని వేణుమాధవ్‌ జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే..!


ఈ కేసులో ఏ2గా ఉన్న గోల్డ్‌ఫిష్‌ కంపెనీ సీఈవో చంద్రశేఖర్‌ వేగె, ఏ7గా ఉన్న తలసిళ్ల రాజశేఖర్‌ను ఈ నెల 20 వరకు అరెస్టు చేయకూడదంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. నిందితులిద్దరూ ఈ కేసుతో తమకు ఎలాంటి సంబంధం లేదని, తమను నిర్దోషులుగా ప్రకటించాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించగా.. జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం విచారణ జరిపింది. ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేస్తూ.. అప్పటి వరకు నిందితులను అరెస్టు చేయొద్దని ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులిచ్చింది.

Updated Date - Jun 02 , 2024 | 05:18 AM

Advertising
Advertising