ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Lok Sabha Elections: ఎంపీలుగా ఓడినా.. ఎమ్మెల్యేలుగా సేఫ్‌!

ABN, Publish Date - Jun 05 , 2024 | 06:15 AM

లోక్‌సభ ఎన్నికల్లో ఓటమిపాలైనా.. వారిద్దరూ ఎమ్మెల్యేలుగా కొనసాగనున్నారు. ఎన్నికల నేపథ్యంలో సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ స్థానానికి కాంగ్రెస్‌ తరపున ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌, బీఆర్‌ఎస్‌ తరపున సికింద్రాబాద్‌ ఎమ్మెల్యే పద్మారావు పోటీ చేశారు.

  • శాసనసభ్యులుగా కొనసాగనున్న దానం, పద్మారావు

హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి): లోక్‌సభ ఎన్నికల్లో ఓటమిపాలైనా.. వారిద్దరూ ఎమ్మెల్యేలుగా కొనసాగనున్నారు. ఎన్నికల నేపథ్యంలో సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ స్థానానికి కాంగ్రెస్‌ తరపున ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌, బీఆర్‌ఎస్‌ తరపున సికింద్రాబాద్‌ ఎమ్మెల్యే పద్మారావు పోటీ చేశారు. సిటింగ్‌ ఎంపీ, బీజేపీ అభ్యర్థి కిషన్‌రెడ్డిని దీటుగా ఎదుర్కొనేందుకు ఆయా పార్టీల అధిష్ఠానాలు వారిని వ్యూహాత్మాకంగా బరిలో నిలిపాయి. అయితే.. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ప్రభావం చూపలేకపోయారు. సికింద్రాబాద్‌లో బీజేపీ అభ్యర్థి కిషన్‌రెడ్డి విజయం సాధించడంతో ఆ ఇద్దరూ నిరాశకు లోనయ్యారు. వీరిద్దరూ ఒకవేళ ఎంపీగా గెలిచి ఉంటే.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సి వచ్చేది. ఆ తర్వాత వారి అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉండేదని అధికారులు చెప్పారు.

Updated Date - Jun 05 , 2024 | 06:15 AM

Advertising
Advertising