Hyderabad: గాంధీభవన్‌లో ‘దశాబ్ది’ ఉత్సవాలు..
ABN, Publish Date - Jun 03 , 2024 | 05:42 AM
తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు గాంధీభవన్‌లో ఆదివారం ఘనంగా జరిగాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, సీతక్క, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్‌గౌడ్, ఎంపీ అనిల్ యాద వ్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, మాజీ మంత్రి గీతారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు..
ఎన్టీఆర్‌భవన్, సీపీఐ కార్యాలయాల్లోనూ వేడుకలు
హైదరాబాద్, జూన్ 2 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు గాంధీభవన్‌లో ఆదివారం ఘనంగా జరిగాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, సీతక్క, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్‌గౌడ్, ఎంపీ అనిల్ యాద వ్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, మాజీ మంత్రి గీతారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేశ్ గౌడ్.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సేవాదళ్ మార్చ్‌ను జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మహేశ్ గౌడ్ మాట్లాడుతూ.. పదేళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ ఆకాంక్షలు నెరవేరలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీకి కృతజ్ఞతగా ప్రజలు కాంగ్రెస్ గెలిపించి కానుకగా ఇచ్చారని చెప్పారు.
ఎన్టీఆర్ భవన్‌లో..
తెలంగాణ ఆవిర్భావ వేడుకలను టీటీడీపీ ఘనం గా నిర్వహించింది. ఎన్టీఆర్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సామ భూపాల్‌రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐటీని అభివృద్ధి చేసి హైదరాబాద్‌కు ప్రపంచ గుర్తింపు తెచ్చిన ఘనత చంద్రబాబుదేనన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలని చంద్రబాబు లేఖ ఇచ్చిన తర్వాతే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిందన్నారు. కార్యక్రమంలో పార్టీ జాతీయ అధికార ప్రతినిధి తిరునగరి జ్యోత్స్న, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అజ్మీరా రాజు నాయక్, పార్టీ నేతలు షేక్ ఆరిఫ్, జయరాం చందర్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజా పాలన సాగాలి: నారాయణ
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలా నియంతృత్వ ధోరణితో కాకుండా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్ సర్కారు పాలించాలని సీపీఐ జాతీయ నేత కె.నారాయణ సూచించారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, చాడ వెంకటరెడ్డితో కలిసి ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నారాయ ణ మాట్లాడుతూ.. ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా పాలించిన కేసీఆర్ ప్రభుత్వానికి పదేళ్లకే నూరేళ్లు నిండాయన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభు త్వం అందరినీ కలుపుకొని ముందుకెళ్లాలని సూచించారు. కూనంనేని మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్రం కోసం సీపీఐ వీరోచిత పోరాటం చేసిందన్నారు.
Updated Date - Jun 03 , 2024 | 05:42 AM