ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Justice Ghosh: రేపటి నుంచి కాళేశ్వరం విచారణపై దృష్టి..

ABN, Publish Date - Jun 09 , 2024 | 04:30 AM

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంపై న్యాయ విచారణ ప్రక్రియ సోమవారం నుంచి ఊపందుకోనుంది. ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిటీ విచారణ జరుపుతున్న సంగతి విదితమే.

  • ఈ నెల 16 దాకా హైదరాబాద్‌లోనే జస్టిస్‌ ఘోష్‌

హైదరాబాద్‌, మహదేవపూర్‌ రూరల్‌ జూన్‌ 8(ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంపై న్యాయ విచారణ ప్రక్రియ సోమవారం నుంచి ఊపందుకోనుంది. ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిటీ విచారణ జరుపుతున్న సంగతి విదితమే. ఈ నెల 10 నుంచి వరుసగా ఆరు రోజుల పాటు బూర్గుల రామకృష్ణారావు భవన్‌లో ఉన్న కమిషన్‌ కార్యాలయంలో అధికారులతో జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ సమావేశం కానున్నారు. శనివారం సుందిళ్ల బ్యారేజీని సందర్శించిన ఆయన.. అక్కడ మరమ్మతు పనులను పరిశీలించారు. వాటిపై రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.


ఇక విచారణలో భాగంగా ఎవరెవరికి నోటీసులు ఇవ్వాలనే దానిపై జస్టిస్‌ ఘోష్‌ నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి, నిర్మాణ, నిర్వహణ లోపాలపై కమిషన్‌కు 54 దాకా ఫిర్యాదులు అందాయి. ఫిర్యాదులతోపాటు ఎన్‌డీఎ్‌సఏ ఇచ్చిన మధ్యంతర నివేదిక, కాగ్‌, విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సమర్పించిన నివేదికల ఆధారంగా ఈ ప్రాజెక్టులోని బ్యారేజీల నిర్మాణంలో నిర్ణయాత్మక పాత్ర పోషించిన అధికారులు, ఇంజనీర్లు, ప్రజాప్రతినిధులకు నోటీసులు ఇవ్వనున్నారు. తొలుత నోటీసులు జారీ చేసి, స్పందించని పక్షంలో సమన్లపై కమిషన్‌ నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. వాస్తవానికి కాళేశ్వరంపై నివేదిక అందించడానికి ఈ నెల 30వరకే ప్రభుత్వం గడువు ఇచ్చింది. అయితే ఇప్పట్లో విచారణ పూర్తయ్యే అవకాశాలు లేకపోవడంతో మరో మూడు నెలలు నివేదిక అందించడానికి గడువు ఇచ్చే అవకాశాలున్నాయి.

Read more!

Updated Date - Jun 09 , 2024 | 04:30 AM

Advertising
Advertising