BJP: కమలం కసరత్తు.. నేడు అభ్యర్థులపై క్లారిటీ.. కేసీఆర్‌కు షాక్ ఇవ్వనున్న నామా?
ABN, Publish Date - Mar 22 , 2024 | 10:35 AM
ఖమ్మం, వరంగల్ బీజేపీ అభ్యర్థులపై నేడు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 17కు గాను.. 15 పార్లమెంట్ స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. వరంగల్, ఖమ్మం స్థానాలను బీజేపీ పెండింగ్‌లో పెట్టింది. వరంగల్ బీజేపీ టికెట్ ఆరూరి రమేష్ కు దాదాపు ఖరారైనట్టు సమాచారం. ఖమ్మం స్థానంపై తర్జన భర్జనలో కమలం పార్టీ ఉంది.
ఖమ్మం: ఖమ్మం (Khammam), వరంగల్ (Warangal) బీజేపీ (BJP) అభ్యర్థులపై నేడు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 17కు గాను.. 15 పార్లమెంట్ స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. వరంగల్, ఖమ్మం స్థానాలను బీజేపీ పెండింగ్‌లో పెట్టింది. వరంగల్ బీజేపీ టికెట్ ఆరూరి రమేష్‌కు దాదాపు ఖరారైనట్టు సమాచారం. ఖమ్మం స్థానంపై తర్జన భర్జనలో కమలం పార్టీ ఉంది. మరోవైపు ఖమ్మం సిట్టింగ్ ఎంపీ, బీఆర్ఎస్ నేత నామా నాగేశ్వరరావు (Nama Nageswara Rao) బీజేపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. ఇంకోవైపు ఖమ్మం టిక్కెట్ ఆశించి.. బీఆర్ఎస్ నేత జలగం వెంకట్రావు బీజేపీలో చేరారు. కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి బలమైన అభ్యర్థి వేటలో బీజేపీ ఉంది.
Delhi Liquor Scam: నేడు సుప్రీంలో ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌పై విచారణ..!
బీజేపీలో ఖమ్మం ఎంపీ టికెట్ హీట్ పెంచుతోంది. టికెట్ హామీతోనే బీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పిన జలగం వెంకట్రావు (Jalagam Venkat Rao) కాషాయ కండువా కప్పుకున్నారు. దీంతో ఖమ్మం నుంచి జలగం వెంకట్రావు అభ్యర్థిత్వం దాదాపు ఖరారైంది. కానీ చివరి నిమిషంలో ఖమ్మం టికెట్‌ను బీజేపీ పెండింగ్‌లో పెట్టింది. అయితే ఖమ్మం బీజేపీ టికెట్ తనదేనని జలగం వెంకట్రావు చెబుతున్నారు. ఖమ్మం టికెట్‌పై పార్టీ సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌ను మర్యాదపూర్వకంగా కలిసినట్టు తెలిపారు. టికెట్ ఎవరికనేది త్వరలో తెలుస్తుందని పేర్కొన్నారు. ఖమ్మం టికెట్ టీడీపీకి కేటాయిస్తారన్న అంశం తన పరిధిలోనిది కాదని చెప్పారు. పొత్తుల అంశం పార్టీ పెద్దలు చూసుకుంటారన్న జలగం.. ఖమ్మం టికెట్ తనకే దక్కుతుందన్న విశ్వాసం ఉందని పేర్కొన్నారు.
Hyderabad: కత్తులు, తుపాకీతో హడలెత్తించినా ధైర్యంగా మడతబెట్టేసి..!
ఎంపీ సీటు కోసం పలువురు బీజేపీ నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఆ పార్టీ జాతీయ నేతలను కలిసి పోటీచేసే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఖమ్మం పార్లమెంట్ టికెట్ రేసులో పలువురు నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఖమ్మం లోక్‌సభ సీటు ఆశిస్తున్నవారిలో ఈవీ రమేష్, వాసుదేవరావు, రంగాకిరణ్, గల్లా సత్యనారాయణ ఉన్నారు. మరోవైపు దక్షిణ తెలంగాణపై కమలం పార్టీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. నల్లగొండ, ఖమ్మం పార్లమెంట్ స్థానాల్లో బలమైన అభ్యర్థులను నిలబెట్టాలని బీజేపీ నిర్ణయించింది. మరోవైపు నామా బీజేపీలో చేరితే.. బీఆర్ఎస్ తరుఫున ఎంపీ అభ్యర్థిగా పువ్వాడ అజయ్‌ను రంగంలోకి దింపే అవకాశం ఉంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్న మూడు కుటుంబాలు కూడా ఖమ్మం జిల్లాలో బలమైన రాజకీయ నేపథ్యాన్ని కలిగి ఉన్నాయి. మొత్తానికి ఖమ్మం జిల్లాలో ఈసారి లోక్‌సభ ఎన్నిక మాత్రం రాష్ట్రంలోనే హాట్ టాపిక్‌గా మారింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Mar 22 , 2024 | 10:35 AM