ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Rain Damage: శతాధిక వృద్ధురాలికి ఎంత కష్టం!

ABN, Publish Date - Jul 18 , 2024 | 03:33 AM

ఆ అవ్వ వయస్సు వందేళ్లపైనే! నా అనేవాళ్లెవరూ లేరు. చాలా ఏళ్లుగా ఇంట్లో ఒంటరిగా ఉంటున్న ఆ పండుటాకుకు ఇప్పుడు ఆ ఇల్లూ లేకుండా పోయింది. వర్షాలకు తడిసి ఇంట్లోని ఓ భాగం కూలిపోయింది.

  • వర్షాలకు కూలిపోయిన ఇల్లు

  • ఎప్పుడు పడిపోతోందో తెలియని అదే ఇంట్లోని మరో భాగంలో నివాసం

వికారాబాద్‌ /బంట్వారం, జూలై 17: ఆ అవ్వ వయస్సు వందేళ్లపైనే! నా అనేవాళ్లెవరూ లేరు. చాలా ఏళ్లుగా ఇంట్లో ఒంటరిగా ఉంటున్న ఆ పండుటాకుకు ఇప్పుడు ఆ ఇల్లూ లేకుండా పోయింది. వర్షాలకు తడిసి ఇంట్లోని ఓ భాగం కూలిపోయింది. ఎప్పుడు కుప్పకూలుతుందో తెలియని అదే ఇంట్లో ఆమె బిక్కుబిక్కుమంటూ ఉంటోంది. వికారాబాద్‌ జిల్లా, బంట్వారం మండలం సల్భాత్తాపూర్‌ గ్రామానికి చెందిన ఈడిగి కాశవ్వ అనే శతాధిక వృద్ధురాలికి వచ్చిన కష్టమిది. అప్పుడెప్పుడో 60 ఏళ్ల క్రితం భర్తతో కలిసి కాశవ్వ సల్భత్తాపర్‌కు వచ్చింది. ఆమె కూతురు, భర్త చనిపోయారు.


ఐదేళ్ల క్రితం దాకా చిన్న కిరాణ దుకాణం, టీ కొట్టు నిర్వహించుకుంటూ బతికేది. వృద్ధాప్య సమస్యలు పెరగడం, శరీరం సహకరించకపోవడంతో ఇంట్లోనే ఉంటోంది. బంధువులు రెండు పూటలా భోజనం పంపిస్తే తింటోంది. నాలుగైదు రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో కాశవ్వ ఇల్లు ఒక వైపు పూర్తిగా కూలిపోయింది. ఆ సమయంలో కాశవ్వ బయటే ఉండటంతో ప్రమాదం తప్పింది. మిగతా భాగం ఇంటి గోడలూ శిథిలమై పోవడంతో ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఉన్న ఇంటిని పూర్తిగా తొలగించి.. ఓ గూడు ఏర్పాటు చేయిస్తే బాగుటుందని కాశవ్వ కోరుకుంటోంది. ఇందుకు ప్రభుత్వం, దాతల నుంచి సాయం కోసం ఎదురుచూస్తోంది.

Updated Date - Jul 18 , 2024 | 03:33 AM

Advertising
Advertising
<