ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TG: ‘ఆఖరి’ రోజు

ABN, Publish Date - May 11 , 2024 | 06:15 AM

అకాల వర్షాలతో ఠారెత్తించిన ఎండలు కాస్త తగ్గి వాతావరణం కొంతమేర చల్లబడినా ఎన్నికల ప్రచారంలో మాత్రం అదే ‘వేడి’! ఆ హీట్‌ ఇప్పుడు ‘చివరి’ అంకానికి చేరుకుంది. ఓటరు మహాశయులను ప్రసన్నం చేసుకునేందుకు హామీల కుమ్మరింతలు.. పరస్పర విమర్శలతో వివిధ పార్టీల నేతలు ఇప్పటికే చెప్పాల్సిందంతా చెప్పేసినా ఇంకా ఇంకా చెప్పాలనే తహతహతో ఉన్న వారికి మరో 24 గంటలు మాత్రమే మిగిలాయి! శనివారం సాయంత్రం 5 గంటలతో ఎన్నికల ప్రచారం ముగియనుంది.

  • నేటి సాయంత్రం 5 గంటలతో

  • ముగియనున్న ఎన్నికల ప్రచారం

  • ఇవాళ రాష్ట్రానికి షా, ప్రియాంక

  • వికారాబాద్‌, వనపర్తి సభలకు షా

  • తాండూరు, కామారెడ్డి సభల్లో

  • ప్రియాంక గాంధీ ప్రసంగం

  • ప్రెస్‌మీట్‌కే కేసీఆర్‌ పరిమితం

హైదరాబాద్‌, మే 10 (ఆంధ్రజ్యోతి): అకాల వర్షాలతో ఠారెత్తించిన ఎండలు కాస్త తగ్గి వాతావరణం కొంతమేర చల్లబడినా ఎన్నికల ప్రచారంలో మాత్రం అదే ‘వేడి’! ఆ హీట్‌ ఇప్పుడు ‘చివరి’ అంకానికి చేరుకుంది. ఓటరు మహాశయులను ప్రసన్నం చేసుకునేందుకు హామీల కుమ్మరింతలు.. పరస్పర విమర్శలతో వివిధ పార్టీల నేతలు ఇప్పటికే చెప్పాల్సిందంతా చెప్పేసినా ఇంకా ఇంకా చెప్పాలనే తహతహతో ఉన్న వారికి మరో 24 గంటలు మాత్రమే మిగిలాయి! శనివారం సాయంత్రం 5 గంటలతో ఎన్నికల ప్రచారం ముగియనుంది. పోలింగ్‌కు మరో 48 గంటల సమయమే ఉండటంతో శనివారం వివిధ పార్టీల అగ్రనేతలు ప్రచారాన్ని హోరెత్తించనున్నారు. ఈసారి తెలంగాణ నుంచి బీజేపీకి పక్కాగా డబుల్‌ డిజిట్‌లో సీట్లు తెచ్చిపెట్టాలన్న లక్ష్యంతో ప్రధాని మోదీ.. మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లో నాలుగు దఫాలుగా రాష్ట్రంలో పర్యటించారు. చివరగా శనివారం నారాయణపేట, హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలోని బహిరంగ సభలో పాల్గొన్నారు. మొత్తంగా మోదీ రాష్ట్రంలో పది బహిరంగ సభలు, పలు రోడ్‌షోల్లో పాల్గొన్నారు.


కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఇప్పటికే మూడు దఫాలు రాష్ట్రంలో పర్యటించి, బీజేపీ ప్రచార పర్వంలో ఊపు తెచ్చారు. నేడు మరోమారు ఆయన వనపర్తి, వికారాబాద్‌ బహిరంగ సభల్లో పాల్గొంటారు. లోక్‌సభ ఎన్నికల్లోనూ తెలంగాణ నుంచి మెజారిటీ సీట్లను కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో కాంగ్రెస్‌ ఉధృతంగా ప్రచారం నిర్వహించింది. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఇప్పటికే రాష్ట్రంలో మూడుసార్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తొలుత తుక్కుగూడలో కాంగ్రెస్‌ గ్యారెంటీ హామీలను ప్రకటించి వెళ్లారు. మే 5న ఆదిలాబాద్‌ లోక్‌సభ స్థానం పరిధిలోని నిర్మల్‌, మహబూబ్‌నగర్‌ ఎంపీ పరిధిలోని గద్వాల్‌లోని బహిరంగ సభల్లో పాల్గొన్నారు. మే 9న మరోమారు తెలంగాణకొచ్చి మెదక్‌ లోక్‌సభ పరిధిలోని నర్సాపూర్‌తో పాటు హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో పబ్లిక్‌ మీటింగ్‌లో పాల్గొని జోష్‌ తెచ్చారు. ఎన్నికల ప్రచారంలో చివరిరోజు రాష్ట్రానికి ప్రియాంక గాంధీ రానున్నారు. శనివారం మధ్యాహ్నం తాండూరులో జరిగే జనజాతర సభలో, కామారెడ్డిలో జరిగే రోడ్‌షోలో పాల్గొంటారు. అధికార కాంగ్రెస్‌ పార్టీ ప్రచార బాధ్యతలను ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి తన భుజాలపై వేసుకొని ఎలక్షన్‌ క్యాంపెయిన్‌ నిర్వహించారు. మొత్తం 27 రోజుల్లో 56 సభలు, కార్నర్‌ మీటింగ్‌లు, రోడ్‌షోలు నిర్వహించారు. ప్రచారం చివరి రోజు రేవంత్‌, ప్రియాంక పాల్గొనే రెండు సభలతో పాటు రోడోషోల్లో పాల్గొంటారు. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన బీఆర్‌ఎస్‌, లోక్‌సభ ఎన్నికల్లో గౌరవప్రదమైన సీట్లు గెలవాలనే లక్ష్యంతో బీజేపీ, కాంగ్రె్‌సకు దీటుగానే ప్రచారం నిర్వహించింది. బీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు మద్దతు ప్రచారం చేసేందుకు ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ ఏప్రిల్‌ 24న బస్సుయాత్ర చేపట్టారు. శనివారం ఆయన బీఆర్‌ఎస్‌ ఆఫీసులో మీడియా సమావేశంతో తన ప్రచారాన్ని ముగించనున్నారు.


ఎన్నికల విధుల్లో 2,79,519 మంది సిబ్బంది

లోక్‌సభ నాలుగోదశ ఎన్నికల నేపథ్యంలో.. తెలంగాణలో ఎన్నికల ప్రక్రియ తుది ఘట్టానికి చేరుకుంది. 17 లోక్‌సభ స్థానాల పరిధిలో 13న ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ నిర్వహించేలా ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తిచేసింది. షెడ్యూల్‌ ప్రకారం ఎన్నికల ప్రచార ప్రక్రియ శనివారం సాయంత్రం 5 గంటలతో ముగియనుంది. అన్ని లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని 35,809 పోలింగ్‌ స్టేషన్లలో 2,79,519 మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొననున్నారు. కాగా, 13న పోలింగ్‌ను దృష్టిలో ఉంచుకొని నేటి సాయంత్రం 5 గంటల నుంచి సోమవారం పోలింగ్‌ పూర్తయ్యే వరకు రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాలను మూసి ఉంచాలని ఎన్నికల సంఘం సంబంధిత విభాగాలను ఆదేశించింది.

Updated Date - May 11 , 2024 | 06:15 AM

Advertising
Advertising