ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kodangal: పచ్చని కొడంగల్‌ను విషపూరితం చేయడమే సీఎం లక్ష్యం

ABN, Publish Date - Oct 10 , 2024 | 04:26 AM

కొడంగల్‌లో ఫార్మా కంపెనీ ప్రారంభానికి ప్రభుత్వం ముందుకు వస్తే సీఎం రేవంత్‌ రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌ రెడ్డి హెచ్చరించారు.

  • ఫార్మా కంపెనీ తెస్తే సీఎం ఇంటిని ముట్టడిస్తాం

  • మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌ రెడ్డి

కొత్తకోట, అక్టోబరు 9: కొడంగల్‌లో ఫార్మా కంపెనీ ప్రారంభానికి ప్రభుత్వం ముందుకు వస్తే సీఎం రేవంత్‌ రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌ రెడ్డి హెచ్చరించారు. ఫార్మా కంపెనీకి వ్యతిరేకంగా బుధవారం వికారాబాద్‌ జిల్లా దుద్యాల మండలం పోలేపల్లి గ్రామం నుంచి చేపట్టాల్సిన పాదయాత్రకు ముందే మాజీ ఎమ్మెల్యే నరేందర్‌ రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్‌ కుమార్‌ రెడ్డిలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా నరేందర్‌ రెడ్డి విలేకరులతో మాట్లాడారు.


ఉదయం తమ పాదయాత్రకు అనుమతి ఇచ్చి యాత్ర ప్రారంభమైన తరువాత పోలీసులు భగ్నం చేయడం ఏమిటని ప్రశ్నించారు. పచ్చని పంట భూములతో ఉన్న కొడంగల్‌ ప్రాంతాన్ని విషపూరితం చేయాలని రేవంత్‌ రెడ్డి లక్ష్యంగా ఉందని ఆరోపించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎం తలుచుకుంటే మంచి కంపెనీలు ముందుకు వస్తాయని, వాటిని ఎందుకు ఇక్కడికి మంజూరు చేయడం లేదో చెప్పాలని పేర్కొన్నారు.

Updated Date - Oct 10 , 2024 | 04:26 AM