ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Fee Reimbursement: ‘ఫీజు’ బకాయిలు 6 వేల కోట్లు

ABN, Publish Date - Oct 03 , 2024 | 03:09 AM

రాష్ట్రంలోని ప్రైవేటు కాలేజీలకు రావాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు సుమారు రూ.6,000 కోట్లకు పైగా పేరుకుపోయాయి.

ప్రైవేట్‌ నర్సింగ్‌ కాలేజీల్లో జీఎన్‌ఎం కోర్సు చేసిన విద్యార్థులు.. సర్టిఫికెట్ల కోసం వెళ్తే యాజమాన్యాలు రూ.60-70 వేలు డిమాండ్‌ చేస్తున్నాయి. ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రాలేదని.. ఆ డబ్బును విద్యార్థులే చెల్లించాలని అంటున్నాయి. స్టాఫ్‌ నర్సు పోస్టులకు దరఖాస్తు గడువు దగ్గర పడుతుండడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. డీఎంఈకి ఫిర్యాదు చేస్తున్నారు.

ప్రైవేట్‌ కాలేజీల్లో బీటెక్‌, బీ ఫార్మసీ పూర్తి చేసిన విద్యార్థులదీ ఏటా ఇదే పరిస్థితి. ఫైనల్‌ ఇయర్‌ తర్వాత సర్టిఫికెట్లు ఇచ్చేందుకు ససేమిరా అంటుండడంతో అంత మొత్తం కట్టలేక ఇబ్బందులు పడుతున్నారు. కాలేజీల నుంచి సర్టిఫికెట్లు సమయానికి తెచ్చుకోలేక పీజీ ఈసెట్‌లో సీటు సాధించీ.. వదులుకున్న వారు వందల్లో ఉండడం గమనార్హం.

  • బీఆర్‌ఎస్‌ హయాంలోనే చెల్లింపులు బంద్‌

  • కాంగ్రెస్‌ సర్కారు వచ్చినా విడుదల కాని నిధులు

  • వన్‌ టైం సెటిల్‌మెంట్‌పై ప్రభుత్వం దృష్టి

  • సాధ్యం కాదని చెప్తున్న కాలేజీల యాజమాన్యాలు

  • బీటెక్‌, బీఫార్మసీ పాసైన విద్యార్థులపై బకాయిల

  • కోసం ఒత్తిడి.. సర్టిఫికెట్లు ఇచ్చేందుకు నిరాకరణ

  • తాజాగా నర్సింగ్‌ విద్యార్థులదీ ఇదే పరిస్థితి

  • స్టాఫ్‌ నర్సుల భర్తీ నేపథ్యంలో సర్టిఫికెట్ల కోసం క్యూ

  • 60-70 వేలు ఇవ్వాల్సిందేనంటున్న కళాశాలలు

  • డీఎంఈకి ఫిర్యాదులు.. విచారణకు కమిటీ

హైదరాబాద్‌/హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రైవేటు కాలేజీలకు రావాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు సుమారు రూ.6,000 కోట్లకు పైగా పేరుకుపోయాయి. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏళ్ల తరబడి నిధులు విడుదల చేయకపోవడంతో భారీగా బిల్లులు పెండింగ్‌లో పడ్డాయి. గత ఏడాది డిసెంబరు 7న కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చినా.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు నిధులు విడుదల చేయలేదు. దీంతో ఆ ఫీజులను చెల్లించాల్సిందేనంటూ విద్యార్థులపై ఆయా కాలేజీలు ఒత్తిడి తెస్తున్నాయి. పలు ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదలవుతున్న నేపథ్యంలో కొందరు విద్యార్థులు అప్పో సప్పో చేసి.. డబ్బులు కట్టేసి సర్టిఫికెట్లు తెచ్చుకుంటున్నారు. అంత మొత్తం కట్టలేని విద్యార్థులు.. ఆయా అవకాశాలను కోల్పోవాల్సిన పరిస్థితి నెలకొంది. స్టాఫ్‌ నర్సు పోస్టుల భర్తీ నేపథ్యంలో తాజాగా నర్సింగ్‌ విద్యార్థులకూ ఇదే తరహా పరిస్థితి ఎదురవుతోంది. సర్టిఫికెట్లు ఇవ్వాలంటే మొత్తం ఫీజు కట్టాల్సిందేనని స్పష్టం చేస్తుండడంతో వైద్య విద్య సంచాలకుల కార్యాలయాలకు భారీగా ఫిర్యాదులు అందుతున్నాయి.


  • వన్‌టైం సెటిల్‌మెంట్‌పై తర్జనభర్జన

పేరుకుపోయిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను వన్‌టైం సెటిల్‌మెంట్‌ పద్ధతిలో క్లియర్‌ చేయాలని కాంగ్రెస్‌ సర్కారు భావిస్తున్నట్లు తెలిసింది. ఇందుకు సంబంధించిన సాధ్యాసాధ్యాలపై దృష్టి పెట్టింది. అయి తే.. ఈ వన్‌టైం సెటిల్‌మెంట్‌ విషయంలో ఆయా కాలేజీల యాజమాన్యాలు తమ బిల్లులను కొంత మేర తగ్గించుకోవాల్సి ఉన్న నేపథ్యంలో ఏం చేయాలనే దాని పై తర్జనభర్జన పడుతున్నాయి. ఇప్పటికే కాలేజీల అసోసియేషన్‌ ప్రతినిధులకు సమాచారం ఇచ్చిన ప్రభుత్వ పెద్దలు.. బిల్లులను ఏ మేరకు తగ్గించుకుంటారనే విషయంపై ఒక అవగాహనకు వచ్చి, ప్రతిపాదనలను స మర్పించాలని సూచించారు. దీనిపై కాలేజీల యాజమాన్యాలు సమావేశమై చర్చించినట్టు తెలిసింది. అయితే.. ఈ అంశంపై ఏకాభిప్రాయానికి రాలేదని సమాచారం.


బిల్లుల చెల్లింపుల్లో జరుగుతున్న జాప్యం కారణంగా తాము ఇప్పటికే తీవ్రంగా నష్టపోతున్నామని, పైగా ప్రభుత్వం చెల్లించే ఫీజులు కూడా చాలా తక్కువగా ఉన్నాయని.. ఈ పరిస్థితుల్లో వన్‌టైం పద్ధతిలో ఫీజు తగ్గించడం ద్వారా మరింత దెబ్బతింటామనే అభిప్రాయాన్ని పలు కాలేజీలు వ్యక్తం చేసినట్టు తెలిసింది. పైగా కాలేజీల నిర్వహణ కోసం ఇప్పటికే బ్యాంకుల నుంచి రుణాలను తీసుకున్నామని, వాటిని తిరిగి చెల్లించలేకపోతున్నామని చెప్తున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బిల్లులు పెండింగ్‌లో ఉండడంతో సిబ్బందికి జీతాలను కూడా చెల్లించడం లేదని కాలేజీల ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


  • పథకంలో 12.50 లక్షల మంది విద్యార్థులు..

రాష్ట్రంలో ఇంటర్‌ నుంచి డిగ్రీ, ఇంజనీరింగ్‌, ఫార్మ సీ, నర్సింగ్‌ వంటి కోర్సులను చదువుతున్న విద్యార్థులకు వివిధ ప్రాతిపదికల మేరకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విధానాన్ని అమలు పరుస్తున్నారు. ఈ పథకం పరిధిలోకి ప్రతీ ఏడాది సుమారు 12.50 లక్షల మంది విద్యార్థులు వస్తున్నారు. ఇందుకోసం ప్రతీ ఏడాది స ర్కారుపై సుమారు రూ.2,250కోట్ల భారం పడుతోంది. రూ.6వేల కోట్ల బకాయులు ఈ ఏడాది మార్చి వరకు ఉన్నవి మాత్రమే. ఈ విద్యా సంవత్సరం ప్రారంభమైనందున వచ్చే మార్చి నాటికి కొత్త బిల్లులు కూడా జమ కానున్నాయి. దాంతో ఈ బిల్లుల భారం మరింత పెరగనుంది. ఈ పెండింగ్‌ బిల్లుల్లో సుమారు రూ.380 కోట్ల బిల్లులకు సంబంధించి అధికారులు గత ఏడాది నవంబరులో టోకెన్లను కూడా జారీ చేశారు. వీటికి సంబంధించిన చెల్లింపులను మాత్రం చేయలేదు.


  • ‘ఫీజు’ రాక.. పీజీలో చేరలేక!

ఫీజు బకాయిలను సర్కారు చెల్లించకపోవడంతో బీటెక్‌, బీఫార్మసీ పాసైన విద్యార్థులకూ ఏటా ఇదే తరహా పరిస్థితి ఎదురవుతోంది. పీజీఈసెట్‌లో అర్హత పొంది, కౌన్సెలింగ్‌ ద్వారా సంపాదించిన ఎంటెక్‌, ఎం ఫార్మసీ సీట్లను వదులుకునే పరిస్థితి ఏర్పడుతోంది. కొందరు సీట్లను వదులుకుంటుంటే.. మరికొందరు అప్పోసొప్పో చేసి ఫీజులు కట్టి సర్టిఫికెట్లు తెచ్చుకుంటున్నారు. దీనిపై తక్షణమే ప్రభుత్వం స్పందించాలని.. విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇచ్చేలా కాలేజీలకు ఆదేశాలివ్వాలని విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి. ఫీజు బకాయిలను విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి.


  • నర్సింగ్‌ కాలేజీలపై ఫిర్యాదుల వెల్లువ

ఫీజు బకాయిలు చెల్లించకపోవడంతో జీఎన్‌ఎం, బీఎస్సీ నర్సింగ్‌ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇచ్చేందుకు ప్రైవేట్‌ కాలేజీలు నిరాకరిస్తున్నాయి. మొత్తం ఫీజును చెల్లిస్తేనే ధ్రు వపత్రాలు ఇస్తామని స్పష్టం చేస్తున్నాయి. 2,050 స్టాఫ్‌ నర్సు పోస్టుల భర్తీకి గత నెలలో మెడికల్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు నోటిఫికేషన్‌ విడుదల కాగా, ఈ నెల 14వ తేదీ వరకే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఇదే విషయమై రెండు రోజుల క్రితం మెహదీపట్నం సమీపంలోని నైటింగేల్‌ నర్సిం గ్‌ కాలేజీకి చెందిన వంద మంది విద్యార్థు లు కోఠీలోని డీఎంఈ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. సర్టిఫికెట్లు కావాలంటే రూ.65-75 వేలు చెల్లించాలని, పట్టు చీరలు కూడా కొనివ్వాలని స దరు కాలేజీ యాజమాన్యం డిమాండ్‌ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.


బూతులు తిడుతూ దిక్కున్న చోట చెప్పుకోమన్నారని డీఎంఈకి వివరించారు. కొందరు విద్యార్థులు ఇప్పటికే డబ్బులు చెల్లించారంటూ సంబంధిత రశీదులను అందజేశారు. ఇదే విధంగా, వారం రోజుల నుంచి మరికొన్ని కాలేజీలపైనా ఫిర్యాదులు రావడంతో స్పం దించిన వైద్యఆరోగ్య శాఖ.. ముగ్గురు సభ్యులతో మంగళవారం విచారణ కమిటీని వేసింది. తక్షణమే రంగంలోకి దిగిన కమిటీ సభ్యులు విద్యార్థినులనుంచి వివరాలను సేకరిస్తున్నట్లు తెలిసింది. బీఆర్‌ఎస్‌ హయాం నుంచీ ఫీజు బకాయిలు పెండింగ్‌లో ఉండడం వల్లే.. విద్యార్థుల దగ్గర్నుం చి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ప్రైవేటు నర్సింగ్‌ కాలేజీల అసోసియేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షు డు చెన్నారెడ్డి వెల్లడించారు. కాగా, కొన్ని కాలేజీల కు కొద్దిమొత్తంలో బకాయిలు అందినా.. మొత్తం ఫీజు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి.

Updated Date - Oct 03 , 2024 | 03:09 AM