Share News

CP CV Anand: ఎస్‌బీ విధులు ఆషామాషీ కాదు.. మీరిచ్చే సమాచారం చాలా కీలకం

ABN , Publish Date - Oct 19 , 2024 | 08:10 AM

‘స్పెషల్‌ బ్రాంచి (ఎస్‌బీ) విధులంటే ఆషామాషీ కాదు. మీరిచ్చే సమాచారం చాలా కీలకం. గ్రౌండ్‌ రిపోర్టును బట్టే ఉన్నతాధికారుల చర్యలుంటాయి. నిఘా విషయంలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలి.

CP CV Anand: ఎస్‌బీ విధులు ఆషామాషీ కాదు.. మీరిచ్చే సమాచారం చాలా కీలకం

- నిఘా విషయంలో అప్రమత్తంగా ఉండాలి

- గ్రౌండ్‌ రిపోర్టును బట్టే ఉన్నతాధికారుల చర్యలు

- స్పెషల్‌ బ్రాంచి సిబ్బందితో సీపీ సీవీ ఆనంద్‌ సమీక్ష

హైదరాబాద్‌ సిటీ: ‘స్పెషల్‌ బ్రాంచి (ఎస్‌బీ) విధులంటే ఆషామాషీ కాదు. మీరిచ్చే సమాచారం చాలా కీలకం. గ్రౌండ్‌ రిపోర్టును బట్టే ఉన్నతాధికారుల చర్యలుంటాయి. నిఘా విషయంలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. క్షేత్రస్థాయిలో దృష్టి కేంద్రీకరించాలి.’ అని ఎస్బీ సిబ్బందికి నగర పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌(City Police Commissioner CV Anand) దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని ఏడు జోన్ల స్పెషల్‌ బ్రాంచ్‌ అధికారులు, సిబ్బందితో కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో ఆయన శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ వార్తను కూడా చదవండి: Viral Video: వామ్మో.. దఢ పుట్టిస్తున్న వీడియో.. ఖడ్గమృగాన్ని ఈ సింహం ఎలా తింటుందో చూస్తే..


పోలీసుశాఖలో నిఘా విభాగం (స్పెషల్‌ బ్రాంచి) ఎంతో కీలకమైందన్నారు. హైదరాబాద్‌ సిటీ పోలీసుకు స్పెషల్‌ బ్రాంచి ఒక మూల స్తంభం లాంటిదన్నారు. ఎస్బీలో విధులంటే కొందరు పనిష్‏మెంట్‌గా భావిస్తుంటారని, ఎవరూ అలా అనుకోవద్దని సీపీ సూచించారు. స్థానిక ప్రజలు, పెద్దలు, నాయకులతో నిరంతరం సత్సంబంధాలు కలిగి ఉన్నప్పుడే, సమాచారం పొందగలుగుతామని అన్నారు. ఎస్బీ సిబ్బంది, అధికారులు సమాచారం ఎక్కడి నుంచి వస్తుందనేది ఎప్పుడూ బహిర్గతం చేయవద్దని, సోర్స్‌ను కాపాడుకుంటేనే మరింత ఎక్కువ సమాచారం, ఎక్కువ కాలంపాటు ఉంటుందని తెలిపారు.


కొత్తగా సిటీకి వచ్చేవారిపై నిఘా

బయటి నుంచి కొత్తగా సిటీకి వచ్చే వారిపై నిరంతర నిఘా అవసరమని ఎస్బీ సిబ్బందికి సీపీ సూచించారు. మరీ ముఖ్యంగా సరిహద్దు దేశాల నుంచి నగరానికి వివిధ పనుల నిమిత్తం వచ్చే వారు ఎక్కువగా ఉంటారని, అలాంటి వారిపై నిరంతరం నిఘా అవసరమని తెలిపారు. నిరంతరం ఒకే విధమైన పనితీరుతో పనిచేస్తేనే మెరుగైన ఫలితాలు వచ్చేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. ట్రూత్‌ ఎనీ కాస్ట్‌ అనే విధంగా పనిచేయాలని ఎస్బీ సిబ్బందికి సూచించారు.

city1.2.jpg


ఎస్‌హెచ్‌లకు అవగాహన ఉండాలి

తమ స్టేషన్‌ పరిధిలోని అన్ని ప్రాంతాలపైనా ఎస్‌హెచ్‌లకు పూర్తి అవగాహన ఉండాలని సీపీ ఆదేశించారు. అప్పుడే సమస్య తీవ్రతరం కాకుండా నిరోధించవచ్చని తెలిపారు. పాస్‌పోర్టు వెరిఫికేషన్‌లో నిజాయితీగా, అక్రమాలకు పాల్పడకుండా పనిచేయాలని అప్పుడే పోలీ్‌సశాఖకు మంచి పేరు వస్తుందని వెల్లడించారు. సమావేశంలో డీసీపీ చైతన్యకుమార్‌, ఎస్బీ అధికారులు పాల్గొన్నారు.


ఇదికూడా చదవండి: Cyberabad police: ఆర్‌జే శేఖర్‌ బాషా అరెస్టు..

ఇదికూడా చదవండి: High Court: ఫోన్‌ ట్యాపింగ్‌ నిందితుడు రాధాకిషన్‌రావు

ఇదికూడా చదవండి: Bhupalpally: సింగరేణి ఓసీపీలతో దినదిన గండం!

ఇదికూడా చదవండి: Tummala: సోనియా పుట్టిన రోజు నాటికి రుణమాఫీ పూర్తి

Read Latest Telangana News and National News

Updated Date - Oct 19 , 2024 | 08:12 AM