ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

CM Revanth Reddy: టెట్‌ ఫలితాల విడుదల..

ABN, Publish Date - Jun 13 , 2024 | 03:45 AM

ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌-2024) ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను బుధవారం సీఎం రేవంత్‌రెడ్డి విడుదల చేశారు. పేపర్‌-1లో 67.13ు, పేపర్‌-2లో 34.18ు మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్రంలో మే 20 నుంచి జూన్‌ 2వ తేదీ వరకు కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (సీబీటీ) పద్ధతిలో టెట్‌ను నిర్వహించారు.

  • పేపర్‌-1లో 67ు.. పేపర్‌-2లో 34.18ు అర్హత

  • ఫలితాలను విడుదల చేసిన ముఖ్యమంత్రి రేవంత్‌

  • అర్హత సాధించని అభ్యర్థులకు

  • వచ్చే టెట్‌కు ఉచితంగా దరఖాస్తుకు అవకాశం

హైదరాబాద్‌, జూన్‌ 12 (ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌-2024) ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను బుధవారం సీఎం రేవంత్‌రెడ్డి విడుదల చేశారు. పేపర్‌-1లో 67.13ు, పేపర్‌-2లో 34.18ు మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్రంలో మే 20 నుంచి జూన్‌ 2వ తేదీ వరకు కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (సీబీటీ) పద్ధతిలో టెట్‌ను నిర్వహించారు. పేపర్‌-1 పరీక్షలను ఏడు సెషన్లలో తెలుగు, హిందీ, ఉర్దూ, కన్నడ, మరాఠీ, తమిళం, గుజరాతీ, బెంగాలి వంటి మొత్తం 8 భాషల్లో నిర్వహించారు. పేపర్‌-2 పరీక్షలను 13 సెషన్లలో మొత్తం 7 భాషల్లో నిర్వహించారు.


టెట్‌-2024కు సుమారు 2,86,381 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. పేపర్‌-1 పరీక్షకు 85,996 మంది అభ్యర్థులు హాజరుకాగా.. 57,725 (67.13ు) మంది అభ్యర్థులు అర్హత సాధించారు. అలాగే పేపర్‌-2 పరీక్షకు 1,50,491 మంది అభ్యర్థులు హాజరుకాగా.. 51,443 (34.18ు) మంది అభ్యర్థులు అర్హత సాఽధించారు. అయితే 2023లో నిర్వహించిన టెట్‌తో పోలిస్తే.. ప్రస్తుతం పేపర్‌-1లో 30.2ు, పేపర్‌-2లో 18.8 అర్హత శాతం పెరిగింది. కాగా, ఎన్నికల కోడ్‌ కారణంగా టెట్‌-2024 దరఖాస్తు ఫీజు తగ్గింపునకు ఎన్నికల కమిషన్‌ అంగీకరించలేదు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టెట్‌-2024లో అర్హత సాధించని అభ్యర్థులకు వచ్చే టెట్‌కు ఉచితంగా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించింది.

Updated Date - Jun 13 , 2024 | 03:45 AM

Advertising
Advertising