Danapur Express: ‘దానాపూర్’ రైలు ప్రయాణికులకు శుభవార్త.. అదేంటంటే..
ABN, Publish Date - Jun 30 , 2024 | 11:12 AM
దానాపూర్ ఎక్స్‌ప్రెస్ రైలు(Danapur Express Train) అంటేనే ప్రయాణికులు బెంబేలెత్తిపోయేవారు. ఇప్పటి వరకు ఈ రైలు రిజర్వేషన్ బోగీల్లో సాధారణ ప్రయాణికులు, టికెట్ తీసుకోకుండా ప్రయాణం చేసే వారే ఎక్కువగా కనిపించేవారు. రిజర్వేషన్ చేసుకున్న బెర్తులో ప్రయాణికులను బెదిరించి బీహారీలు కూర్చునేవారు.
- ఇక నుంచి మీ బెర్తులో సుఖంగా ప్రయాణించండి
- సికింద్రాబాద్‌లో ఆర్పీఎఫ్ పోలీసుల స్పెషల్ డ్రైవ్ ఫలితమిది
సికింద్రాబాద్: దానాపూర్ ఎక్స్‌ప్రెస్ రైలు(Danapur Express Train) అంటేనే ప్రయాణికులు బెంబేలెత్తిపోయేవారు. ఇప్పటి వరకు ఈ రైలు రిజర్వేషన్ బోగీల్లో సాధారణ ప్రయాణికులు, టికెట్ తీసుకోకుండా ప్రయాణం చేసే వారే ఎక్కువగా కనిపించేవారు. రిజర్వేషన్ చేసుకున్న బెర్తులో ప్రయాణికులను బెదిరించి బీహారీలు కూర్చునేవారు. దీంతో రిజర్వేషన్ చేసుకున్నా జనరల్ బోగిలో ప్రయాణం చేసినట్లే ఉండేది. బీహారీల ఆగడాలకు ఆర్పీఎఫ్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ ద్వారా చెక్ పెడుతున్నారు. సికింద్రాబాద్ నుంచి బీహార్(Secunderabad to Bihar)కు వెళ్లే దానాపూర్ ఎక్స్‌ప్రెస్ రైలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఉదయం 9.25 గంటల సమయంలో ప్లాట్ ఫాంపైకి చేరుకుంటుంది. ఆర్పీఎఫ్ పోలీసులు ఈ రైలు ప్రతి బోగి వద్ద ఒకరు ఉంటూరిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులను బోగిలోకి ఎక్కించి సాధారణ ప్రయాణికులను జనరల్ బోగిలోకి పంపిస్తున్నారు. దీంతో దానాపూర్ ఎక్స్ప్రెస్కు రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇదికూడా చదవండి: Hyderabad: బీఆర్‌ఎస్ నాయకురాలి ఆత్మహత్య.. కారణం ఏంటంటే..
అదనంగా రెండు జనరల్ బోగీలు ఏర్పాటు చేయాలి..
ఇప్పటి వరకు జనరల్ టికెట్లు తీసుకున్న ప్రయాణికులు రిజర్వేషన్ బోగిలో ప్రయాణం చేసేవారు. ఆర్పీఎఫ్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టడంతో ఉన్న జనరల్ బోగిలో వందల మంది ప్రయాణికులు ప్రయాణం చేయడం కష్టంగా మారింది. బీహార్ వైపు వెళ్లే రైలు ఇదొక్కటే కావడం, హైదరాబాద్ నగర శివారులో వేలాదిగా ఉన్న బీహార్ కార్మికులను దృష్టిలో ఉంచుకుని దానాపూర్ ఎక్స్‌ప్రె్‌సకు ముందు ఒకటి, వెనుక వైపు ఒక జనరల్ బోగిని ఏర్పాటు చేయాలని రైల్వే అధికారులకు ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్ తప్పదంటూ బెదిరింపులు
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu News
Updated Date - Jun 30 , 2024 | 11:12 AM