ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Sangareddy: పటాన్‌చెరు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేమహిపాల్‌రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు

ABN, Publish Date - Jun 21 , 2024 | 02:52 AM

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి నివాసాలు, కార్యాలయాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు గురువారం సోదాలు నిర్వహించారు. ఏకకాలంలో బృందాలుగా విడిపోయి పటాన్‌చెరులోని ఆయన నివాసం, పట్టణంలోని శాంతినగర్‌లో ఉండే తమ్ముడు గూడెం మధుసూధన్‌రెడ్డి,

  • మొత్తం 8 చోట్ల ఒకేసారి తనిఖీలు

  • పలు డాక్యుమెంట్లు, హార్డ్‌ డిస్క్‌ల స్వాధీనం

  • క్రషర్లు, మైనింగ్‌లో అక్రమార్జనపై ఫోకస్‌?

పటాన్‌చెరు, జూన్‌ 20: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి నివాసాలు, కార్యాలయాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు గురువారం సోదాలు నిర్వహించారు. ఏకకాలంలో బృందాలుగా విడిపోయి పటాన్‌చెరులోని ఆయన నివాసం, పట్టణంలోని శాంతినగర్‌లో ఉండే తమ్ముడు గూడెం మధుసూధన్‌రెడ్డి, నిజాంపేటలో ఉండే అల్లుడి ఇళ్లపై, పటాన్‌చెరు, హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని మహిపాల్‌రెడ్డి కార్యాలయాలు, జీఎంఆర్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. మొత్తం ఎనిమిది చోట్ల సోదాలు చేపట్టిన ఈడీ.. పలు కీలక డాక్యుమెంట్లు, హార్డ్‌ డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన సోదాలు.. రాత్రి తొమ్మిదిన్నర వరకు కొనసాగాయి.


మహిపాల్‌రెడ్డి బీఆర్‌ఎస్‌ తరఫున మూడోమారు వరుసగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. బీఆర్‌ఎస్‌ హయాంలో అధికారాన్ని అడ్డంపెట్టుకుని ఆయన అక్రమార్జనకు తెరతీశారన్న ఆరోపణలు ఉన్నాయి. సంగారెడ్డి మండలం ఆరుట్ల, పటాన్‌చెరు మండలం లక్డారం, చిన్నకంజర్ల గ్రామాల్లో పెద్దఎత్తున స్టోన్‌క్రషర్లు, క్వారీలను మహిపాల్‌రెడ్డి కుటుంబం నిర్వహిస్తోంది. మైనింగ్‌, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాల ద్వారా కోట్లాది రూపాయలు కూడబెట్టారన్న ఆరోపణలు ఉన్నాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాలతో లక్డారంలో ఆయన సోదరుడు గూడెం మధుసూధన్‌రెడ్డి నిర్వహిస్తున్న సంతోష్‌ శ్యాండ్‌స్టోన్‌ సంస్థపై దర్యాప్తు చేపట్టారు.


ఆ సంస్థలో పెద్దఎత్తున అక్రమాలు జరిగాయని జిల్లా మైనింగ్‌, రెవెన్యూ అధికారుల దర్యాప్తులో వెల్లడైంది. మైనింగ్‌ శాఖకు కట్టాల్సిన సీనరేజ్‌ సొమ్ము రూ.342 కోట్లు ఎగ్గొట్టారని లెక్కలు తేల్చారు. సదరు సొమ్మును ప్రభుత్వ ఖజానాలో జమ చేయాలని నోటీసులను సైతం జారీ చేశారు. లీజులో లేని భూమిలో అక్రమ మైనింగ్‌ పాల్పడినందుకు గూడెం మధుసూదన్‌రెడ్డిపై రెవెన్యూ, మైనింగ్‌ శాఖలు వేర్వేరుగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసులు నమోదు చేశారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు మధుసూధన్‌రెడ్డిని అరెస్ట్‌ చేసి జైలుకు సైతం పంపారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి కుటుంబసభ్యుల అక్రమార్జనపై ఈడీ దృష్టి కేంద్రీకరించినట్లు తెలిసింది.


రాజకీయ కక్షతోనే సోదాలు: మహిపాల్‌రెడ్డి

ఈడీ సోదాలు కొండను తవ్వి ఎలుకను పట్టిన చందాన ఉందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. సోదాల అనంతరం ఆయన మాట్లాడారు. ఉదయం నుంచి రాత్రి వరకు తన, తన సోదరుడి ఇళ్లలో సోదాలు చేశారని, ఇదంతా రాజకీయ కక్షతోనే జరిగిందని ఆరోపించారు. తమ వద్ద నుంచి కేవలం జిరాక్స్‌ పత్రాలు తప్ప చిల్లి గవ్వ, తులం బంగారం సైతం తీసుకెళ్లలేదని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులపై కక్ష పూరితంగా వేధింపులకు గురిచేస్తున్నాయని ఆరోపించారు.

Updated Date - Jun 21 , 2024 | 02:52 AM

Advertising
Advertising