ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Danakishore: గుంతలను సత్వరమే పూడ్చండి..

ABN, Publish Date - Sep 03 , 2024 | 11:25 AM

నగరంలోని రోడ్లపై రాళ్లుండొద్దని, గుంతలను యుద్ధప్రాతిపదికన పూడ్చాలని అధికారులను మున్సిపల్‌ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్‌(Danakishore) ఆదేశించారు. కాంప్రహెన్సివ్‌ రోడ్‌ మెయింటెనెన్స్‌ ప్రోగ్రామ్‌(సీఆర్‌ఎంపీ) పథకంలో భాగంగా చేపట్టి పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఇంజనీరింగ్‌ అధికారులు, ఏజెన్సీలను ఆదేశించారు.

- మున్సిపల్‌ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్‌

హైదరాబాద్‌ సిటీ: నగరంలోని రోడ్లపై రాళ్లుండొద్దని, గుంతలను యుద్ధప్రాతిపదికన పూడ్చాలని అధికారులను మున్సిపల్‌ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్‌(Danakishore) ఆదేశించారు. కాంప్రహెన్సివ్‌ రోడ్‌ మెయింటెనెన్స్‌ ప్రోగ్రామ్‌(సీఆర్‌ఎంపీ) పథకంలో భాగంగా చేపట్టి పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఇంజనీరింగ్‌ అధికారులు, ఏజెన్సీలను ఆదేశించారు. సోమవారం సాయంత్రం మాసబ్‌ట్యాంక్‌లోని టీయూఎఫ్ఐడీసీ కార్యాలయంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆమ్రపాలి(GHMC Commissioner Amrapali), వాటర్‌బోర్డు ఎండీ అశోక్‌ రెడ్డి, ఈడీ మయాంక్‌ మిట్టల్‌, ఉన్నతాధికారులు, టీయూఎఫ్ఐడీసీ ఇంజనీర్లు, సంబంధిత ఏజెన్సీ ప్రతినిధులతో సీఆర్‌ఎంపీ, ఎస్‌ఆర్‌డీపీ, ఎస్‌ఎన్‌డీపీ పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు సర్కిళ్ల పరిధిలో పర్యవేక్షక, కార్యనిర్వాహక, ఉప కార్యనిర్వాహక ఇంజనీర్లు, ఏజెన్సీ ప్రతినిధులు ఉదయం పూట క్షేత్రస్థాయిలో పర్యటించాలని, పనులు చేపట్టక ముందు, పూర్తి అయిన తర్వాత ఫొటోలు, ప్రజల ఫీడ్‌బ్యాక్‌తో స్లైడ్‌లను వాట్సాప్‌ గ్రూప్‌లో షేర్‌ చేయాలని సూచించారు. ఇప్పటి వరకూ పూర్తి అయిన పనులకు సంబంధించి ఏజెన్సీలు ఆడిట్‌ రిపోర్ట్‌ అందజేయాలని ఆదేశించారు. థర్డ్‌ పార్టీ ఏజెన్సీలతో కూడా ఆడిట్‌ చేయించాలని చెప్పారు.


...............................................................

ఈ వార్తను కూడా చదవండి:

................................................................

MLA Danam Nagender: బురద రాజకీయాలు మానండి..

- బీఆర్‌ఎస్‌ నేతలపై దానం నాగేందర్‌ ఆగ్రహం

హైదరాబాద్‌: వరద ప్రాంతాల్లో మంత్రులు పర్యటిస్తూ సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటుంటే.. సీఎం, మంత్రులు ఏం చేస్తున్నారంటూ బీఆర్‌ఎస్‌ నేతలు బురద రాజకీయాలకు పాల్పడుతున్నారని ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌(Khairatabad MLA Danam Nagender) అన్నారు. ఇకనైనా బురద రాజకీయాలు మానుకోవాలని సూచించారు. గాంధీభవన్‌లో టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌తో కలిసి ఆయన మాట్లాడారు. ఎలాంటి కష్ట సమయాల్లోనైనా ప్రజలకు తోడుగా ఉండాలని బీఆర్‌ఎస్‌(BRS) నేతలకు హితవుపలికారు. మహేశ్‌గౌడ్‌ మాట్లాడుతూ కేంద్రం స్పందించి తక్షణ సాయం ప్రకటించాలని కోరారు.


వరద బాధిత కుటుంబాలకు కాంగ్రెస్‌ ప్రభుత్వం అండగా ఉంటుందని గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రియాజ్‌ అన్నారు. టీపీసీసీ(TPCC) అధికార ప్రతినిధులు భవానీరెడ్డి, సంధ్యారెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. వరదలపై ప్రభుత్వం ఏమీ చేయట్లేదంటూ మాజీ మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కాగా, యూత్‌ కాంగ్రెస్‌ ఎన్నికలు పారదర్శకంగా జరగాల్సి ఉందని, ఏఐసీసీ సూచన మేరకు ఈ ఎన్నికల ప్రచారంలో పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షులు సహా పార్టీ నాయకులెవరూ పాల్గొనవద్దని మహేశ్‌ గౌడ్‌ కోరారు.


ఇదికూడా చదవండి: Cyber ​​criminals: నగరంలో.. ఆగని సైబర్‌ మోసాలు..

ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్‌ హాస్టల్‌..

ఇదికూడా చదవండి: Hyderabad: కారుతో ఢీకొట్టి.. కళ్లల్లో కారం చల్లి...

Read Latest Telangana News and National News

Updated Date - Sep 03 , 2024 | 11:25 AM

Advertising
Advertising