ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

నేడు కాంగ్రెస్‌ అంబేడ్కర్‌ సమ్మాన్‌ సప్తాహ్‌

ABN, Publish Date - Dec 24 , 2024 | 03:30 AM

రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ను కించపరిచేలా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వ్యాఖ్యలకు నిరసనగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌.. అంబేడ్కర్‌ సమ్మాన్‌ సప్తాహ్‌ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ దీపాదాస్‌ మున్షీ వెల్లడించారు.

  • అమిత్‌షాను క్యాబినెట్‌ నుంచి తొలగించాలని కోరుతూ జిల్లా కలెక్టర్లకు వినతులు

  • హైదరాబాద్‌ కలెక్టర్‌కు వినతిపత్రం ఇవ్వనున్న భట్టి, మహేశ్‌ గౌడ్‌..

హైదరాబాద్‌, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ను కించపరిచేలా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వ్యాఖ్యలకు నిరసనగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌.. అంబేడ్కర్‌ సమ్మాన్‌ సప్తాహ్‌ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ దీపాదాస్‌ మున్షీ వెల్లడించారు. మంగళవారం ప్రతి జిల్లా కేంద్రంలో అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి.. ఆయా జిల్లాల కలెక్టర్లను కలవాలని, కేంద్ర మంత్రివర్గం నుంచి అమిత్‌షాను బర్తరఫ్‌ చేయాలంటూ వినతిపత్రం ఇవ్వాలని పార్టీ నేతలు, కార్యకర్తలకు సూచించారు. సోమవారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీడబ్ల్యూసీ సభ్యుడు కొప్పుల రాజు, టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌లతో కలిసి ఆమె మాట్లాడారు. దేశ ప్రజలకు అమిత్‌ షా క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. అవినీతి, ఇతర అంశాలపై బీజేపీని ప్రశ్నించినప్పుడల్లా దాన్ని పక్కదారి పట్టించడానికి బీజేపీ నేతలు ఇలాంటి విషయాలను తెరపైకి తీసుకువస్తారన్నారు.


మహేశ్‌గౌడ్‌ మాట్లాడుతూ.. అమిత్‌షా వ్యాఖ్యలతో అంబేడ్కర్‌ పట్ల బీజేపీ వైఖరి మరోసారి బహిర్గతమైందని చెప్పారు. రాహుల్‌గాంధీ క్యారెక్టర్‌ను దెబ్బతీసేందుకే ఆయనపై హత్యాయత్నం కేసును నమోదు చేసిందని మండిపడ్డారు. కాగా, అంబేడ్కర్‌ సమ్మాన్‌ సప్తా్‌హలో భాగంగా మంగళవారం హైదరాబాద్‌ కలెక్టర్‌కు డిప్యూటీ సీఎం భట్టి, టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌గౌడ్‌ వినతిపత్రం అందజేయనున్నారు. ముందుగా వారు ట్యాంక్‌బండ్‌ వద్దనున్న అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నుంచి.. లక్డీకాపూల్‌లోని హైదరాబాద్‌ కలెక్టరేట్‌ వరకు పాదయాత్ర నిర్వహించనున్నారు. అనంతరం కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పిస్తారు. ఇందులో మంత్రులు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఏఐసీసీ నేతలు పాల్గొననున్నారు.

Updated Date - Dec 24 , 2024 | 03:30 AM