CM Revanth Reddy: అన్నారం, సుందిళ్లపై ఫోకస్
ABN, Publish Date - May 20 , 2024 | 05:09 AM
కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పూర్తిస్థాయిలో కాపాడుకొని, ఈ ఏడాది వీటిలో నీటిని నిల్వ చేసి, పంపింగ్ చేయాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. అన్నారం బ్యారేజీని పుణేలోని కేంద్ర నీటి, విద్యుత్ పరిశోధన సంస్థ (సీడబ్ల్యూపీఆర్‌ఎ్‌స)తో, సుందిళ్లను జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ (ఎన్‌జీఆర్‌ఐ)తో పరీక్షలు చేయించడంతో పా టు ఆ బ్యారేజీలు కట్టిన నిర్మాణ సంస్థలతో మరమ్మతులు చేయించనున్నారు.
బ్యారేజీల నుంచి ఈ సీజన్‌లో పంపింగ్‌కు నిర్ణయం!
త్వరలో పంప్‌హౌస్‌ల పరిశీలనకు ముఖ్యమంత్రి బ్యారేజీల మరమ్మతు పనులు వేగవంతం
ఈ బ్యారేజీల నుంచి ఈ సీజన్‌లో
నీరు పంపింగ్ చేసేందుకు నిర్ణయం!
త్వరలో పంప్‌హౌ్‌సల పరిశీలనకు సీఎం
మరమ్మతు పనులు వేగవంతం
హైదరాబాద్, మే 19 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పూర్తిస్థాయిలో కాపాడుకొని, ఈ ఏడాది వీటిలో నీటిని నిల్వ చేసి, పంపింగ్ చేయాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. అన్నారం బ్యారేజీని పుణేలోని కేంద్ర నీటి, విద్యుత్ పరిశోధన సంస్థ (సీడబ్ల్యూపీఆర్‌ఎ్‌స)తో, సుందిళ్లను జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ (ఎన్‌జీఆర్‌ఐ)తో పరీక్షలు చేయించడంతో పా టు ఆ బ్యారేజీలు కట్టిన నిర్మాణ సంస్థలతో మరమ్మతులు చేయించనున్నారు. బ్యారేజీ ఎగువ భాగం (అప్‌స్ట్రీమ్)తో పాటు దిగువ భాగం (డౌన్‌స్ట్రీమ్)లో ఉన్న సిమెంట్ కాంక్రీట్ (సీసీ) బ్లాకులు, అఫ్రాన్లతో పాటు రాఫ్ట్ (పునాది) కింది భాగంలో ఏర్పడిన రం ధ్రాలను సిమెంట్, కాంక్రీట్ మిశ్రమంతో నింపనున్నా రు. ఈ ప్రక్రియ చేపడితే మరమ్మతులు తేలిక అవుతాయి. కాళేశ్వరంలో 3 బ్యారేజీలు ఉండగా అందులో సుందిళ్ల ఒక్కటే తక్కువ సమస్యలను కలిగి ఉంది. మరో కీలకమైన మేడిగడ్డ బ్యారేజీ గత ఏడాది అక్టోబరు 21న కుంగిపోయిన విషయం విదితమే. ఈ ఏడాది వరదలకు మరింత దెబ్బతినకుండా సర్కారు చర్యలకు ఉపక్రమించింది.
బ్యారేజీ గేట్లన్నీ ఎత్తడానికి చర్యలు తీసుకోనున్నారు. ఏడో బ్లాకుకు 12 గేట్లు ఉండగా అందులో ఒక గేటును ఇప్పటిదాకా లేపారు. ఇతర గేట్లను క్రమంగా ఎత్తనున్నారు. ఇక తీవ్రంగా దెబ్బతిన్న 2 పిల్లర్లకు చెందిన గేట్లను క్రేన్ల సహాయంతో లేపాల్సి ఉంటుంది. వరదల అనంతరం కాఫర్ డ్యామ్ నిర్మించి, కొత్త బ్లాకు లేదా దెబ్బతిన్న పిల్లర్ల స్థానంలో కొత్త పిల్లర్లు కట్టే అవకాశాలు ఉన్నాయి. ఈ సీజన్‌లో మేడిగడ్డ బ్యారేజీ ఉపయోగంలోకి రాదని అభిప్రాయానికి సర్కారు వచ్చింది. దాం తో అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో నీటిని నిల్వ చేసుకొని, ఆ నీళ్లను ప్రాజెక్టులోని ఇతర రిజర్వాయర్లలోకి పంపింగ్ చేయనున్నారు. ఇందులో భాగంగా పంప్‌హౌ్‌సలను సీఎం రేవంత్ రెడ్డితో పాటు నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి త్వరలో సందర్శించనున్నారు.
ప్రస్తుతం కన్నెపల్లి(మేడిగడ్డ), సిరిపురం (అన్నారం) పంప్‌హౌ్‌సలు సేఫ్ జోన్‌లో లేవు. పూర్తి రిజర్వాయర్ లెవల్ కన్నా కింద ఉన్నాయి. దాంతో వీటి ప్యానల్ బోర్డులను సురక్షిత ప్రాంతాల్లోకి తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు. అంతా సవ్యంగా జరిగితే ఈసీజన్‌లో సుందిళ్ల, అన్నారం బ్యారేజీల నీ రు ఖరీఫ్, రబీ సీజన్‌లో పంటలకు చేరనుంది. సీఎం పర్యటన నేపథ్యంలో మరమ్మతులు/పునరుద్ధరణ ప్ర క్రియను వేగవంతం చేశారు. పంప్‌హౌ్‌సల పరిశీలన అనంతరం సీఎం బ్యారేజీలపై కీలక ఆదేశాలు జారీ చేయనున్నారు.
Updated Date - May 20 , 2024 | 05:09 AM