Lok Sabha Elections 2024: రాముడి పేరు చెప్పి బీజేపీ ఓట్లు అడుగుతోంది: సీఎం రేవంత్
ABN, Publish Date - Apr 30 , 2024 | 04:56 PM
రాముడి పేరు చెప్పి బీజేపీ (BJP) ఓట్లు అడుగుతోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. తెలంగాణకు మోదీ గాడిద గుడ్డు ఇచ్చారని విమర్శించారు. సీతారాముల కళ్యాణం చేసిన తర్వాత అక్షింతలు ఇస్తామని.. కానీ కల్యాణం జరగకముందే బీజేపీ నేతలు ఇక్కడ అక్షింతలు పంచారని చెప్పారు. రాముడిని బీజేపీ అవమానించిందని మండిపడ్డారు.
జయశంకర్ భూపాలపల్లి: రాముడి పేరు చెప్పి బీజేపీ (BJP) ఓట్లు అడుగుతోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. తెలంగాణకు మోదీ గాడిద గుడ్డు ఇచ్చారని విమర్శించారు. సీతారాముల కళ్యాణం చేసిన తర్వాత అక్షింతలు ఇస్తామని.. కానీ కల్యాణం జరగకముందే బీజేపీ నేతలు ఇక్కడ అక్షింతలు పంచారని చెప్పారు. రాముడిని బీజేపీ అవమానించిందని మండిపడ్డారు. తామంతా రాముని భక్తులమేనని స్పష్టం చేశారు. తమకంటే గొప్ప హిందువులు ఉన్నారా అని ప్రశ్నించారు. హిందువులను తాము ఓటు బ్యాంకులాగా వాడుకోమని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.
Loksabha polls 2024: కరెంట్ పోయిందంటూ అబద్దాలు చెబుతున్నారు.. కేసీఆర్‌పై తుమ్మల ఆగ్రహం
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రేవంత్‌రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రేగొండ జనజాతర భారీ బహిరంగ సభలో బీఆర్ఎస్, బీజేపీలపై రేవంత్ తీవ్ర విమర్శలు గుప్పించారు.
గుండు, అరగుండును గెలిపిస్తే ఏం చేశారు..
ఉద్యమంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు కరీంనగర్ అండగా నిలబడ్డిందని తెలిపారు. కరీంనగర్ ప్రజలను కేసీఆర్ మోసం చేశారని మండిపడ్డారు. సెమీ ఫైనల్లో కేసీఆర్‌ను ఓడించాం..ఫైనల్లో గుజరాత్ గులాములను ఓడిస్తామని చెప్పారు. మోదీ తెలంగాణకు ఇచ్చింది ఏం లేదని.. బండి సంజయ్ రాష్ట్రానికి తెచ్చింది ఏం లేదన్నారు. తెలంగాణను మోదీ అవమానిస్తుంటే..బండి సైలెంట్‌గా ఉన్నారని ధ్వజమెత్తారు. గుండు, అరగుండును గెలిపిస్తే.. ఏం చేశారని ప్రశ్నించారు. నిజామాబాద్, కరీంనగర్ బీజేపీ ఎంపీలు నాటకాలు ఆడుతున్నారని సీఎం రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు.
బలహీన వర్గాలపై మోదీ సర్జికల్ స్ట్రైక్స్
‘‘నన్ను అరెస్టు చేసిన కేసీఆర్‌ను ఓ మూలకు పండబెట్టా. కారును తూకం వేయాల్సిందే. కారు షెడ్డుకు పోయింది.. అందుకే కేసీఆర్ బస్సు యాత్ర చేస్తుండు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కయ్యాయి. పార్లమెంట్ ఎన్నికల్లో ఒకరి మీద ఒకరు బలహీన అభ్యర్థులను పెట్టుకున్నారు. మోదీ మా ప్రశ్నకు సమాధానం చెప్పు. రిజర్వేషన్లు రద్దు చేసే హక్కు మీకు ఎవరిచ్చారు. బీజేపీ కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేయడం ఖాయం. బీజేపీ ఓడిపోతేనే..ప్రజలు గెలుస్తారు. బలహీన వర్గాల మీద మోదీ సర్జికల్ స్ట్రైక్స్ చేస్తారు’’ అని సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా.. ఈ సభలో ఆసక్తిరక దృశ్యం చోటుచేసుకుంది. బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకులు ఓ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. బీజేపీ ఇచ్చింది గాడిద గుడ్డు అని ఓ గుడ్డు ఆకారంతో ప్రదర్శన ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ అడిగినవి ఇవి అని ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. 10 ఏళ్లలో బీజేపీ తెలంగాణకు ఇచ్చింది ఏం లేదని కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. సభలో గాడిద గుడ్డు ఆకారం ప్రదర్శన చర్చగా మారింది.
ఇవి కూడా చదవండి
Loksabha polls 2024: కేసీఆర్.. స్థాయిని మరిచి అబద్దాలు మాట్లాడుతున్నారన్న భట్టి
Madhukar Reddy: కాంగ్రెస్ పాలనలో రైతులు అరిగోస పడుతున్నారు..
Read Latest Telangana News And Telugu News
Updated Date - Apr 30 , 2024 | 05:17 PM