ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Bhatti Vikramarka: షెడ్ నుంచి కారు ఇక బయటకు రాదంతే.. బీఆర్‌ఎస్‌‌పై భట్టి కామెంట్స్

ABN, Publish Date - May 06 , 2024 | 01:36 PM

Telangana: దేశ సంపదను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పెట్టుబడిదారులకు పంచి పెడుతున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... నామా నాగేశ్వరరావును కేసీఆర్ ఏ పార్టీ నుంచి కేంద్ర మంత్రిని చేస్తారని ప్రశ్నించారు. తెలంగాణలో ఒక్క సీట్ కూడా గెలవని బీఆర్ఎస్ నుంచి నామా ఎలా మంత్రి అవుతారని నిలదీశారు.

ఖమ్మం, మే 6: దేశ సంపదను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi)పెట్టుబడిదారులకు పంచి పెడుతున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) ఆరోపించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... నామా నాగేశ్వరరావును (Nama Nageshwar Rao) కేసీఆర్ (BRS Chief KCR) ఏ పార్టీ నుంచి కేంద్ర మంత్రిని చేస్తారని ప్రశ్నించారు. తెలంగాణలో (Telangana) ఒక్క సీట్ కూడా గెలవని బీఆర్ఎస్ నుంచి నామా ఎలా మంత్రి అవుతారని నిలదీశారు. బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్రంలో అడ్రస్ ఉండదని.. దాని గురించి భయపడేది లేదన్నారు. కార్ షెడ్ నుంచి ఇక బయటకు రాదని స్పష్టం చేశారు. ఓట్లు అడగడం వరకే కాదని.. కాంగ్రెస్ గతంలో ఎలా సేవ చేసిందో భవిష్యత్‌లో కూడా అలానే సేవ చేస్తామని హామీ ఇచ్చారు.

AP Elections: ఒకరికొకరు ఎదురైన కూటమి అభ్యర్థి, వైసీపీ అభ్యర్థి.. నవ్వుతూ కరచాలనం.. ఎక్కడంటే?


సోయి ఉండి మాట్లాడుతున్నారా?

రూ.1400 కోట్లతో కావల్సిన ప్రాజెక్టులను వేల కోట్లు వెచ్చించి ఒక్క చుక్క నీరు రాకుండా చేసిన చరిత్ర కేసీఆర్‌ ది అని విమర్శించారు. కృష్ణా జలాలతో పాటు గోదావరి జలాలు కూడా అందిస్తామన్నారు. ‘‘ధనిక రాష్ట్రాన్ని మీ చేతిలో పెడితే ఒక్క నెల కూడా మొదటి నెల జీతం ఇవ్వలేని ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. మేము అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అందరికీ జీతాలు ఇస్తున్నాం. కాకి అరిచినట్లుగా రైతు బందు ఇవ్వలేదు అని అంటున్నారు. సోయి ఉండి మాట్లాడుతున్నారా? 65 లక్షల మందికి రైతుబంధు వేశాం.. మిగిలిన వారికి వేస్తున్నాం. అబద్దాల పునాదుల మీద బ్రతికిన కేసీఆర్ లక్ష్యం మాపై బురదజల్లడం. కేసీఆర్ ముందు నీ బాషా మార్చుకో. కేసీఆర్ సిగ్గులేకుండా మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఏమిటా మాటలు? దద్దమ్మలు, సన్నాసులు అంటే చూస్తూ ఊరుకోం. నువ్వు చేసిన దోపిడీ సొమ్ము కక్కించి వాటితో మేము ఆరు గ్యారెంటీ పథకాలు అమలు చేస్తాం. కోడ్ పూర్తి కాగానే ఇందిరమ్మ ఇళ్ల కు శంకుస్థాపనలు చేస్తాం’’ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి...

Pawan Kalyan: పవన్‌తో పాటు మెగా ఫ్యామిలీపై ముద్రగడ సంచలన వ్యాఖ్యలు

MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు చుక్కెదురు

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 06 , 2024 | 01:44 PM

Advertising
Advertising