ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Passport: ఐదు రోజులుగా.. పాస్‌పోర్టు సేవలు బంద్‌..

ABN, Publish Date - May 31 , 2024 | 06:00 AM

హైదరాబాద్‌లోని పాస్‌పోర్టు కేంద్రాల్లో ఐదు రోజులుగా సేవలు నిలిచిపోయాయి. బేగంపేట్‌, అమీర్‌పేట్‌, టోలిచౌకిల్లోని పాస్‌పోర్టు సేవా కేంద్రాల్లో స్లాట్‌ బుకింగ్‌ను నిలిపివేశారు. నిజానికి ఆన్‌లైన్‌లో ఈ కేంద్రాలకు సంబంధించిన స్లాట్లు ఉన్నట్లు కనిపిస్తున్నా.. బుకింగ్‌ జరగడం లేదు.

  • పలు కేంద్రాల్లో స్లాట్‌ బుకింగ్‌ నిలిపివేత

  • ఫిర్యాదు చేసినా.. స్పందించని అధికారులు

హైదరాబాద్‌, మే 30 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని పాస్‌పోర్టు కేంద్రాల్లో ఐదు రోజులుగా సేవలు నిలిచిపోయాయి. బేగంపేట్‌, అమీర్‌పేట్‌, టోలిచౌకిల్లోని పాస్‌పోర్టు సేవా కేంద్రాల్లో స్లాట్‌ బుకింగ్‌ను నిలిపివేశారు. నిజానికి ఆన్‌లైన్‌లో ఈ కేంద్రాలకు సంబంధించిన స్లాట్లు ఉన్నట్లు కనిపిస్తున్నా.. బుకింగ్‌ జరగడం లేదు. దీంతో నగరవాసులు పాస్‌పోర్టు దరఖాస్తుకు తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు. నిజానికి వేసవి సెలవుల్లో పాస్‌పోర్టుకు దరఖాస్తులు పెరుగుతుంటాయి. తీవ్ర డిమాండ్‌ ఉన్నా.. ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయ అధికారులు ఆయా సేవా కేంద్రాల్లో సర్వీసులను నిలిపివేయడంతో.. నగరవాసులు ఇతర జిల్లాలకు పరుగులు తీస్తున్నారు. నగర వాసుల తాకిడి పెరగడంతో పొరుగునే ఉన్న మేడ్చల్‌, వికారాబాద్‌, నల్లగొండ పాస్‌పోర్టు కేంద్రాల్లో రద్దీ కనిపిస్తోంది. పాస్‌పోర్టు దరఖాస్తుకు దూరాభారాన్ని భరిస్తున్నామని నగర పౌరులు వాపోతున్నారు. ఈ సమస్యపై ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయానికి ఫిర్యాదులు వెళ్తున్నా.. వాటిపై స్పందించేవారే లేరని పలువురు దరఖాస్తుదారులు ఆరోపించారు.

Updated Date - May 31 , 2024 | 06:00 AM

Advertising
Advertising