ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Anil Kumar Yadav: ఎన్ని లీగల్‌ నోటీసులు పంపినా తగ్గేదే లే

ABN, Publish Date - Oct 03 , 2024 | 03:39 AM

రంగనాయకసాగర్‌ ప్రాజెక్టు కోసం సర్వే నంబర్‌ 402లో మాజీ మంత్రి హరీశ్‌రావు గెస్ట్‌ హౌస్‌ ఉన్న 2.36 ఎకరాలను భూసేకరణ నుంచి నాటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎందుకు మినహాయించిందో చెప్పాలని కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడు ఎం.అనిల్‌కుమార్‌ యాదవ్‌ డిమాండ్‌ చేశారు.

  • హరీశ్‌కు ఎక్స్‌ వేదికగా స్పష్టం చేసిన ఎంపీ అనిల్‌కుమార్‌

హైదరాబాద్‌, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): రంగనాయకసాగర్‌ ప్రాజెక్టు కోసం సర్వే నంబర్‌ 402లో మాజీ మంత్రి హరీశ్‌రావు గెస్ట్‌ హౌస్‌ ఉన్న 2.36 ఎకరాలను భూసేకరణ నుంచి నాటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎందుకు మినహాయించిందో చెప్పాలని కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడు ఎం.అనిల్‌కుమార్‌ యాదవ్‌ డిమాండ్‌ చేశారు. తాను చేసిన ఆరోపణలపై ఎన్ని లీగల్‌ నోటీసులు పంపినా.. గత పదేళ్లలో నువ్వు చేసిన అక్రమాలను బయటపెడుతూనే ఉంటానని అనిల్‌కుమార్‌ బుధవారం ఎక్స్‌ వేదికగా హరీశ్‌కు స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రామంచ గ్రామంలో రంగనాయకసాగర్‌ ప్రాజెక్టు పక్కనే ఉన్న హరీశ్‌రావుకు చెందిన విలాసవంతమైన ఫాంహౌస్‌ అక్రమాల చిట్టా ఇదిగో.. అంటూ వీడియో క్లిప్పింగ్‌ను పోస్ట్‌ చేశారు.


రంగనాయకసాగర్‌ ప్రాజెక్టు కోసం సర్వే నంబర్‌ 402లో సామాన్య రైతులకు చెందిన 2.08 ఎకరాల భూములనే ఎందుకు సేకరించారని, హరీశ్‌ గెస్ట్‌ హౌస్‌ ఉన్న 2.36 ఎకరాలను ఎందుకు మినహాయించారని ప్రశ్నించారు. సర్వే నంబరు 402లో ఉన్న 2.36 ఎకరాల భూమిని హరీశ్‌ రెండు విడతలుగా ఎలా కొనుగోలు చేశారు? దీనికి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. రంగనాయకసాగర్‌ భూసేకరణలో అక్రమాలకు పాల్పడింది నిజం కాదా? అధికార దుర్వినియోగంతో ఫాంహౌస్‌ ఉన్న భూమిని, భూసేకరణ నుంచి మినహాయించింది వాస్తవం కాదా? దీనిపై బహిరంగ చర్చకు సిద్ధమా? అని అనిల్‌కుమార్‌ సవాల్‌ విసిరారు.

Updated Date - Oct 03 , 2024 | 03:39 AM