ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Sabitha Indra Reddy: మంత్రి కావాలంటే అదృష్టం ఉండాలి!

ABN, Publish Date - Jun 29 , 2024 | 04:58 AM

మాజీ మంత్రి, మహేశ్వరం బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవి రావాలంటే అదృష్టం కూడా ఉండాలని, నుదుటి రాత ఎలా ఉంటే అలా జరుగుతుందని అన్నారు.

  • బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సబిత ఆసక్తికర వ్యాఖ్య

సరూర్‌నగర్‌, జూన్‌ 28 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి, మహేశ్వరం బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవి రావాలంటే అదృష్టం కూడా ఉండాలని, నుదుటి రాత ఎలా ఉంటే అలా జరుగుతుందని అన్నారు. శుక్రవారం బడంగ్‌పేట్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయంలో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా ఆమె విలేకరులతో చిట్‌చాట్‌గా మాట్లాడారు. ‘‘బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఇటీవల ఎర్రవల్లి ఫాంహౌ్‌సలో ఎమ్మెల్యేలతో ఏర్పాటు చేసిన మీరు వెళ్లలేదు కదా! దీనిపై స్థానికంగా పార్టీ శ్రేణులు అయోమయంలో ఉన్నాయి. మీరు కూడా పార్టీ మారతారనే అనుమానం వారిలో కలుగుతున్నట్టు కనిపిస్తోంది’’ అని ‘ఆంధ్రజ్యోతి’ విలేకరి ప్రస్తావించగా, ‘‘కేసీఆర్‌ కేవలం హైదరాబాద్‌, మేడ్చల్‌ జిల్లాల ఎమ్మెల్యేలను మాత్రమే పిలిచారు. ఇంకా మా వంతు (రంగారెడ్డి జిల్లా వంతు) రాలేదు‘’ అని సబితా ఇంద్రారెడ్డి బదులిచ్చారు. ‘‘రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి కూడా ముఖ్యమంత్రేనట.


ఏ శాఖకు ఎవరు మంత్రో అర్థం కావడంలేదు. ఇంతకీ హోంశాఖ ఎవరి వద్ద ఉందో, ఆ శాఖ మంత్రి ఎవరో ఎవరికీ తెలియదు’’ అని ఆమె అన్నారు. దీంతో, ‘‘మీ కోసమే ఖాళీగా ఉంచారేమో మేడమ్‌! మీరు వెళ్తే మీకే ఆ శాఖ ఇస్తారేమో!’ అని రిపోర్టర్‌ నవ్వుతూ వ్యాఖ్యానించగా.. ‘‘మంత్రి పదవి కావాలంటే అదృష్టం కూడా ఉండాలి. ఎంత కష్టపడ్డా నుదుటి రాత బాగా లేకుంటే ఏమీ చేయలేం’’ అని సబిత సరదాగా వ్యాఖ్యానించారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలో లేకుండా పదవి ఎలా సాధ్యమవుతుందని గానీ, మరో ఐదేళ్ల తర్వాత చూద్దామని గానీ ఆమె అనకపోవడం చర్చనీయాంశమైంది. ఎమ్మెల్యే సబిత చేసిన వ్యాఖ్యలను బట్టి రాజకీయంగా ఏదో జరగబోతోందనే సంకేతాలు వెలువడినట్టేనని స్థానిక నేతలు గుసగుసలాడుకుంటున్నారు. మరోవైపు రంగారెడ్డి జిల్లాకు చెందిన చేవెళ్ల బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కాలె యాదయ్య శుక్రవారమే కాంగ్రె్‌సలో చేరడంతో సబితమ్మ సైతం అదే దారిలో పయనించే అవకాశం లేకపోలేదనే అభిప్రాయాలు స్థానికంగా వ్యక్తమవుతున్నాయి.

Updated Date - Jun 29 , 2024 | 04:58 AM

Advertising
Advertising