ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అమిత్‌ షాను బర్తరఫ్‌ చెయ్యాలి

ABN, Publish Date - Dec 21 , 2024 | 04:34 AM

పార్లమెంటులో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చెయ్యాలని కాంగ్రెస్‌, వామపక్ష సంఘాలు, దళిత సంఘాల నేతలు డిమాండ్‌ చేశారు.

  • అట్రాసిటీ కేసు పెట్టి కటకటాల్లోకి పంపాలి

  • కాంగ్రెస్‌, వామపక్ష, దళిత సంఘాల డిమాండ్‌

కవాడిగూడ, ఇల్లెందు, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): పార్లమెంటులో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చెయ్యాలని కాంగ్రెస్‌, వామపక్ష సంఘాలు, దళిత సంఘాల నేతలు డిమాండ్‌ చేశారు. అమిత్‌షా అట్రాసిటీ కేసు నమోదు చేసి తక్షణమే అరెస్టు చెయ్యాలని కోరారు. అమిత్‌ షా వ్యాఖ్యలకు నిరసనగా ఆయా నేతలంతా లోయర్‌ ట్యాంక్‌బండ్‌ వద్ద ఉన్న బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహం వద్ద శుక్రవారం నిరసనలు చేశారు. ఇందులో భాగంగా టిపీసీసీ మహిళా అధ్యక్షురాలు సునీతారావు ఆధ్వర్యంలో పెద్దసంఖ్యలో మహిళలు నిరసనలో పాల్గొని అమిత్‌షాకు వ ్యతిరేకంగా నినాదాలు చేశారు. అలాగే, కాంగ్రెస్‌ నేత, మాజీ ఎంపీ వీ హనుమంతరావు ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో పార్టీ నేతలు అంబేడ్కర్‌ విగ్రహం వద్ద తన నిరసన తెలియజేశారు.


మరోపక్క,షెడ్యూల్డు కులాల హక్కుల పరిరక్షణ సమితి జాతీయ అధ్యక్షుడు రాజు ఉస్తాద్‌ ఆధ్వర్యంలోనూ ఆందోళన జరిగింది. అంబేడ్కర్‌ను అవమానించిన అమిత్‌ షా తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని వామపక్ష నేతలు పాలడుగు భాస్కర్‌, స్కైలాబ్‌ బాబు, మళ్లు లక్ష్మి, ఆర్‌ శ్రీరాంనాయక్‌, టి సాగర్‌, ఎంవీ రమణ తదితరులు డిమాండ్‌ చేశారు. కాగా, అమిత్‌ షా రాజీనామాకు డిమాండ్‌ చేస్తూ రాష్ట్ర బంద్‌ చేపట్టాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. ఇల్లెందులో శుక్రవారం జరిగిన సీపీఎం మూడో జిల్లా మహాసభలో పాల్గొన్న తమ్మినేని ఈ వ్యాఖ్యలు చేశారు.


అంబేడ్కర్‌ను అవమానించింది కాంగ్రెస్సే : బీజేవైఎం

అంబేడ్కర్‌ను పార్లమెంట్‌లో అవమానించింది కాంగ్రెస్‌ పార్టీయేనని బీజేవైం రాష్ట్ర అధ్యక్షుడు మహేందర్‌ అన్నారు. బీజేపీ ఎంపీలపై దాడి చేసిన రాహుల్‌గాంధీ తక్షణమే దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు లోయర్‌ ట్యాంక్‌ బండ్‌ వద్ద ఉన్న అంబేడ్కర్‌ విగ్రహం వద్ద బీజేవైం ఆందోళన చేపట్టింది. ఆందోళనలో భాగంగా రాహుల్‌ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు యత్నించింది. పోలీసులు వారిని అడ్డుకోవడంతో తోపులాట జరిగి కాసేపు ఉద్రిక్తత నెలకొంది.

Updated Date - Dec 21 , 2024 | 04:34 AM