ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఏడుపు ఎందుకు సబితమ్మా?: కాంగ్రెస్‌

ABN, Publish Date - Aug 01 , 2024 | 02:59 AM

‘ఏడుపు ఎందుకు సబితమ్మా? చేవెళ్ల చెల్లమ్మా అని కాంగ్రెస్‌ పార్టీ ఆదరించినందుకా?’ అంటూ ఆ పార్టీ బుధవారం అసెంబ్లీలో జరిగిన సంఘటనపై ‘ఎక్స్‌’ వేదికగా ప్రశ్నించింది.

హైదరాబాద్‌, జూలై 31 (ఆంధ్రజ్యోతి): ‘ఏడుపు ఎందుకు సబితమ్మా? చేవెళ్ల చెల్లమ్మా అని కాంగ్రెస్‌ పార్టీ ఆదరించినందుకా?’ అంటూ ఆ పార్టీ బుధవారం అసెంబ్లీలో జరిగిన సంఘటనపై ‘ఎక్స్‌’ వేదికగా ప్రశ్నించింది. ‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వంలో హోం మంత్రిని చేసినందుకా? కష్టకాలంలో కాంగ్రె్‌సను మోసం చేసి పదవి కోసం బీఆర్‌ఎ్‌సలో చేరినందుకా? బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేగా ఉంటూ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి పనిచేసినందుకా? నువ్వు ఏడిస్తే సానుభూతి రాదు సబితమ్మా!’ అని కాంగ్రెస్‌ నేతలు ఆ పార్టీ అధికారిక ‘ఎక్స్‌’ వేదికగా పేర్కొన్నారు.


కాగా, పదేళ్లు అధికారంలో ఉన్న కేటీఆర్‌ ఉద్యోగాల ప్రకటనలకే పరిమితమెతే... సీఎం రేవంత్‌ రెడ్డి 7 నెలల్లో 30 వేల కొలువులు భర్తీ చేశారని టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్‌ అన్నారు. కాగా, కాంగ్రెస్‌ పార్టీ మహిళల పక్షపాతి అని, ఆడబిడ్డల ఆత్మగౌరవం పెంచిందే సీఎం రేవంత్‌ రెడ్డి అని ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పేర్కొన్నారు. బుధవారం సభా నాయకుడిని బీఆర్‌ఎస్‌ నాయకులు ఏకవచనంతో సంబోధించడాన్ని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ ఖండించారు. సీఎం ప్రసంగంలో మహిళలను అగౌరవపరిచే వ్యాఖ్యలు లేవన్నారు. గతంలో కేసీఆర్‌ మహిళలను కించపరిచేలా మాట్లాడారన్నారు. మహిళా గవర్నర్‌ను ఇబ్బంది పెట్టిన సందర్భాలు ప్రజలకు తెలుసన్నారు.

Updated Date - Aug 01 , 2024 | 02:59 AM

Advertising
Advertising
<